gOgulupUchE - గోగులు పూచే
చిత్రం : మురారి(murAri) (2001)
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రిగానం : బాలు, అనురాధా శ్రీరాం, బృందం
సంగీతం : మణిశర్మ
పల్లవి :
ఓ లచ్చ గుమ్మాడి (2)
పొద్దూపొడిచే పొద్దుపొడిచే ఓ లచ్చ గుమ్మాడి
పుత్తడి వెలుగులు ఉహూహూ...
ఓ లచ్చ.. మ్మ్...
అతడు: అందానికే అద్దానివే
కట్టున్న బొట్టున్న గోదారివే
అమ్మాయికే అర్థానివే
మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చిన గోరింటవే
కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే
మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటూ నా చేయి ఒట్టేసేందుకే ఉంది
చెలి చూడు నా చేవ చుట్టేసేందుకే ఉంది॥
చరణం : 1
నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నది
నిన్ను పిలిచేందుకే... నాకు పిలుపున్నది
నిన్ను గెలిచేందుకే... నాకు పొగరున్నది
ఒక్కటయ్యేందుకే ఇద్దరం ఉన్నది
నీ పూజకై వచ్చేందుకే
వేవేల వర్ణాల పూలున్నవి
నీ శ్వాసగా మారేందుకే
ఆ పూలగంధాల గాలున్నది
చరణం : 2
మిలమిల మిలమిల ముక్కెర నేనై వస్తా
నీ కళ కళ కళ మోమును చూస్తూ ఉంటా
గలగల గలగల మువ్వను నేనై వస్తా
నీ అడుగడుగున కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి
కడ దాకా కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి
కలతల్ని కరిగించనా ॥
నీ కోటగా మారేందుకే
నా గుండె చాటుల్లో చోటున్నది
నీ వాడిగా ఉండేందుకే
ఈ నిండునూరేళ్ల జన్మున్నది ॥అంటూ॥
రచన : చంద్రబోస్, గానం : శంకర్‌మహదేవన్
********
bhAmA bhAmA bangAru - భామా భామా బంగారు
పల్లవి :బృందం: జుంజుం చిక్కినానా ఝనక్ జా (10)
అతడు: భామా భామా బంగారు బాగున్నావే అమ్మడు భామా భామా బంగారు
బాగున్నావే అమ్మడు
ఆమె: బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడూ
అ: ముద్దు కావాలి... హత్తుకోవాలి...
ఆ: సిగ్గుపోవాలి అగ్గి రేగాలి ఏంచేస్తావో చెయ్యి॥
చరణం : 1
బృం: తయ్యా తయ్యా
తయ్యా తయ్యా తయ్యా... (3)
అ: ఎంచక్కా నీ నడుమెక్కే
ఆ కడవై ఉంటా సరదాగా
ఆ: వాటంగా చెయ్ వేస్తుంటే
అది వడ్డాణం అనుకుంటాగా
అ: ముచ్చటగా మెడలో గొలుసై
ఎద సంగతులన్నీ వింటాగా
ఆ: గుట్టంతా చూస్తానంటూ
గుబులెత్తిస్తావా సారంగా
అ: యమకారంగా మమకారంగా
నిను చుట్టేస్తా అధికారంగా
ఆ: గారంగా సింగారంగా
ఒదిగుంటా ఒళ్లో వెచ్చంగా॥॥
చరణం : 2
అ: అబ్బోసి సొగసొగ్గేసి
మహ చెలరేగావే లగిలేసి
ఆ: నిను చూసి తెగ సిగ్గేసి
తల వంచేశా మనసిచ్చేసి
అ: చుట్టేసి పొగ పెట్టేసి నను లాగేశావే ముగ్గేసి
ఆ: ఒట్టేసి జత కట్టేసి వగలిస్తానయ్యా ఒలిచేసి
అ: ఓసోసి మహ ముద్దేసి
మతి చెడగొట్టావే రాకాసి
ఆ: హే... దోచేసి పొగ మందేసి
నను కాపాడయ్యా దయచేసి ॥