Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Movie: Jarigina Katha
Cast: Krishna, Jaggayya, Kanchana
Director: K. Baburao
Music: Ghantasala
Lyrics: Dr. C Narayana Reddy
Singer: Ghantasala
Year:1969
4 December - GhantasAla Birthday

Bhale Manchi Roju - Jarigina Katha - Telugu Old Classics - Ghantasala

నీ చెలిమే ఓ.. చెలియా॥
చిత్రం : ఊసరవెల్లి(oosaravelli) (2011)
రచన : చంద్రబోస్
సంగీతం, గానం : దేవిశ్రీ ప్రసాద్
Photo:దేవిశ్రీ ప్రసాద్


పల్లవి :
హే... వదలనులే చెలీ చెలీ నిన్నే
మరణం ఎదురువచ్చినా
మరవనులే చెలి చెలి నిన్నే
మరుజన్మెత్తినా
బెదరనులే ఇలా ఇలా భూమే
నిలువున బద్దలైనా
చెదరదులే నాలో నువ్వే వేసే
ముద్దుల వంతెన
శరీరమంతా తిమిచీరే
ఫిరంగిలా అది మారే
కణాలలో మధురణాలలే
కదిపి కుదుపుతోంది చెలియా
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
చంపాలి... వెంటాడే చావునే॥

చరణం : 1
ఒక యుద్ధం ఒక ధ్వంసం
ఒక హింసం నాలో రేగెనే
ఒక మంత్రం ఒక మైకం
నాలో మోగెనే
ఒక జననం ఒక చలనం
ఒక జ్వలనం నాలో చేరెనే
ఒక స్నేహం ఒక దాహం
నాలో పొంగెనే
గతాల చీకటిని చీల్చే
శత ఘు్నలెన్నో అది పేల్చే
సమస్త శక్తినిచ్చే
నీ స్పర్శే ఓ.. చెలియా ॥

చరణం : 2
ఒక క్రోధం ఒక రౌద్రం
బీభత్సం నాలో పెరిగెనే
ఒక శాంతం సుఖ గీతం
లోలో కలిగెనే
ఒక యోధం ఒక యజ్ఞం
నిర్విఘ్నం నన్నే నడిపెనే
ఒక బంధం ఒక భాగ్యం
నాకై నిలిచెనే
భయాల గోడలను కూల్చే
కయ్యాల గొంతు వినిపించే
శుభాల సూచనిచ్చే

చిత్రం : గుడిగంటలు(guDiganTalu) (1964)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం, గానం : ఘంటసాల
ఘంటసాల స్పెషల్(ghanTasAla special
)

పల్లవి :
ఎవరికి వారౌ స్వార్థంలో
హృదయాలరుదౌ లోకంలో॥
నాకై వచ్చిన నెచ్చెలివే
అమృతం తెచ్చిన జాబిలివే
నాకమృతం తెచ్చిన జాబిలివే

చరణం : 1
ధనము కోరి మనసిచ్చే
ధరణి... మనిషిని కోరి వచ్చావే
నా అనువారే లేరని
నేను కన్నీరొలికే కాలంలో
ఉన్నానని నా కన్నతల్లి వలె
ఒడిని జేర్చి నన్నోదార్చావే॥వచ్చిన॥

చరణం : 2
ప్రేమ కొరకు ప్రేమించే
వారే... కానరాక గాలించాను
గుండెను తెరచి ఉంచాను
గుడిలో దేవుని అడిగాను
గంటలు గణగణ మ్రోగాయి
నా కంటిపాప నువ్వన్నాయి॥వచ్చిన॥

చరణం : 3
ఈ అనురాగం ఈ ఆనందం
ఎవ్వరెరుగని ఈ అనుబంధం॥అనురాగం॥

ఊడలు పాకి నీడలు పరచి
ఉండాలి వెయ్యేళ్లు
చల్లగ ఉండాలి వెయ్యేళ్లు
తీయగ పండాలి మన కలలు॥


Special Note:

1942లో ‘క్విట్‌ఇండియా’ ఉద్యమంలో పాల్గొని 18 నెలలు జైలు శిక్ష అనుభవించారు ఘంటసాల. 1947 ఆగష్టు 15న ఆకాశవాణిలో ‘స్వతంత్రరథం’ అనే సంగీత రూపకాన్ని ప్రసారం చేశారు. అందులో చాలా పద్యాలు, పాటలు పాడారు. తోలేటి వెంకటరెడ్డిగారు రచించిన ‘స్వాతంత్య్రమే మా జన్మహక్కని చాటండి’ అనే పాట 1948 ఆగష్టులోనే విడుదలైంది. స్వతంత్రం పుట్టినరోజుకు ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పంతో వచ్చినదే ఈ రికార్డు. తర్వాత కొన్ని దేశభక్తి గీతాలు కూడా పాడారు. ఆయన దేశభక్తి మనందరికీ స్ఫూర్తి.