Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

O madhu O madhu - ఓ మధు ఓ మధు

చిత్రం : జులాయి (julAyi) (2012)
రచన, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ (dEviSrI prAsad)
గానం : అద్నాన్ సమి(adnAn sami)


వచనం :
ఇంతకీ నీ పేరు చెప్పలేదు
మధు...
పల్లవి :
ఓ మధు... ఓ మధు...
నా మనసు నాది కాదు
ఓ మధు... ఓ మధు...
నా మనసు నాలో లేదు
రంగులరాట్నంలా నా కళ్లను తిప్పించేశావే జాదూ
అందాల అయస్కాంతంలా
తిప్పావే హైదరబాదూ
నన్నొదిలి నీవైపొచ్చిన మనసెట్టాగో తిరిగిక రాదు
వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచేయ్ నాకొద్దు॥మధు॥
చరణం : 1
వాన పడుతుంటే...
ప్రతి చిన్న చినుకు అద్దంలాగ నిను చూపిస్తుందే
మా నాన్న తిడుతుంటే...
ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లే వినిపిస్తూ ఉందే
రెండు జళ్లు వేసుకున్న చిన్నపిల్లలాగ
యమునలో పూసుకున్న వాన వెల్లులాగ
ఒక్కొక్క యాంగిల్‌లో ఒక్కొక్కలాగ
కవ్వించి చంపావే కరెంట్ తీగ॥మధు॥
చరణం : 2
సన్నాయిలా ఉందే...
అమ్మాయిలందరిని
ఉడికించే నున్నని నీ నడుము
సంజాయిషీ ఇస్తూ...
ఆ బ్రహ్మ దిగిన చేసిన
తప్పును క్షమించనే లేము
చందనాలు జల్లుకున్న
చందమామలాగా
మత్తుమందు జల్లుతున్న మల్లెముగ్గ దాకా
ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగ
ఊరించి చంపావే నన్నే ఇలాగ॥మధు॥

Listen Full Songs:
JulAyi(2012) Audio | 1 |

Watch Video Songs:
Julayi(2012) with lyrics

vasudEvasutam dEvam - వసుదేవ సుతం దేవం

చిత్రం : గృహలక్ష్మి(gruhalakshmi) (1984)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : సత్యం, గానం : పి.సుశీల


శ్లోకం :
వసుదేవ సుతం దేవం
కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుమ్‌॥
పల్లవి :
మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్యా
మా మేలు చూసే
చల్లని దైవం నీవయ్యా ॥
నీ ముద్దు మోమును చూడాలి
మా పొద్దు అప్పుడే పొడవాలి
నీ నవ్వే వెలుగై నిండాలి కృష్ణా... ॥
చరణం : 1
నీవిచ్చిన సౌభాగ్యం
దీవించిన సంసారం
నీ నీడన నిలకడగా నిలవాలి॥
నెలవంక వెన్నెలగా పెరగాలి
నిన్ను నమ్మి ఉన్నాము కృష్ణా...॥
చరణం : 2
దేవకీవసుదేవులు రేపల్లె పౌరులు
నీ కోసమే ఎదురుచూస్తూ ఉన్నారు॥
సరసాలకు ఇది సమయం కాదురా
సందెవేళదాకైనా ఆగరా కృష్ణా...॥
చరణం : 3
నీ ధర్మం నెరవేర్చు
అది జన్మను కడతేర్చు
అని నీవే అన్నావు ఆ దారిని పోనివ్వు
మంచైనా చెడుగైనా
భరియించే బలమివ్వు కృష్ణా...॥

chaitramA chandramA - చైత్రమా చంద్రమా

చిత్రం : ప్రియుడు(priyuDu) (2011)
రచన : చంద్రబోస్
సంగీతం : మోహన్ జోనా
గానం : కార్తీక్


పల్లవి :
చైత్రమా చంద్రమా
హృదయం నీ జత కదా
చెంతకే చేరగా సమయం కదలదు కదా॥
పెదవిలోనే కవితలెన్నో
పలుకసాగే మెరుపులై
అడుగులోనే పరుగులెన్నో
ఉరకలేసే ఉరుములై
మొదలాయే మనసు కథ
మనసంతా మగువ కదా
చరణం : 1
అనుకోని రాగాలెన్నో
అనలేని భావాలెన్నో
ఇవాళ నాలో ఉదయించేనా
నాలోని నీకై కదిలేనా
స్వప్నాలన్నీ లేఖలుగా
సందళ్లే కోకిలకిలగా
సరదాలన్నీ చిలకలుగా
కోరికలే నెమలీకలుగా
నాక న్నా ఇక వేగంగా నిన్నే చేరేనా
చరణం : 2
గతమంతా నువ్వే నువ్వే
గడిపింది నాతో నువ్వే
ప్రతిసారి నిన్నే కాదన్నానా
తొలిసారి నిన్నే గుర్తించానా
నీ రూపం నా చూపులుగా
నీ స్నేహం కొన ఊపిరిగా
నీ స్పర్శే సంజీవనిగా
నీ కరుణే కులదేవతగా
ప్రేమించి నిను పూజింప మళ్లీ పుట్టానా॥

External Links:
chaitramA chandramA (audio)-చైత్రమా చంద్రమా
Priyudu Full Songs (Audio) |Link|