eDArilO kOyila - ఎడారిలో కోయిల
చిత్రం : పంతులమ్మ(pantulamma) (1977)
రచన : వేటూరి సుందరరామమూర్తిసంగీతం : రాజన్-నాగేంద్ర,
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఎడారిలో కోయిల తెల్లారని రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా (2)
పాడింది కన్నీటిపాట ॥
చరణం : 1
ఎద వీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నా దేవత
కల అయితే శిల అయితే మిగిలింది
ఈ గుండె కోత
నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలు పూత
రగిలింది ఈ రాలు పూత విధిరాత చేత నా స్వర్ణ సీత॥
చరణం : 2
నా రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్లు నూరేళ్లుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతి కంటే
చేదైన ఒక తీపి పాట.... (2)
చెలిలేని పాట... ఒక చేదు పాట॥
* * * * * * *
tEneTIga kuDutuNTE - తేనెటీగ కుడుతుంటే
చిత్రం : పంతులమ్మ(pantulamma) (1977)
రచన : వేటూరి సుందరరామమూర్తిసంగీతం : రాజన్-నాగేంద్ర,
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి :
ఆమె: తేనెటీగ కుడుతుంటే తీపిగుంటదా (2)
ఐనా నువ్వు కన్ను కొడుతుంటే
ఎన్నెలొస్తదీ ఎన్నో వన్నెలిస్తదీ
అతడు: పూలజల్లు పడుతుంటే.... హాహా అహాహా...
పూలజల్లు పడుతుంటే ఎల్లువొస్తదా
ఐనా నువ్వు పక్కకొస్తుంటే
పండగొస్తదీ వయసే పంటకొస్తదీ
చరణం : 1
అ: అయ్యారే
వయ్యారమూగింది ఉయ్యాల
ఇయ్యాల నా వలపే
నీ తలుపు తీయాలా
ఏసింది ఈడు ఈల చేసింది గోల
నీ జోడు కావాలా నా తోడు రావాలా
ఆ: సందేళ నీ సోకు జాబిల్లి కావాలా
చీకట్లో నీ నవ్వు పువ్వులెట్టుకోవాలా
నీ వేడి నాకు ఓడి చల్లారే ఈ వేళ
నీ వాడి చూపుల్లో తెల్లారిపోవాలా॥
చరణం : 2
అ: గోరింక తాకంగ నెలవంక నవ్వాలా
ఆ: గోరంత నీ ఎలుగు కొండంత కావాలా
అ: ఆ కంటికి కన్ను కాటుకై పోవాలా
ఆ: నీ చూపు నా చూపు చుట్టాలు కావాలా
అ: వానొచ్చి వరదల్లే నీ వయసు పొంగాలా
ఆ: నేనొచ్చి వలపల్లే వాటేసుకోవాలా
అ: నా ఎండకే నీబుగ్గ ఎన్నెల్లు కాయాలా
ఆ: కౌగిట్లో నా బ్రతుకు కడతేరిపోవాలా॥
External Link:
| Download Pantulamma (1977) All Songs |