Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

inthakAlam - ఇంతకాలం


చిత్రం: ఎటో వెళ్లిపోయింది మనసు(eTO veLLipOyindi manasu) (2012)

రచన: అనంత శ్రీరామ్
సంగీతం: ఇళయరాజా
గానం: రమ్య



పల్లవి :
ఇంతకాలం కోరుకున్న దారి ఇదేనా
ఆశలన్నీ తీరుతున్న తీరు ఇదేనా
ఇంతకాలం కోరుకున్న దారి ఇదేనా
ఆశలన్నీ తీరుతున్న తీరు ఇదేనా
చుట్టూ ఏమౌతున్నా అంతా నమ్మాల్సిందేనా
ఓహో ఇష్టం ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా
ఈ వింతలింకెన్నో చూడాలో॥
చరణం : 1
నేర్చుకోనా మెల్లగా మరచిపోవటం
మార్చలేనుగా నేనిక మరల ఆ గతం
ఏడు రంగులు వెలిసిన నీ వానవిల్లునా
తీపి నింగిపై విడిచిన తేనెజల్లునా
సాగరానికీ కౌగిలివ్వని జీవనదిలాగ ఇంక ఇంకనా॥
చరణం : 2
ప్రాణబంధం తెంచుకో మూడుముళ్లతో
వేడుకోలునే అందుకో మూగసైగతో
ఒక్క రాతిరే మనకిలా మిగిలి ఉన్నది
తెల్లవారితే చీకటి వెలుగు చేరదు
చిన్ననాటికి నిన్నమొన్నకి సెలవని చేతులూపి వెళ్లనా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |