Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

krishNA prEmamayA - కృష్ణా ప్రేమమయా

పల్లవి :

ఆమె: కృష్ణా...
కృష్ణా... ప్రేమమయా...
నా జీవితము నీకంకితము
నీవే నాకు ఆలంబనము
నా జీవితము నీకంకితము
చరణం : 1
ఆ: కన్నెమనసు కదిలించితివి
కలలు రేపే నన్ను కరిగించితివి
వలపు విందు చవి చూడకముందే (2)
తొలచివేసితివి బ్రతుకే కథ చేసితివి
॥జీవితము॥

చరణం : 2

అతడు: కృష్ణా... కృష్ణా... దయసాగరా
నా జీవితము నీకంకితము
నీవే నాకు ఆలంబనము
నా జీవితము నీకంకితము
లేమిని ఓర్చితిని...
నిన్నేమని అడుగక నమ్మితిని
నమ్మనివారలు పెట్టిన బాధలు
నీ లీలేనని భరించితిని
నా శక్తికి మించిన పరీక్ష నీది
నీ తృప్తికి చాలని భక్తియా నాది
అ: నా జీవితము నీకంకితము
ఆ: నా జీవితము నీకంకితము

చరణం : 3

ఆ: ఇచ్చిన మనసు
వసివాడక మునుపే
వచ్చి ఏలుకోవేమి స్వామీ...
వచ్చి ఏలుకోవేమి...
అ: చెర విడిపించి చెడునోడించి
ఉనికిని చాటుము స్వామీ...
నీ ఉనికి ని చాటుము స్వామీ...
ఆ: రావేమి నా స్వామీ...
అ: రావేమి నా స్వామీ...
ఆ: స్వామీ... నా స్వామీ...
అ: స్వామీ... కృపరాదేమీ...

చిత్రం : శ్రీకృష్ణవిజయం(srIkrishAn vijayam) (1971)

రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : పెండ్యాల నాగే శ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |