O dharmadAtA - ఓ ధర్మదాతా
చిత్రం : ధర్మదాత - dharmadhAta (1970)
రచన : డా॥సి.నారాయణరెడ్డిసంగీతం : టి.చలపతిరావు
గానం :ఘంటసాల
సాకీ :
ఓ ధర్మదాతా... ఓ ధర్మదాతా!
పల్లవి :
ఎవరూ నీవారు కారు
ఎవరూ నీతోడు రారు
అడిగిన వారికి లేదనక (2)
అర్పించిన ఓ ధర్మదాతా॥
చరణం : 1
సగము దేహమై నిలిచిన నీ దేవి
రగిలే చితిలో రాలింది
పుట్టెడు మమతలు పండించు ఇల్లాలు
పిడికెడు బూడిదగా మారింది
ముత్తైవుగా ముగిసిన సతి మేను (2)
కృష్ణవేణిగా మిగిలింది (2) ॥
చరణం : 2
కల్పతరువుగా వెలసిన భవనం
కడకు మోడుగా మారేనా
కోటి దివ్వెలను నిలిపిన నీకే
నిలువ నీడయే కరువాయెనా
పూవులమ్ముకొని బ్రతికే చోట (2)
కట్టెలమ్ముకొను గతి పట్టెనా
ఓ ధర్మదాతా... ఓ ధర్మదాతా!