Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

dEvadEvam bhajE - దేవదేవం భజే

చిత్రం: అత్తారింటికి దారేది..(attArinTiki dArEdi) (2013)

రచన: రామజోగయ్యశాస్త్రి
గానం: నరేంద్ర
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్


దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి
రణపుంగవం రామం॥
వేల సుమ గంధముల గాలి అలలా
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాల హృదయాల తడిమేటి తడిలా
కరుణగల వరుణుడై కరిగినాడు
అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం
వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణ ఋణబంధముల తరువును
పుడమిగ నిలుపుటె తన గుణం॥

*******

kirrAku kirrAku - కిర్రాకు కిర్రాకు

చిత్రం: అత్తారింటికి దారేది..(attArinTiki dArEdi) (2013)

రచన: రామజోగయ్యశాస్త్రి
గానం : పాలక్కడ్ శ్రీరామ్, రీటా
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

పల్లవి :
ఓసోసి పిల్లపోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే
రాకాసి రాకుమారి కోపంగా పళ్లునూరి ఐ లవ్మూ చెప్పినావే
అందంగ పెట్టినావే స్పాటు
గుండె తాకిందే ప్రేమ గన్ను షాటు
ఏది లెఫ్టు ఏది నాకు రైటు మందు కొట్టకుంటనే నేను టైటు
క్యాట్ బాలు లాగిపెట్టి మల్లెపూలు చల్లినట్టు
షర్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్టు జరిగినట్టు
పిచ్చి పిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు
ర్రాకు కేక పెట్టించావే
చరణం : 1
పెదవి స్ట్రాబెరీ పలుకు క్యాడ్‌బరీ
సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ
కళ్లలో కలల గ్యాలరీ చిలిపిచూపులో
కొలువుంది ద్రాక్ష మాధురి
అత్తరేదో చల్లినావే అత్తగారి పిల్లా
సిత్తరాల నవ్వుపైన రతనాలు జల్లా
కొత్తప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా
పిచ్చి పిచ్చిగుందే॥
చరణం : 2
మాంకాళి జాతర్లో మైకుసెట్టు మోగినట్టు
మైండంత గోలగుందే
బెంగాలీ స్వీటులోన భంగేదో కలిపి తిన్న
ఫీలింగు కమ్ముతోందే
కౌబాయి డ్రెస్సు వేసిన ట్టూ క్రష్ణరాయలోరి గుర్రమెక్కినట్టు
భూమ్మీద ఉన్నచోటే ఉంటూ
ఆ మూను మీద కాలు పెట్టినట్టు
సిమ్ము లేని సెల్లులోకి ఇన్‌కమింగు వచ్చినట్టు
సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడరద్దినట్టు పిచ్చిపిచ్చిగుందే॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |