Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

దేవుడు చేసిన మనుషుల్లారా

చిత్రం : దేవుడు చేసిన మనుషులు(dEvuDu chEsina manushulu) (1973)
రచన : శ్రీశ్రీ(SrISrI)
సంగీతం : రమేష్‌నాయుడు(ramesh naidu)
గానం : ఘంటసాల, బృందం(ghanTasAla,group)


పల్లవి:
దేవుడు చేసిన మనుషుల్లారా
మనుషులు చేసిన దేవుళ్లారా
వినండి మనుషుల గోల
కనండి దేవుడి లీల
//వినండి// //దేవుడు//
గోవిందా హరిగోవిందా
గోవిందా భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా
గోవింద గోవింద భజగోవిందా
//గోవింద//

చరణం : 1 వెన్న దొంగ... ఆ...
వెన్న దొంగ మా తొలిగురువు
తొలి నుంచీ మా కులగురువు
కోరిన కోరిక తీరాలంటే
కోరక మోక్షం రావాలంటే
గోపాలుని సేవించాలి
గోవిందునే ధ్యానించాలి
//గోవింద//
వినండి దేవుల గోల
కనండి మనుషుల లీల
//వినండి// //దేవుడు// //వినండి//
చరణం : 2
పేదల నెత్తురు తాల్చిన రూపం
బలిసిన జలగలు దాచిన పాపం //పేదల//
మానవులను పీడించే జబ్బు
దేవతలను
ఆడించే డబ్బు //మానవులను//
తెలుపో నలుపో
జానేదేవ్
ఆ తేడాలిక్కడ లేనేలేవ్
//తెలుపో//
లేనేలేవ్...
వినండి డబ్బుల గోల
కనండి మనుషుల లీల //వినండి//
చరణం : 3
గాలిబుడగ జీవితం
ఓటి పడవ యవ్వనం //గాలి//
నిన్న మరల రాదు రాదు రాదు
నేడే నిజం నేడే నిజం నేడే నిజం...
రేపు మనది కాదు కాదు
నేడే సుఖం నేడే సుఖం
సుఖం సుఖం నేడే సుఖం
కాసే బ్రహ్మానందం... అహ
ఓ... డోసే పరమానందం... ఓహో //కాసే//

ఆనందం పరమానందం
ఆనందం బ్రహ్మానందం// ఆనందం//
వినండి గ్లాసుల గోల
కనండి మనుషుల లీల
//వినండి// //దేవుడు// //వినండి//

రామ్... రామ్ రామ్ రామ్
చరణం : 4
ఆలయాలలో
వెలుతురు లేదు
ఆకాశంలో చీకటి లేదు
//ఆలయాలలో//
విమానాలలో విహరిస్తుంటే
సముద్రాలనే దాటేస్తుంటే
//విమానాలలో//
గుడిలో ఎందుకు రామయ్యా
విడుదల చేస్తాం రావయ్యా
నిను విడుదల చేస్తాం రావయ్యా//గుడిలో//
రామయ్యా... రావయ్యా... (2)
రామయ్యా! లేవయ్యా! //రామయ్యా//
లేవయ్యా! లేవయ్యా! (2)


External Link:
dEvuDu chEsina - దేవుడు చేసిన మనుషుల్లారా

peLli AhAhA peLli - పెళ్లీ ఆహాహా పెళ్లి

చిత్రం : సంఘం(sangham) (1954)
రచన : తోలేటి(tOlETi)
సంగీతం : ఆర్.సుదర్శనం(R.sudarSanam)
గానం : పిఠాపురం నాగేశ్వరరావు(piThApuram nAgEswararRo)

27 April - నేడు ఆర్.సుదర్శన్ జయంతి
Listen song:


పల్లవి :
పెళ్లీ... పెళ్లి పెళ్లి పెళ్లీ...
ఈడైనా దానితో
జోడీగా హాయిగా (2)
ఈ లోకమందు
సౌఖ్యాల పొంది
ఆనందమొందగా
పెళ్లీ... భలే
మజా పెళ్లి... ఆహాహా పెళ్లి...
చరణం : 1
పందిళ్ల కింద విందులు చేసే
అత్తిల్లే స్వర్గం ఆనందమార్గం
భూలోక స్వర్గం ఆనందమార్గం
'పందిళ్ల '
అమ్మాయికి అబ్బాయి
అమ్మాయికి అబ్బాయి (2)
చేరిన సంసార జీవితం భలే భలే..
చేరిన సంసార జీవితంలో
సంఘంలో పూజితం
'లోకమందు'
పెళ్లీ... ఛంఛంఛం పెళ్లి
డుండుండుం పెళ్లి
ప్రేమకి జాతి కీర్తి నీతి రీతి
లేదయ్యోయ్
తెలుపు నలుపు లేదయ్యోయ్
హే... మూడుముళ్ల
వెయ్యయ్యోయ్
పెళ్లీ... జిల్ జిల్ జిల్ పెళ్లి
టకటకటక పెళ్లి
చరణం : 2
దేవుడు నన్నే చల్లగ చూస్తే
అప్పుడే నాకు అవుతుంది పెళ్లి
నాకూ అవుతుంది పెళ్లి
'దేవుడు'
సరోజ గిరిజ వనజ జలజ
మాలతి మాధ వి మల్లిక మోహిని
ఎవతో ఓ భామిని ఆమే నీ కామిని
పట్నం పిల్లో పల్లెటూరి పిల్లో
చిక్కిన రాజా చక్కిరకొట్టు
జణక్కు తకథిమి జణక్కు తకథిమి
టకుటికుటికుటకు డుండుం
వైవాహ కంకణం ప్రాప్తి బంధనం
దైవ నిర్ణయం (2)
పెళ్లి... తళుక్కు జనపెళ్లి
తదిగిణతోం పెళ్లీ...
'ఈడైనా'
పెళ్లీ... ఆహాహా పెళ్లి వారెవా పెళ్లి...

External Link:

peLli AhAhA peLli - పెళ్లీ ఆహాహా పెళ్లి
sangham all songs

O sAthiyA O sAthiyA - ఓ సాథియా ఓ సాథియా

చిత్రం : నా ఇష్టం(nA ishTam) (2012)
రచన : బాలాజీ (bAlAji)
సంగీతం : చక్రి (chakri)
గానం : కె.కె.(K. K)


పల్లవి :
ఓ సాథియా ఓ సాథియా
ఓ చూపుకే పడిపోయా
ఓ నా ప్రియా... ఓ నా ప్రియా...
నా నుండి నే విడిపోయా
ఒక నువ్వు ఒక నేను
ఒకటైతేనే కదా ప్రేమ
ఒకచోటే అనుకుంటే
మన ఇద్దరిదీ చిరునామా
॥సాథియా॥
చరణం : 1
నా మనసంతా చెరిపి
నీ రూపం గీశావే
నీ బరువే మోపి నను తేలిక చేశావే
॥మనసంతా॥
నీ శకునం కోసం చూసే...
ప్రతి సెకనుకు నిమిషాలెన్నో
నీ హృదయం కోసం వేసే
ప్రతి అడుగున దూరాలెన్నో
కంటిరెప్ప ఎప్పుడూ
చెయ్యలేదు చప్పుడు
నిన్ను చూడనప్పుడు సూటిగా
దూర ముంటే అమ్మలా
దగ్గరుంటే బొమ్మలా
గంటకొక్క జన్మలా ఉందిగా...
॥సాథియా॥
చరణం : 2
నా తనువంతా నువ్వై
తలకిందులు అయ్యానే
జ్ఞాపకమే నువ్వై జీవితమే మరిచానే
॥తనువంతా॥
నా గుండెల చప్పుడు కన్నా
నీ అలికిడితో బ్రతికున్నా
నను కాదని తెలిసిన సమయం
నా ఊపిరికెందుకు ప్రాణం
ప్రేమ తేనెపట్టనీ ఆశ పాముపుట్టనీ
ప్రేయసంటే అర్థమే మారినా
వెంటపడ్డ నీడనీ అచ్చమైన నువ్వనీ
వేలుపట్టి లోకమే దాటనా
॥సాథియా॥