Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం: కన్యాకుమారి(kanyAkumAri) (1977)
రచన: వేటూరి
సంగీతం, గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
04 June - నేడు ఎస్.పి.బాలు బర్త్‌డే
(S.P.bAlu birthday)


పల్లవి :
ఓహో చెలీ... ఓ నా చెలీ...
ఇది తొలిపాట ఒక చెలిపాట
వినిపించనా ఈ పూట ఆ పాట ॥

చరణం : 1

ఎదుట నీవు ఎదలో నీవు
ఎదిగి ఒదిగి నాతో ఉంటే
మాటలన్నీ పాటలై...
మధువులొలుకు మమతే పాట
నీలినీలి నీ కన్నులలో
నీడలైన నా కవితలలో
నీ చల్లని చరణాలే
నిలుపుకొన్న వలపీ పాట
పరిమళించు ఆ బంధాలే
పరవశించి పాడనా పాడనా... పాడనా...
॥చెలీ॥

చరణం : 2

చీకటిలో వాకిట నిలిచి
దోసిట సిరిమల్లెలు కొలిచి
నిదురకాచి నీకై వేచి
నిలువెల్లా కవితలు చేసి
కదలి కదలి నీవొస్తుంటే
కడలి పొంగులనిపిస్తుంటే
వెన్నెలనై నీలో అలనై నీవెల్లువకే వేణువునై
పొరలి పొంగు నీ అందాలే
పరవశించి పాడనా పాడనా... పాడనా...


Special Note:
పూర్తి పేరు : శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
జననం : 4-6-1946

జన్మస్థలం : కోనేటమ్మపేట, నెల్లూరు (ఇప్పుడు తమిళనాడులో కలిసిపోయింది)
తల్లిదండ్రులు : శంకుతల, సాంబమూర్తి
చదువు : సెక్షన్ ఎ అండ్ బి (మధ్యలో ఆపేశారు)
భార్య : సావిత్రి
పిల్లలు : కుమారుడు ఎస్.పి.చరణ్ (నటుడు, గాయకుడు), కుమార్తె పల్లవి

గాయకునిగా తొలిచిత్రం-పాట : శ్రీశ్రీశ్రీమర్యాదరామన్న (1967)-ఏమి ఈ వింత మోహము...(15-12-1966 న రికార్డింగ్ జరిగింది)
పాటలు : 36వేలకు పైగా (దాదాపు 16 భాషలు)

సంగీత దర్శకునిగా తొలిచ్రితం : కన్యాకుమారి (1977)

చిత్రాలు : 60 (తెలుగు, తమిళం, కన్నడం, హిందీ)

నటుడిగా తొలిచిత్రం : మహ్మద్‌బీన్ తుగ్లక్ (1972)

డ బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తొలిచిత్రం : మన్మథలీలలు (1976)

నిర్మాతగా : డబ్బింగ్ చిత్రాలు యోధ, భామనే సత్యభామనే, తెనాలి. తమిళంలో హలోబ్రదర్, తెలుగులో శుభసంకల్పం

అవార్డులు-పురస్కారాలు :
1999లో శ్రీ పొట్టిశ్రీరాముల తెలుగు యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేటు, 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్. గాయకునిగా తెలుగులో మూడు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఒక్కొక్క జాతీయ అవార్డు అందుకున్నారు. 25 సార్లు నంది అవార్డులు, తమిళనాడు నుంది కలైమామణి, మైనే ప్యార్ కియా చిత్రానికి ఫిలింఫేర్, సత్యభామ యూనివర్సిటీ, జె.ఎన్.టి.యు. నుండి గౌరవ డాక్టరేటు, ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ, శ్రీశైల, మంత్రాలయ దేవస్థానాలకు ఆస్థాన విద్వాంసునిగా, మరెన్నో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, జాతీయ పురస్కారాలు, ఫిలింఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డులు, మరెన్నో సంగీత అవార్డులు ఆయనను వరించాయి.

chilakA gOri~mkA kulikE - చిలకా గోరింకా కులికే

చిత్రం : చెంచులక్ష్మి(chenchu lakshmi) (1958)
రచన : ఆరుద్ర
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, జిక్కి
04 June - ఆరుద్ర వర్ధంతి


పల్లవి :
చిలకా గోరింకా కులికే పకాపకా
నేనే చిలకైతే నీవే గోరింకా రావా నావంక
చిలకా గోరింకా కులికే పకాపకా
నీవే చిలకైతే నేనే గోరింకా రావా నావంక
చరణం: 1
చెలియా నేటికి చెలిమి ఫలించెనే
కలలూ కన్నట్టి కలిమి లభించెనే॥
మనసే నిజమాయే తనువులు ఒకటాయే
మదిలో తలంపులే తీరే తీయగా
మారే హాయిగా... ॥
చరణం: 2
కలికీ నీవిలా ఎదుట నిలబడ
పలుకే బంగారం ఒలికే వయ్యారమే॥
ఒకటే సరాగము ఒకటే పరాచికం
కలసి విహారమే చేద్దాం హాయిగా
నీవే నేనుగా...॥

Special Notes:
అసలు పేరు : భాగవతుల సూర్యనారాయణ సదాశివశంకరశాస్త్రి
జననం : 31-8-1925
జన్మస్థలం : విశాఖపట్టణం
తల్లిదండ్రులు : వెంకట జోగమ్మ, నరసింగరావు
చదువు :ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషన్
వివాహం - భార్య : 28-4-1955 కె.రామలక్ష్మి (ప్రముఖ రచయిత్రి)
సంతానం : కుమార్తెలు (వాసంతి, కవిత, కీ.శే.లలిత ముఖర్జీ, త్రివేణి గురుకర్)
తొలిచిత్రం-పాట : బీదలపాట్లు (1950)-ఓ చిలకరాజా నీకు పెళ్లెపుడయ్యా...
ఆఖరిచిత్రం : పెళ్లికొడుకు (1996)
మాటలు అందించిన మొదటిచిత్రం : పరోపకారం (1953)
పాటలు : తెలుగులో నేరుగా 4వేలకు పైగా, డబ్బింగ్ పాటలు 300 పైగా (దాదాపు 400 చిత్రాలకు)
గౌరవపురస్కారాలు : 1985లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు, ఆంధ్ర కళా పరిషత్తు వారి నుండి ‘కళాప్రపూర్ణ’ బిరుదును ప్రదానం చేశాయి.
ఇతరవిషయాలు : ఆరుద్రకు తండ్రి నరసింగరావే తొలి సాహిత్య గురువు. తన 13వ ఏటనే రాసిన తొలి కవిత ‘నా కలలో...’ 1939లో చిత్రగుప్త అనే వారపత్రికలో ప్రచురితమైంది. 1943-49 మధ్య ముంబైలో ‘రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్’లో గుమాస్తాగా, ఆ తర్వాత ‘ఆనందవాణి’ పత్రిక సంపాదకుడిగా, విశాఖలో హార్బర్ గుమాస్తాగా, లైకోగ్రాఫ్ స్టూడియోలో ఫోటో గ్రాఫర్‌గా, ఆ తర్వాత ‘ఢంకా’ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా చేరారు. 1949లో న్యాపతి నారాయణమూర్తిద్వారా మొదటిసారి సినీ రచయితగా ‘సౌదామని (1951)’ చిత్రంతో పరిచయమయ్యారు. 2007లో ఆరుద్ర విగ్రహాన్ని విశాఖ తీరంలో ప్రతిష్టించారు.
మరణం : 04-06-1998

ennO rAtrulostAyi - ఎన్నో రాత్రులొస్తాయి

చిత్రం : ధర్మక్షేత్రం(dharmakshEtram) (1992)
రచన : వేటూరి, సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
02 June - నేడు ఇళయరాజా బర్త్‌డే


పల్లవి :
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఎన్నో
చరణం : 1
ఎన్ని మోహాలు మోసీ
ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో
మంచం ఒకరితో అలిగిన మౌనం
వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా సాయం
వయసునే అడిగినా ॥
చరణం : 2
గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక ॥


Special Note:
అసలు పేరు : డేనియల్ రాజయ్య
జననం : 2-6-1943
జన్మస్థలం : మదురైలోని పన్నైపురం గ్రామం
తల్లిదండ్రులు : చిన్నత్తాయమ్మాళ్, రామస్వామి
తోబుట్టువులు : అన్నయ్యలు (పావలర్ వరదరాజన్- రామ స్వామి మొదటి భార్య కొడుకు, డేనియల్ భాస్కర్), తమ్ముడు (గంగై అమరన్)
చదువు : 8వ తరగతి
భార్య : జీవా
పిల్లలు : కుమారులు (కార్తీక్‌రాజా, యువన్‌శంకర్‌రాజా), కుమార్తె (భవతారిణి) ( సంగీత దర్శకులు, గాయకులుగా రాణిస్తున్నారు)
సంగీత గురువు : జి.కె.వెంకటేష్
తొలిచిత్రాలు సంగీత దర్శకునిగా : తమిళం-అన్నకిళి (1976), తెలుగు-భద్రకాళి (1977)
గాయకునిగా : సీతాకోకచిలుకలో ‘అలలు కలలు ఎగసి ఎగసి...’ (తెలుగు)
సంగీత దర్శకునిగా చిత్రాలు : 850 పైగా
నటించిన సినిమాలు : పుదు పుదు అర్తంగళ్ (1989), అళగర్‌మలై (2009)
రాసిన పుస్తకాలు : తుళకడల్, పాల్ నిలాపాదై
అవార్డులు-పురస్కారాలు : గిటార్ సాధనలో ‘ట్రినిటీ మ్యూజిక్ ఆఫ్ లండన్’ వారి నుండి గోల్డ్‌మెడల్, జాతీయ అవార్డులు... తెలుగులో రెండు, తమిళ, మళయాళాలలో ఒక్కక్కటి, అన్నామలై, అరిజోనా వరల్డ్, మదురై కామరాజ్ యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్లు, తెలుగులో మూడు నంది అవార్డులు. పద్మభూషణ్, ఇసై జ్ఞాని... బిరుదులు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి లతా మంగేష్కర్ అవార్డు, కలైమామణి, ఏపీ ప్రభుత్వం నుండి 2008 లో ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుండి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పురస్కారం, మరెన్నో సంగీత అవార్డులు అందుకున్నారు.