Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

jAbilli enDallO - జాబిల్లి ఎండల్లో


చిత్రం : అగ్ని(Agni) (1989)

రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : హంసలేఖ, గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి


పల్లవి :
అతడు: జాబిల్లి ఎండల్లో సరసాలు
సరదాలు కసిగా కథలా మొదలాయే
ఆమె: ఈ పూలదండల్లో యమకాలు
చమకాలు తొలిగా చలిగా కథలాయే
అ: తనువుల కదలిక నడుముల
కలయిక ఏమి తాళమో
ఆ: అదిమెను అడగక బిగువును
వదలక ఎంత తాపమో ॥
చరణం : 1
అ: చిన్నప్పుడు ఈడున్నప్పుడు వేడున్నప్పుడు
రేగే చప్పుడు
ఎక్కడికక్కడ ఎక్కిడి తొక్కిడి సోకులు సిక్కడి ముద్దుల
ముట్టడి సాగినప్పుడు... తొందరే పుట్టినప్పుడు...
ఆ: ఈ కుప్పెడు నా గుట్టిప్పుడు విడగొట్టిప్పుడు
జతకట్టిప్పుడు
చక్కెర చెక్కిలి చెక్కిన ఎంగిలి అంటిన కౌగిలి
అక్కిటి లోగిలి చేరినప్పుడు... సిగ్గులు జారినప్పుడు...
అ: జాజుల మల్లెల మోజుల వెల్లువ
రోజొక వెన్నెల చిలికిన వలపుల
అలికిడికి తడిసిన తనువుల
సందెల చిందిన చందన కుంకుమ
వందనమన్నది ఇంధనమైనది
ఇద్దరి మోహ లాహిరిలో ॥
చరణం : 2
ఆ: మాటిచ్చుకో ఎదచోటిచ్చుకో
పొదమాటిచ్చుకో పెదవే పుచ్చుకో
అత్తరు మల్లెల మత్తులలోబడి
ఒత్తరి జీవుడు
హత్తుకుపోయిన రాసలీలలో... ఇప్పుడే బాసచేసుకో...
అ: పూవందుకో చిరునవ్వందుకో
జత నువ్వెందుకో నీకు లవ్వెందుకో
మెత్తని కాముడి జిత్తులలో పడి ఒత్తుకు పోయెడి
ఒంపులలో సుడి తాకి చూడనా
చూడని తళుకు చూడనా...
ఆ: చుక్కలకందక చిక్కని సందిట చెక్కిలి ఇచ్చట
తెలిసిన వయసుల
మదనముడి బిగిసిన మనసుల సందడి ఊహల
సందుల దూరిన పొందుల వేళకు
విందులు కోరిన తేనెల వానల తాకిడిలో॥
External Link:
| Download |

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |