Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

సాకీ :
ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా
అనుకుంటాడో
ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు

పల్లవి :
మనసా మళ్ళీ మళ్ళీ చూశా
గిల్లీ గిల్లీ చూశా జరిగింది నమ్మేశా
జతగా నాతో నిన్నే చూశా
నీతో నన్నే చూశా
నను నీకు వదిలేశా
పై లోకంలో వాడు
ఎపుడో ముడి వేశాడు
విడిపోదే... విడిపోదే...
తను పాల వెల్లంటా
నువు వాన జల్లంటా
నీలోని ఈ ప్రేమ తీరడం... తీరడం
తను కంటి పాపంటా
నువు కంటి రెప్పంటా
విడదీయలేమంటా ఎవరం... ఎవరం

చరణం :
తీయనైన చీకటిని
తలుచుకునే వేకువలో
హాయి మల్లె తీగలతో
వేచి ఉన్నా వాకిలిలు
నింగి నేల గాలి నీరు నిప్పు అన్నీ
అవిగో స్వాగతం అన్నాయి...
మనసా మళ్ళీ మళ్ళీ చూశా
నీ కళ్లల్లో చూశా నూరేళ్ల మన ఆశ
జతగా నాతో నిన్నే చూశా
నాతోడల్లే చూశా
నీ వెంట అడుగేశా...
లోకంలో

ప్రేమ జగం... ఓ... ఓ...
విడుచు క్షణం... ఓ... ఓ...
పెళ్లి అనుకుంటే... ఓ... ఓ...
కలియుగమే ముగిసేది... ఓ... ఓ...
మరణమ్ముతోనే...

చిత్రం : ఏమాయ చేసావే (2010)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : దేవన్ ఏకాంబరం, చిన్మయి

పల్లవి : బాగుందమ్మా బాగుంది
అమ్మాయి నీ ముద్దు
మళ్ళీ మళ్ళీ అంటాను
అబ్బాయి చంపొద్దు
ఊయలల్లే ఊగే నీ నడుమే ముద్దు
హమ్మ హమ్మ హమ్మ సితం ఆగాలమ్మా
॥ చరణం : 1

వెచ్చటి గుండెల చప్పుళ్ళో
నా కంటి రెప్పల్లో
పదిలంగా ఉందోయమ్మ నీ రూపమే
పున్నమి వెన్నెల కాంతుల్లో
ఆ మబ్బు డొంకల్లో
రేయంతా వెతికానమ్మా నీ కోసమే
అమ్మాయి బుగ్గల్లో మందారం మొగ్గల్లే
దోబూచులాడుతున్న సిగ్గే ముద్దు
వద్దూ వద్దూ వద్దూ నను కవ్వించొద్దు
మోమాటాలే వద్దూ గిలిగింతే వద్దు
॥ చరణం : 2

ఉక్కిరి బిక్కిరి అవుతున్నా
నేనెంత కాదన్నా
నీలోనే చేరిందమ్మా నా ఊపిరి
ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా
ఈ రోజే చూస్తున్నా
నాకెంతో నచ్చిందమ్మా నీ వైఖరి
ఛీ పాడు సిగ్గన్నా సూదంటు రాయల్లే
కుచ్చెళ్ళు లాగేస్తున్న చూపే ముద్దు
ముద్దు ముద్దు ముద్దు
నీ నడుమే ముద్దు
విప్పద్దయ్యో నువ్వు మరి చికాకొద్దు ॥

చిత్రం : టక్కరి దొంగ (2002)
రచన : కులశేఖర్
సంగీతం : మణిశర్మ
గానం : ఎస్.పి.చరణ్, ఉష

పల్లవి :
బుజ్జి కొండ చూడకుండా
ఉండలేనే ఐ లవ్ యూ
ఐ డోంట్ ట్రస్ట్ యూ...
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీకోసం
నా గుండె పాడే పాట
ఐ లవ్ యూ... నో నో నో...
బుజ్జి కొండ చెప్పకుండా
ఉండలేనే ఐ లవ్ యూ
నువ్వెంతో ముద్దొచ్చి పట్టిందే ఈ పిచ్చి
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ
హో... యా...

చరణం : 1
నువ్వు తప్ప వేరే దిక్కు లేదే... అబ్బఛా
నువ్వు పక్కనుంటే కిక్కే వేరే
నాకు ఇంతకూడ సిగ్గు లేదే
ఐ విల్ కిక్ యూ...
ఎంత తిట్టుకున్నా ఫరవాలేదే
నెత్తిమీద పెట్టి నిన్ను చూసుకుంటా
రోకలెత్తి నన్ను దంచమాకే... కొండ.....
ఐ హేట్ యూ...

చరణం : 2
దిల్ కవ్వమెట్టి తిప్పినావే... నేనా
గోళ్లు పెట్టి గుండె రక్కేశావే... నో వే
ఇంత దూరం వచ్చి
కాదంటావే... యస్ యస్
నన్ను చేసుకుంటే బాగుంటావే
రెండు కాళ్లు మొక్కి కళ్లకద్దుకుంటా
ఏట్లో ఎల్లకిల్ల తొయ్యమాకే... కొండ.....
పోరా బోండా...
కొండ....

చిత్రం : బంపర్ ఆఫర్ (2009)
రచన : భాస్కరభట్ల
సంగీతం : రఘు కుంచె
గానం : రఘు కుంచె, సవితారెడ్డి