Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

OhO bulli pAvuramA - ఓహో3బుల్లి పావురమా


చిత్రం : బృందావనం(brindAvanam( (1992)

రచన : వెన్నెలకంటి
సంగీతం : మాధవపెద్ది సురేష్
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి


పల్లవి :
అతడు: ఓహో ఓహో ఓహో
బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా... ఓ...
అలకలు వారి సొంతమా
ఆమె: ఓహో ఓహో ఓహో
బుల్లి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా... ఓ...
శ్రుతి ఇంక మించనీకుమా...
చరణం : 1
అ: మాటే వినకుంటే బైటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంటా
ఆ: అమ్మో మగవారు అన్నిటా తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
అ: కోపం తీరాలంట తాపం తగ్గాలంట
ఆ: తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
అ: మాటామంతీ మర్యాదే
అపచారమా!॥ఓహో॥
చరణం : 2
అ: నీయంతియ్యంగా
చెయ్యగ రమ్మంటా
వియ్యాల పందిట్లో కయ్యం తగదంట
ఆ: గిల్లికజ్జాలే చెల్లవు పొమ్మంటా
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట
అ: వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట
ఆ: కొంటెకుర్రాళ్లకూ అదియే సరియంట
అ: తగనీ తెగనీ తగువంతా తన నైజమా॥ఓహో॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |