Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

are Chamaku Chamaku - అరె ఛమకు ఛమకు

చిత్రం : కొండవీటి దొంగ(koNDavITi do~mga) (1990)
రచన : సిరివెన్నెల, సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
27 July - నేడు కె.ఎస్.చిత్ర బర్త్‌డే
(K. S. chitra birth day)


పల్లవి :
అరె ఛమకు ఛమకు ఛాం
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్యా
ఝణకు ఝణకు ఝాం
పట్టుకో పట్టుకో ఝంపె దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా
హొయ్ అయ్యారే తస్సాదియ్యా
ఛాం ఛాం చకఛాం చకఛాం ఛాం
త్వరగా ఇచ్చై నీ లంచం
ఛాం ఛాం చకఛాం చకఛాం ఛాం
చొరవే చేసై మరికొంచెం॥ఛమకు॥
చరణం : 1
నాగస్వరములా లాగిందయ్యా
తీగ సొగసు చూడయ్యా
తాచుపొగరుతో రేగిందయ్యా
కోడెపడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం ఇందు సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సూ బుస్సూ
ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్లే పంతంతో
అరె కైపే రేపే కాటే వే స్తా ఖరారుగా...
కథ ముదరగా...
ఝణక్ ఝణక్ ఝాం
పట్టుకో పట్టుకో ఝంపె దరువులే వెయ్యా॥ఛమకు॥
చరణం : 2
అగ్గిజల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా
ఈతముల్లులా ఎదలో దిగెరో
జాతి వన్నెది జాణ
అంతో ఇంతో సాయం
చెయ్యా చెయ్యందియ్యాలయ్యా
తీయని గాయం మాయం చేసే
మార్గం చూడాలమ్మా
రాజీకొస్తాలే కాగే కౌగిళ్లో
రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్లో
ఇక రేపో మాపో ఆపీ ఊపే హుషారుగా...
పదపదమని...॥ఛమకు॥

Om namastE bOlO - ఓం నమస్తే బోలో

చిత్రం : రెడీ(ready) (2008)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : నీరజ్ శ్రీధర్, దివ్య


పల్లవి :
ఓం నమస్తే బోలో బేబీ ఓం నమస్తే బోలో
దిల్‌మే డాష్ పుట్టే పార్టీ టైమ్‌లో
ఓం నమస్తే బోలో బాబా ఓం నమస్తే బోలో
నీతో పార్టనర్ అవుతా ప్రెట్టీ క్రైమ్‌లో
పిల్లో పిల్లో పిల్లో నా పిల్లోలాంటి పిల్లో
మార్నింగ్ కాఫీ అవుతావా
నా మాన్లీ చేతుల్లో
హల్లో హల్లో హల్లో చెప్పేస్తా నీ కల్లో
టూటీఫ్రూటీ అవుతా నీ పెదాలలో
లైలా అందాల ఏటిఎమ్‌లా
ఎనీటైమ్ ముద్దిచ్చేలా
నువ్వుంటే చాలే కిస్సు బ్యాంక్‌లా
హొయిలా లవ్వాడే పెంటియమ్‌లా
ముద్దాడే మ్యూజియమ్‌లా
ప్లస్ అవుతా నీకు బ్లాంక్ చెక్‌లా॥నమస్తే॥
చరణం : 1
సిడ్నీ షెల్డన్ ఫిక్షన్ నుంచి
షెల్లీ పొయెట్రీదాకా
ఎ టు జడ్ ఎన్నెన్నో క్రేజీ బుక్స్ చదివానే
ఇట్టా ఊరించే లిటరేచర్
పిచ్చెక్కించే ఒక్కో ఫ్యూచర్
నీలోనే చూశానే చూస్తూ స్టాట్యూనయ్యానే
హే ట్రెన్డీ ట్రెన్డీ ట్రెన్డీ
నే మేడ్ ఇన్ పారి్‌స్ బండి హోయ్
త్రీడీలో నా బాడీ లాంగ్వేజ్ బైహార్ట్ చేసేస్కో
చబ్బీ చబ్బీ చబ్బీ నా చబ్బీ చీక్సే పిండి
నొప్పంటున్నా పప్పీలెన్నో పంచుకో॥నమస్తే॥
చరణం : 2
హాట్ అండ్ సోర్ సూప్‌వి నువ్వే
సాల్ట్ అండ్ పెప్పర్ నీనౌతానే
క్యాండిల్ లై ట్ డిన్నర్‌లో నీకు కంపెనీ నేనే
రాబిన్‌హుడ్‌లా వచ్చేస్తానే
బ్యూటీ మొత్తం దోచేస్తానే
నువ్వంటే పడి చచ్చే నాతో పంచుకుంటానే
ఠండా ఠండా ఠండా నేర్పిస్తావా ఫండా
మ్యాజిక్ ఏదో చూపిస్తావా హ్యారీపోటర్‌లా
థోడా థోడా థోడా చేసేస్తాలే తేడా
నీ ఈడోమీటర్ స్పీడ్ పెరిగేంతలా॥॥నమస్తే॥

hey chakkani bike undi - హే చక్కని బైకుంది

చిత్రం : జులాయి(julAyi) (2012)
రచన : శ్రీమణి, శ్రీచరణ్ (Rap)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : టిప్పు, మేఘ, శ్రీచరణ్ (Rap)


Rap :
Girl you're my mission let's salvation
Give me some kiss and
your home is so loving
Baby come into me hey fuse into me
Baby o my baby you are my star ||Girl||
పల్లవి :
హే... చక్కని బైకుంది... హే... పక్కనె పిల్లుంది
హే... చల్లని గాలుంది అటు లాగింది
హే... నీక్కొంచెం పిచ్చుంది
హే... నాకది నచ్చింది
హే... నీ మీద మోజైంది నువ్వు రాజంది
హే... రయ్యి రయ్యి రయ్యిమంది బైకు
సర్రు సర్రు సర్రుమంది సోకు
జివ్వు జివ్వు జివ్వుమంది నాకు
కులుకుతోటి కుట్టమాకు ||Girl||
చరణం : 1
హే... అడ్డేడ్డేడ్డేడ్డేడ్డే నడుము చూస్తే
అయ్‌బాబోయ్ ఐ విల్ లూస్ మై కంట్రోలు
హేయ్ బ్యాకు సీటు మీద గాని నువ్వు ఎక్కితే
గాలిలోకి లేచి పోద్ది ఫ్రంటు వీలు
నా పెదవి అంచు నుంచి కొంచెం ఎరుపు తీస్తే
నా బైకు ఇంక ముట్టుకోదు పెట్రోలు
నా ఒంటిలోన ఒదిగి ఉన్న మెరుపు చూస్తే
ఉరకలేస్తూ ఎగిరిపోదా వేల మైళ్లు
నవ్వుతున్న నీ నగుమోము మదినే తుంచిందే
ఓ.. గుప్పుమన్న నీ పెర్ఫ్యూము
ముక్కును ముంచిందే
హే... ధన్నుమంటూ గుద్దుకుంది ఈడు
ముద్దు అంటూ మొత్తుకుంది మూడు
ఒక్కసారి ఎస్సు చెప్పి చూడు
ఆపలేవు నా స్పీడు //హే... చక్కని//
చరణం : 2
అరె కాళిదాసు రాసుకున్న బుక్కులోంచి
జారిపడ్డ అందమైన పేజీ నువ్వా
దేవదాసు మందు సీసా కిక్కులోంచి
పుట్టుకొచ్చి చంపుతున్న మత్తు నువ్వా
ఆర్నాల్డు ఆర్మ్స్ నుండి ఊడిపడ్డ
ఉక్కులాంటి కండలున్న అందగాడా
జేమ్స్ బాండు గన్ను లోంచి దూసుకొచ్చే
గుండుకున్న స్పీడునంతా మింగినోడా
ఆయ్... రింగు రింగులుగా తిరిగిందే
నల్లని నీ జుట్ట్టు
ఓ... చెంగు చెంగుమని ఎగిరిందే
నా మనసే నీ చుట్టూ
హే... లబ్బు డబ్బుమంది గుండె రిథమ్
గేరు మార్చమంది లవ్వు రథం
కుమ్ముతోంది కన్నె మెస్మరిజం
ప్రేమలోన ఇది సహజం
//హే... చక్కని// ||Girl||