Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

sItAkOka chiluka - సీతాకోకచిలుక

చిత్రం : ఔను...వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు - Avunu vALLiddaru ishTapaDDAru (2002)

 రచన : భాస్కరభట్ల రవికుమార్
 సంగీతం : చక్రి
గానం : చక్రి, కౌసల్య, బృందం

ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి :
అతడు: సీతాకోకచిలుక ...
 సోయగాల చినుక ముద్దు ముద్దుగున్నవే నువ్వు
 ఓసి కన్నెగోపిక తుళ్లి తుళ్లి పడక
   కొంగు ముడివేసుకో నువ్వు
 ఆమె: కొనికా కెమెరాలో బందీలే అవుదామా
 కొల్లేటి సరసుల్లో స్నానాలే చేద్దామా
 బృం: జింగిచక హ జింగి జింగిచక     (4) ॥
 చరణం : 1
అ: ఓ రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి
   నింగిని చూసేద్దామా
 జాబిలమ్మను చేరి జోల పాడేద్దామా
 ఆ: చేపలనడిగి మొప్పలు తెచ్చి
   ఈతలు కొట్టేదాము
 సాగరాలే దాటి సాటి లేరందాము
 అ: మొదటి చూపుకే అలలా
   పుట్టుకొచ్చు ఈ ప్రేమ
 ఆ: చివరి వరకు ఊపిరిగా
   తోడు ఉండదా ప్రేమ
 అ: ఓ... పంచెవన్నెల చిలక రెక్కపై
   పచ్చతోరణం ప్రేమ
 ఆ: తామరాకుపై నీటిబొట్టులా
   తళుకుమంటది ప్రేమ    ॥
చరణం : 2

అ: ఓ వానజల్లులో దోసిలి పట్టి
   గజగజ వణికేద్దామా
 పడవల బొమ్మలు చేసి చిటుకున వదిలేద్దామా
 ఆ: చిరుతల వేగం అరువుకు అడిగి
   గబగబ ఉరికేద్దాము
 ఊరులన్నీ తిరిగి జోరు చూపిద్దాము
 అ: రెండు గుండెల నడుమ
   రాయబారమీ ప్రేమ
 ఆ: నిండుకుండలా ఎపుడూ
   తొణికిపోదు ఈ ప్రేమ
 అ: ఓ... కోనసీమలో కొబ్బరాకులా
   ముద్దుగుంటది ప్రేమ
 ఆ: అరకు లోయలో చిలిపిగాలిలా
   కమ్ముకుంటది ప్రేమ    ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |