Emani varNinchanU - ఏమని వర్ణించనూ
చిత్రం : డ్రైవర్ రాముడు - driver rAmuDu (1979)
రచన : ఆచార్య ఆత్రేయసంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
అతడు: ఏమని వర్ణించనూ... ఏమని వర్ణించనూ
నీకంటి వెలుగును వెన్నంటి మనసును
వెన్నెల నవ్వునూ నీ ఇలవేల్పును...
ఏమని వర్ణించనూ...
అమె: ఆ... ఆహహ... ఆ...
అ: పైరగాలిలాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు ॥
తీర్చిన బొమ్మలా తీరైనవాడూ (2)
తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు
ఏమని వర్ణించనూ...
చరణం: 1
అ: రాముడు కాడమ్మా నిందలు నమ్మడూ
కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరూ
నువ్వు పూజించు దేవుళ్ల లోపాలు లేనివాడు
నీ పూజ ఫలియించి నీ దేవుడైనాడు
ఏమని వర్ణించనూ...
చరణం: 2
అ: కళ్లు లేవనీ నీకు కలతింక వలదమ్మా
తన కళ్లతో జగతి చూపించగలడమ్మా ॥
ఆ: ఆ దేవుడెదురైతే వేరేమి కోరను...
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
నా అన్న రూపాన్ని చూపితే చాలును
ఏమని ఊహించనూ నా అన్న రూపునూ
నాకున్న వెలుగును వెన్నంటి మనసునూ
నా ఇలవేల్పును ఏమని ఊహించనూ