Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : జీవితనౌక(Jeevita Nouka) (1977)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి :
వేయి దీపాలు నాలోన వెలిగితే
అది ఏ రూపం నీ ప్రతిరూపం
కోటిరాగాలు నా గొంతు పలికితే
అది ఏ రాగం ఆ... అనురాగం

చరణం : 1
ఈ చీకటి కన్నుల వాకిలిలో
వెలుగుల ముగ్గులు వేసేదెపుడో
వెలుగుల మంగళ వేదికపై
నా వేణు లోలుని చూసేదెపుడో
చూడలేని నీ కన్నులకు...
ఎదురు చూపైనా ఉందొకటి
చూడగలిగే నా కన్నులకు
చుట్టూ ఉన్నది పెనుచీకటి ॥దీపాలు॥

చరణం : 2
సుడివడిపోయే జీవితనౌక
కడలి తీరం చేరేదెపుడో
కలగా తోచే ఆశారేఖ
నిజమై ఎదురై నిలిచేదెపుడో
వేచి ఉన్న నీ హృదయంలో
రేపటి ఉదయం మెరిసిందీ
వేగిపోయే నా గుండెలో
గతమే స్మృతిగా మిగిలింది ॥దీపాలు॥
Click to Listen The Song:





చిత్రం : పిల్ల జమీందార్(Pilla Zamindar) (2011)
రచన : కృష్ణ చైతన్య, సంగీతం : సెల్వ గణేష్
గానం : శంకర్ మహదేవన్, బృందం
Photo: కృష్ణ చైతన్య


పల్లవి :

తలబడి కలబడి నిలబడు
పోరాడే యోధుడు జడవడు॥
సంక ల్పం నీకుంటే ఓటమికైనా వణుకేరా
బుడిబుడి అడుగులు తడబడి
అడుగడుగున నీవే నిలబడి
ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి
వెలుగంటూ రాదు అంటే సూరీడైన లోకువరా
నిశిరాతిరి కమ్ముకుంటే
వెన్నెల చిన్నబోయెనురా
నీ శ క్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది
ప్రకాశంలో సూరీడల్లే
ప్రశాతంగా చంద్రుడిమల్లే
వికాసంలో విద్యార్థల్లే అలా అలా ఎదగాలి॥

చరణం : 1
పిడికిలినే బిగించి చూడు
అవకాశం నీకున్న తోడు
అసాధ్యమే తలొంచుకుంటూ క్షమించు అనేదా
రేపుందని లోకాన్ని నమ్మి
అలసటతో ఆగదు భూమి
గిరాగిరా తిరిగేస్తుంది క్రమంగా మహా స్థిరంగా
ప్రతి కలా నిజమౌతుంది ప్రయత్నమే ఉంటే
ప్రతీకవే నువ్వౌతావు ప్రవర్తనే ఉంటే॥

చరణం : 2
జీవితమే ఓ చిన్న మజిలీ
వెళిపోమా లోకాన్ని వదిలి
మళ్లీ మళ్లీ మోయగలవా కలల్ని ఈ కీర్తిని
గమ్యం నీ ఊహల జననం
శోధనలో సాగేది గమనం
ప్రయాణమే ప్రాణం కాదా
గెలుపుకి ప్రతి మలుపుకి
ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే
ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే॥

చిత్రం : ఊసరవెల్లి(Oosaravelli) (2011)
రచన : అనంత శ్రీరామ్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : విజయ్ ప్రకాష్, నేహా భసిన్


పల్లవి :
నీహారిక నీహారిక నువ్వే నా దారిక నా దారిక
నీహారిక నీహారిక నువ్వే నేనిక
నీహారిక నీహారిక నువ్వే నా కోరిక నా కోరిక
నీహారిక నీహారిక నువ్వయ్యానిక
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి
అంటోంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి
అంటోంది నా హృదయమే ॥
నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంటానంతే
నాకై ఇన్ని చేయాలని నిన్నేం కోరుకోను
నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే॥

చరణం : 1
రెండు రెప్పలు మూతపడవుగా
నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా
నువ్వు దూరమైతే
రెండుచేతులు ఊరుకోవుగా నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా
నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక
రెండు అన్న మాటెందుకో
ఒక్కసారి నా చెంతకొచ్చినావు నిన్నింక
వదులుకోను చెయ్యందుకో ॥

చరణం : 2
నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పులాగే ఉంది
నువ్వు ఎంతగా హద్దు దాటినా
ముద్దుగానే ఉంది
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తీయ తీయగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపినా
హాయిగానే ఉంది
జీవితానికీవేళ చివరిరోజు అన్నట్టు
మాటలాడుకున్నాముగా
ఎన్ని మాటలౌతున్నా కొత్త మాటలింకెన్నో
గుర్తుకొచ్చేనే వింత గా ॥

nihaarika-oosaravelli songs-Jr.NTR,Tamanna - Youtube