Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

dOra dOra donga muddu - దోర దోర దొంగ ముద్దు

చిత్రం : ఇంద్రుడు చంద్రుడు - IndruDu chandruDu (1989)

 రచన : వేటూరి
 సంగీతం : ఇళయరాజా
 గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

గీత స్మరణం
07 November - నేడు కమల్‌హాసన్ బర్త్‌డే - kamal hasan birthday

 పల్లవి :
 ఆమె: దోర దోర దొంగ ముద్దు దోబూచీ హొయన హొయన
 అతడు: తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
 ఆ: ఆగమన్నా నీమీదే  పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా
 అ: వొద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా
 ఆ: దోర దోర దొంగ ముద్దు దోబూచి హొయన హొయన
 అ: తేర తేర తేనెబుగ్గ లాగించి...
 చరణం : 1
 ఆ: నీ చలి నా గిలి ఓపలేను అందగాడా
 నీ శ్రుతి నా లయ ఏకమైన సందెకాడ
 అ: అంటినా ముట్టినా అమ్మగారు
 అగ్గిపై గుగ్గిలం నాన్నగారు
 ఆ: ఎంటపడి చస్తున్నాను వెంటపడి వస్తున్నాను
 తెలిసిందా ఓ కుర్రాడా దక్కనివ్వు నా మర్యాద
 అ: ఓకేలే ఒకే ముద్దిచ్చేసి ముద్రిస్తా మనప్రేమ చరిత
 ॥దోర॥
 చరణం : 2
 అ: వేళనీ పాళనీ లేనిదమ్మా వెర్రి ప్రేమ
 గుట్టనీ మట్టనీ ఆగదమ్మ కుర్ర ప్రేమ
 ఆ: అందుకే సాగాలీ రాసలీల అందమే తోడుగా ఉన్న వేళ
 అ: ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో
 తేలిశాకే ఓ అమ్మాయి కలిశాయి చేయి చేయి
 ఆ: కానీలే సరే కవ్వించెయ్యి కౌగిట్లో ప్రియా కమల నయన
 ॥దోర॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |