Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : రాజన్న(rAjanna) (2011)
రచన : కె.శివదత్త(K.Sivadatta)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.kIravANi)
గానం : సంజీవ్ చిమ్మల్గి(sanjIv chimmalli)
హమ్మింగ్స్ : కాల భైరవ(kAlabhairava)


పల్లవి :
గిజిగాడు తన గూడు
వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదని
కొలనీలో కమలాలు
తలదించుకున్నాయి
పొద్దు పొడవలేదనీని॥
గారాల మల్లమ్మ కళ్లే తెరవకుంది
తెలవారలేదే అని
నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్న
ఎండక్కే లేలెమ్మని
కొండెక్కి తన ఏడు గుర్రాల బండెక్కి
పండక్కి రారమ్మని
బతుకమ్మ పండక్కి రారమ్మని
పండక్కి రారమ్మని
బతుకమ్మ పండక్కి రారమ్మని
చరణం :
నడిమింట సూరీడు నిప్పులు
చెరిగేడు పసికందు పడుకుందని ॥
నువ్వైనా చెప్పన్న సూరీడుకి రాజన్న
మబ్బు చాటుకు పొమ్మని
నా బిడ్డకి రవ్వంత నీడమ్మని
కంటికి రెప్పల్లె కాచుకున్నా గాని
నీవైపే నా తల్లి చూపు
నువ్వన్న చెప్పన్న మల్లమ్మకి రాజన్న
ఇలుదాటి పోవొద్దని
దయచేసి నీ దరికి రావద్దని (2)

Special Note:
కె.శివశక్తిదత్త, సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తండ్రి. దర్శకునిగా విజేయేంద్రప్రసాద్‌తో కలిసి ‘అర్ధాంగి’ (1996), స్వీయ దర్శకత్వంలో ‘చంద్రహాస్’ (2007) సినిమాను తీశారు. ఆయన రాసిన పాటలు తక్కువైనా అవి ఎంతో ప్రజాదరణ పొందాయి.

okka kshaNam(swarAbhishEkam) - ఒక్క క్షణం(స్వరాభిషేకం)

చిత్రం : స్వరాభిషేకం(swarAbhishEkam) (2004)
రచన : వేటూరి సుందరరామమూర్తి(vETUri sundararAmamUrthy)
సంగీతం : విద్యాసాగర్(vidyAsAgar)
గానం : ఎస్.పి.బాలు, శైలజ(S.P.bAlu,Sailaja)
02 March - నేడు విద్యాసాగర్ బర్త్‌డే


సాకీ :
ఒక్క క్షణం...
ఒక్క క్షణం...
గరిమల
నీ మురిపెపు ముద్దుల మొలకొచ్చేదిక
ఒక్క క్షణం...
ఒక్క క్షణం...
పల్లవి : అమ్మకడుపు చల్లగా
అయ్యకలలు పండగా
ఇమ్మనరే... ఇమ్మనరే దేవతల
ఈ తల్లికి వరము
ఈ లాలికి స్వరము ఇహము పరము॥
చరణం : 1
కౌసల్యకు తప్పని
అమ్మవేదన మన రామకీర్తన
రామం దశరథ రామం
దనుజ విరామం ధరణిజ సోమం॥
దేవకికే తప్పని చెరసాల వేదన
నవరసాల నర్తన
నంద నందనం భక్త చందనం
గోపికా గోవందనం॥
గగప రిరిగ సాదసా
సరిగరి పదపాగరి
గప దపాదపా సదా గసరి సారి గరీ
గగ రిరి సస రిరి సస దద సదాపగారిసారిగా
తూరుపు తల్లికి తప్పదు
ఉదయవేదన
మేఘాలకు తప్పదు
మెరుపు వేదన
ఒక్క క్షణం... ఒక్క...॥॥
చరణం : 2
కల్లోలపు కడలి మీద
తాను తేలగా వటపత్రశాయిగా
తొమ్మిది మాసాల యోగి
కెవ్వుకెవ్వున తొలికేక పెట్టగా
శోకంలో పుట్టెనంట రామాయణము
శోకంలో పుట్టెనంట రామాయణము
శ్లోకంగా పెరుగునంట
జన్మల ఋణము
ఆ ఋణానుబంధమే
ఈ శిశు జననం ॥
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద
రామగోవిందా జోజో...
Listen Audio:
okka kshaNam(swarAbhishEkam) - ఒక్క క్షణం(స్వరాభిషేకం)

guruvAram march okaTi - గురువారం మార్చి ఒకటి



పల్లవి :
గురువారం మార్చి ఒకటి
సాయంత్రం ఫైవ్‌ఫార్టీ
తొలిసారిగ చూశానే నిన్ను
చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి
నిదరేపోనందే నా కన్ను॥
రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే
అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా
ఏం మాయో చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
జర జరా సున్‌తో జర జానే జానా
దిల్‌సే తుఝ్‌కో ప్యార్ కియా ఏ దీవానా
నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
సోచో జరా ప్యార్ సే దిల్‌కో సమ్‌ఝానా
ఐ లవ్ యూ బోలో నా హసీనా
చరణం : 1
నువ్వాడే పెర్‌ఫ్యూమ్ గుర్తొస్తే చాలే
మనసంతా ఏదో గిలిగింతే
కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిండిందే
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
క్లైమేట్ అంతా నాలాగే
లవ్‌లో పడిపోయిందేమో
అన్నట్టుందే క్రేజీగా ఉందే
నింగినేల తలకిందై కనిపించే
జాదూ ఏదో చేసేశావే॥శాంతి॥॥జర॥
చరణం : 2
గడియారం ముల్లై తిరిగేస్తున్నానే
ఏ నిమిషం నువ్వు
ఐ లవ్ యూ అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే
నువు నాతో కలిసుండే ఆరోజే ఎపుడంటూ
డైలీ రొటీన్ టోటల్‌గా
నీ వల్లే ఛేంజయ్యిందే
చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ
అంతో ఇంతో డీసెంట్ కుర్రాణ్ణి
ఆవారాలా మార్చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా
చెలియలా చేరిపోనా నీలోన
ఏదేమైనా నీకు నేను సొంతం కానా
నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం నా సర్వం నీకోసం


చిత్రం : దూకుడు(dookudu) (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : రాహుల్ నంబియార్


దూకుడు సినిమా 2011లో రిలీజ్ అయింది. ఈ పాటలో ‘క్యాలెం డర్ కన్నా ముందే ఉన్నానే’ అనే వాక్యం... 2012 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినట్టు ఉంది. ఏది ఏమైనా ఈ పాట ఆంధ్రదేశమంతటా చాలా పాపులర్ అయింది. పాఠకులు, గేయ రచయిత కోరిక మేరకు నేడు ఈ పాటను మళ్లీ ప్రచురిస్తున్నాం.