O javarAlA - ఓ జవరాలా
చిత్రం : ఉషాపరిణయం(ushApariNayam) (1961)
రచన : సదాశివబ్రహ్మంసంగీతం : సాలూరి హనుమంతరావు
గానం : పి.బి.శ్రీనివాస్, జమునారాణి
సాకీ :
అతడు: ఓ... జవరాలా... ఉషాబాలా...
ఆమె: ఎవరో... నను పిలిచేవారెవరో...
అ: నీ మనసే నిను పిలిచినది నీ వయసే
ఆ: ఆహా తెలిసే నా మదిలో
నీ రూపమే మెరిసే
అ: అదిగో మన ప్రేమ చెలువారు సీమ
పరమానందభరితము కాంచుమా॥
ఆ: ఆ... ఏమో... నే పసిదానరా
నీ వశమైతిరా నను దరిజేర్చరా
ఏమో... నే పసిదానరా నీ వశమైతిరా
నను దరిజేర్చరా ప్రియుడా
చరణం : 1
అ: చల్లన నెలరాజు కురిపించె సుధలు
విల్లున వలరాజు సంధించె విరులు
చల్లన నెలరాజు కురిపించె సుధలు
విల్లున వలరాజు సంధించె విరులు
ఆ: మనమున చెలరేగె నవభావన...
మనమున చెలరేగె నవభావన
అనురాగముదయించె నాలోన
అ: అదిగో మన ప్రేమ చెలువారు సీమ
చరణం : 2
ఆ: రావోయి... రావోయి...
రావోయి మనోనాయకా
ప్రేమగగనాలలో
మధుర భావాలతో ప్రణయ రాజ్యాలు
పాలించి వినోదింపగా
రావోయి మనోనాయకా...
అ: వలచి వలపించే నినుపోలునేమో
చెలిమి లభియించె ఎనలేని ప్రేమ॥
సుమశరు కోపము హిమతరు తాపము
సుమశరు కోపము హిమతరు తాపము
ఎదిరించి ముదమార పోదాము
అదిగో మన ప్రేమ చెలువారు సీమ
చరణం : 3
ఆ: తొలకరి మెరుపుల అందాలు రోసి
అ: తారల తళుకులతో పందాలు వేసి
ఆ: తొలకరి మెరుపుల అందాలు రోసి
అ: తారల తళుకులతో పందాలు వేసి
జిలిబిలి నెలవంకనుయ్యాల చేసి
ఏలుదమిక మీద ఆకాశం...
మనమేలుదమిక మీద ఆకాశం...
ఇద్దరూ: ఇదియే మన ప్రేమ చెలువారు సీమ
పరమానంద భరితము కాంచుమా
ఇదియే మన ప్రేమ చెలువారు సీమ... ఆ...
External Link:
|Listen Audio | Link |