Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : ఒకటో నెంబర్ కుర్రాడు (2002)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.చరణ్ , చిత్ర, బృందం

పల్లవి :
ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా...
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా
అరరె చురుకు నీకు ఉందిరా
అసలు కొత్త స్టైల్ నీదిరా
అందుకే ఐ లవ్ యూ రా...
ఆడపిల్ల ఒరేయ్ అందంటే
ప్రేమలోని పడ్డట్టేరా
నీ రొట్టె విరిగి ఎంచక్కా నేతిలోన
పడిపోయేరా
చరణం :
1 ఎంట్రా గూట్లే... ఆహాహా
ఎంత ప్రేమగా పిలిచిందో చూడరా
ఏంట్రా గూట్లే టెలిఫోన్ పోలల్లే
ఎదిగావురా
పోరా డోంగ్రి ఐస్‌ఫ్రూట్ పుల్లల్లే
అదిరావురా
ఏంట్రా టుమ్రీ తొక్కలోది
నీ డ్రస్సే బాగుందిరా
పోరా పుస్కీ దిక్కుమాలిన
నీ ఫేసే సూపర్బ్‌రా
ఏరా లఫంగి నువ్వేరా
ఏరా పుడింగి నీ పేరా
బే అన్న బేవర్సన్నా
బచ్చా అన్నా బడవా అన్నా
ప్రతిమాట పరమార్థం ప్రేమేరా
ఆహా మీ తిట్లే వింటుంటే
ప్రేమ ముదిరినట్టుందిరా
ఓహో మీరు మాకు హ్యాపీగా
బీరు పార్టీ ఇచ్చుకొండిరా
ఒరేయ్... ఒరేయ్...
ఒరేయ్ చిలక రూటుకొచ్చిందిరా
ఒరేయ్ ఇక వెళ్లండిరా
ఒరేయ్ చిలిపి చిలిపి పనులున్నాయ్‌రా
ఒరేయ్ కళ్లు మూయండిరా...

చరణం : 2
ఏంట్రా మెంటల్... ఓహొహో
ఏం ముద్దుగా పిలిచావ్ పిల్లోయ్
ఏంట్రా మెంటల్ చల్లనైన నీ మనసే
ఎయిర్ కూలర్ రా
పోరా కిండల్ దూకుతున్న నీ వయసే
టూవీలర్ రా
రారా ఉల్ఫా కాల్చుతున్న చూపే
సిగరెట్ లైటర్ రా
పోరా పిస్తా చిక్కుకున్న నడుమే
సెంటీమీటర్ రా
నా దేశముదురు నువ్వేరా
నా చేదు షుగరు ఇలా రా
ఇడియట్ అన్నా స్టుపిడ్ అన్నా
ట్యూబ్‌లైట్ అన్నా ఎల్‌బోర్డ్ అన్న
ప్రతి తిట్టు ప్రేమలోన దీవెనేరా
డౌట్ లేదు వీళ్లు మనకు లేనట్టేరా

చిత్రం : దేవుళ్ళు (2000)
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : ఎస్.జానకి

పల్లవి : మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల
సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి



చరణం : 1
ఓంకార రావాల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను
కృతయుగములోన
ఈ కొండపైన అర్జునుడు
తపమును గావించెను
పరమశివుని మెప్పించి
పాశుపతము పొందెను
విజయుడైన అర్జునుని పేరిట
విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియూ జేజేలు పలుకగ
కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు
కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల
అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన
కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం
కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికి
ఇదియే ముక్తి దీపం ॥

చరణం : 2 దేవీ నవరాత్రులలో
వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన
కనకదుర్గాదేవి
భవబంధాలను బాపే
బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే
సుమంత్రమూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనులకం
దించే దివ్యరూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గానమొసగు
వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు
ప్రసాదించు మహాదుర్గ
శత్రు వినాసిని సత్యస్వరూపిణి
మహిషాసురమర్దిని
విజయకారిణి అభయ రూపిణి
శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా
నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

చిత్రం : యమలీల (1994)
రచన : భువనచంద్ర
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

పల్లవి :
ఆ... నీ జీను ప్యాంటు చూసి
బుల్లెమ్మోయ్
ఆ... నీ సైకిల్ చైను చూసి
పిల్లమ్మోయ్
జీను......
మనసు లాగెత్తంది లాగెత్తంది
లాగెత్తంది ఓహ్‌ఁ...
వయసు ఊగెత్తంది ఊగెత్తంది
ఊగెత్తంది హాఁ...
ఆ... నీ బ్యాగీ ప్యాంటు చూసి
బుల్లోడోయ్
ఆ... నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
బ్యాగీ...
వలపు ఒలికెత్తంది ఒలికెత్తంది
ఒలికెత్తందిరో...
వయసు ఒణికెత్తంది ఒణికెత్తంది
ఒణికె త్తందిరో...
ఎయ్ ఎయ్‌రో సూత్తం ఎయ్‌రో (2)

చరణం : 1
ఆ... అప్పరాల చెరువులోన అమ్మడు
కప్ప పిల్ల బుసకొడితే అమ్మడు
ఒళ్లు జివ్వు జివ్వుమంటు అమ్మడు
లవ్వు పుట్టుకొస్తదంట అమ్మడు
తిమ్మరాజ రేవుకాడ పిల్లదో
తొండపిల్ల తొడగొడితే పిల్లదో
తాటిమట్ట తగులుకొని పిల్లదో
తాటలేసి పోతదంట పిల్లదో
కోపమేల బాల కొంగు చేరే వేళ
కురవ్రాడి స్పీడు చూసుకో
జీను...బ్యాగీ

చరణం : 2
ఆ... గోలిగూడ సెంటర్‌లో పిల్లదో
గొడవ గొడవ చేసేస్తే పిల్లదో
చిక్కడపల్లి సెంటర్‌లో పిల్లదో
చింతకాయ తినిపిస్తా పిల్లదో
ఉత్తి ఊక దంపుడేల అమ్మడు
కొత్తపాట నేర్చుకోవే అమ్మడు
మడతపేచి మానుకుంటే అమ్మడు
తాళిబొట్టు కట్టిపెడతా అమ్మడు
తాళిబొట్టు మోజు పెళ్లికొడుకు
పోజు పక్కనెట్టి స్టెప్పులెయ్యరో
జీను...బ్యాగీ