Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

pUlu gusagulADEnani - పూలు గుసగుసలాడేనని

చిత్రం : శ్రీవారు మావారు(SrIvAri mAvAru) (1973)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : జి.కె.వెంకటేష్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
పూలు గుసగుసలాడేనని
జతగూడేనని
గాలి ఈలలు వేసెనని
సైగ చేసేనని
అది ఈ రోజే తెలిసింది...॥
చరణం : 1
మబ్బు కన్నెలు పిలిచే నని
మనసు రివ్వున ఎగిసేనని
వయసు సవ్వడి చేసేనని
ఇపుడే తెలిసింది...॥
చరణం : 2
అలలు చేతులు సాచేనని
నురుగు నవ్వులు పూచేనని
నింగి నేలను తాకేనని
నేడే తెలిసింది...॥
చరణం : 3
పైరు పచ్చగ ఎదిగున్నది
పల్లెపడుచుల వయసున్నది
కొత్త సొగసే రమ్మన్నది
గుండె ఝుమ్మన్నది॥

oka pAdam mOpagaligE - ఒకపాదం మోపగలిగే

చిత్రం : రచ్చ(racha) (2012), రచన : చంద్రబోస్
సంగీతం : మణిశర్మ, గానం : హేమచంద్ర, మాళవిక


పల్లవి :
ఒకపాదం మోపగలిగే చోటే చాలే
ఒకరోజు జీవితాన్నే గడుపుదామే ॥
ఓ తమన్నా యూ ఆర్ యూ ఆర్ యూ ఆర్
మై దిల్‌కీ తమన్నా (2)
హే నా... హే నా... హో
నీ కురులే కురుకురులేనా
హే నా... హే నా... హో
నీ మాటలు క్యాడ్‌బరీయేనా
హే నా... హే నా... హో
ఈ నేలకు జారిన
రెయిన్‌బో నువ్వేనా
చరణం : 1
నువ్వే నా రేయి పగల్ నువ్వే నా హాయి దిగుల్
గాలల్లే గుండెల్లో చేరావే
చూస్తూనే శ్వాసలకే సంకెళ్లే వేశావే
నువ్వే నీ కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్
మెరుపల్లే చినుకల్లే కలిశావే
వస్తూనే మబ్బల్లే ముసురల్లే కమ్మావే
సరికొత్తగా జన్మిస్తున్నా
నిలువెత్తుగా జతకడుతున్నా
నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా
హే నా... హే నా... హో వన్ డే నీ ఫ్రంటే రానా
హే నా... హే నా... హో వండర్‌లే చూపించైనా
హే నా... హే నా... హో
వందేళ్లకు సరిపడ సరదా అందీయనా
చరణం : 2
ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం
పక్షులకే రెక్కలనే తొడగాలే
మెరిసేటి చుక్కలకే చుక్కలనే చూపాలే
ఒకటే ఈ సంతోషం ఒకటే మన సందేశం
పువ్వులకే రంగులనే పంచాలే
సెలయేటి పరుగులకే పరుగులనే పెంచాలే
అరెరెరెరెరే హరివిల్లైనా అరెరరెరరే సిరిజల్లైనా
మన ఆనందానికి ఆనందించేనా
హే నా... హే నా... హో వన్ డే నీ ఫ్రంటే కానా
హే నా... హే నా... హో వండర్‌లే చూపించైనా
హే నా... హే నా... హో
వందేళ్లకి చెరగని గురుతులు నిలిపేనా

pADanA vANi - పాడనా వాణి

చిత్రం : మేఘసందేశం (mEgha sandESam) (1982), రచన : వేటూరి
సంగీతం : రమేష్‌నాయుడు, గానం : బాలమురళీకృష్ణ
06 July - నేడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పుట్టినరోజు
(mangaLampalli bAlamuraLI krishna Birthday)


పల్లవి :
ఆ... ఆ... ఆ... ఆ...
గమదనిసనీ పా మా
నిరిగమ రిగ నిరీ సా
మా మా గా గా దపదపమా
గా నిదనిద పా మాదనీ
సా నీ గారిసని దా పా
సా నిదపమా
రిసనీ దపమా రిసనీ గమదని
సనీ పామా రీగా
పాడనా వాణి కళ్యాణి గా (2)
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణి గా
నా పూజకు శార్వాణిగా నా భాషకు గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచక
మధురగాన శుక వాణిగా... ఆ...
పాడనా వాణి కళ్యాణి గా (2)
చరణం : 1
తనువణువణువును తంబుర నాదము
నవనాడుల శ్రుతిచేయగా... ఆ..
గరీసనిద నీ మాదా
నిదానిదపదా గామా సనీదపమ

ఎద మృదంగమై తాళ లయగతులు
గమకములకు జతకూడగా
అక్షర దీపారాధనలో స్వర లక్షణ
హారతులీయగా (2)
తరంతరము నిరంతరము గానాభిషేకమొనరించి తరించగా
పాడనా వాణి కళ్యాణి గా (2)
చరణం : 2
స్వర ముఖరిత నిర్జరులు లహరులై
దేవి పాదములు కడుగగా
దని గరి నిరి మగ రిగదమ గమనిద గరీ
నిదమ నిదా మగరి మగారి
లయ విచలిత గగనములు మేఘమై
తానములే చేయించగా
సంగీతామృత సేవనలే
నిజ సాహిత్యాభినివేశములై (2)
తరంతరము నిరంతరము
గీతాభిషేకమొనరించి తరించగా॥



Soundtrack

The movie was a musical hit, and featured Ashtapadi hymns from Jayadeva.

* "Aakaasa Desaana Aashada Masaana" (Lyrics: Veturi Sundararama Murthy; singer: K. J. Yesudas)
* "Aakulo Aakunai Puvvulo Puvvunai" (Lyrics: Devulapalli Krishnasastri; singer: P. Susheela)
* "Mundu Telisena Prabhu" (Lyrics: Devulapalli Krishnasastri; singer: P. Susheela)
* "Navarasa Suma Maalika" (Lyrics: Veturi Sundararama Murthy; singer: K. J. Yesudas)
* "Ninnati Daaka Shilanaina" (Lyrics: Veturi Sundararama Murthy; singer: P. Susheela)
* "Paadana Vani Kalyaniga" (Lyrics: Veturi Sundararama Murthy; singer: Mangalampalli Balamuralikrishna)
* "Priye Charusheele" (Lyrics: Jayadeva; singer: K. J. Yesudas)
* "Radhika Krishna Radhika" (Lyrics: Jayadeva; singers: P. Susheela and K. J. Yesudas)
* "Seetavela Raaneeyaku Sisiraniki Choteeyaku" (Lyrics: Devulapalli Krishnasastri)
* "Sigalo Avi Virulo" (Lyrics: Devulapalli Krishnasastri)