Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

anaganagA oka rAju - అనగనగా ఒక రాజు

పల్లవి :
ఆమె: అనగనగా ఒక రాజు
అనగనగా ఒక రాణి (2)
రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న (2)॥
చరణం : 1
అతడు: ఆ రాజుకు ఏడుగురు
కొడుకులున్నారు
వారు చదువుసంధ్యలుండి కూడ
చవటలయ్యారు... ఒట్టి చవటలయ్యారు...
ఆ: అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి
చరణం : 2
అ: పడకమీద తుమ్మముళ్లు పరచెనొక్కడు
అయ్యో ఇంటి దీపమార్పివేయనెంచెనొక్కడు
తల్లీతండ్రులు విషమని తలచెనొక్కడు (2)
పడుచు పెళ్లామే బెల్లమని భ్రమసెనొక్కడు...
భ్రమసెనొక్కడు॥
చరణం : 3
అ: కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచీ
ప్రేమయనే పాలుపోసి పెంపుచేసెను ॥
ఆ: కంటిపాప కంటె ఎంతొ గారవించెను (2)
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను తానుండసాగెను॥
చరణం : 4
అ: నాది నాది అనుకున్నది నీది కాదురా
నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా ॥నాది॥
కూరిమిగలవారంతా కొడుకులేనురా (2)
జాలి గుండె లేని కొడుకు కన్న
కుక్కమేలురా... కుక్కమేలురా॥

గానం : ఘంటసాల, పి.సుశీల
* * * * *

chaduvurAni vADavani - చదువురాని వాడవనీ

పల్లవి :
చదువురాని వాడవనీ దిగులు చెందకు (2)
మనిషి మదిలోన మమత లేని
చదువులెందుకు ॥
చరణం : 1
మంచు వంటి... మలె ్లవంటి...
మంచు వంటి మల్లెవంటి మంచి మనసుతో (2)
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు॥
చరణం : 2
ఏమి చదివి పక్షులు పెకైగురగలిగెను
ఏ చదువు వల్ల చేపపిల్లలీదగలిగెను ॥
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పెను (2)
కొమ్మ పైని కోకిలమ్మకెవడు పాట నేర్పెను॥
చరణం : 3
తెలివిలేని లేగదూడ పిలుచును అంబాయని
ఏ మెరుగని చంటిపాప ఏడ్చును అమ్మాయని ॥
చదువులతో పనియేమి హృదయమున్న చాలు (2)
కాగితంపు పూలకన్న గరికపువ్వు మేలు॥

గానం : పి.సుశీల
చిత్రం : ఆత్మబంధువు(Atma bandhuvu) (1962)
రచన : డా॥సి.నారాయణరెడ్డి, సంగీతం : కె.వి.మహదేవన్

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |