నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..
ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా
పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే
మోడే చిగురించే ప్రణయ కథల్లో
రాలే పూల ఆశల్లోన మధువును నేనై
పిలుపులతో అలసితిని బదులిక లేకా
నీవే జతలేని శిథిల శిలల్లో
ఉంటా వెయ్యేళ్ళు చిలిపి కలల్లో
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
దిగులుపడే సొగసులతో దినములు సాగే
రుచలడిగే వయసులలో ఋతువులు మారే
నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో
పరువముతో పరిచయమే పరుగులు తీసే
చెరిసగమౌ చెలిని ఇలా చెరలకు తోసే
ప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లో
ఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లో
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని
చివురించి నవ్వే నవరంజని
నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము
పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని
పిలుపందుకున్నా ప్రియరంజని
నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ..