Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

are Chamaku Chamaku - అరె ఛమకు ఛమకు

చిత్రం : కొండవీటి దొంగ(koNDavITi do~mga) (1990)
రచన : సిరివెన్నెల, సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
27 July - నేడు కె.ఎస్.చిత్ర బర్త్‌డే
(K. S. chitra birth day)


పల్లవి :
అరె ఛమకు ఛమకు ఛాం
చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్యా
ఝణకు ఝణకు ఝాం
పట్టుకో పట్టుకో ఝంపె దరువులే వెయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్యా హొయ్యా
హొయ్ అయ్యారే తస్సాదియ్యా
ఛాం ఛాం చకఛాం చకఛాం ఛాం
త్వరగా ఇచ్చై నీ లంచం
ఛాం ఛాం చకఛాం చకఛాం ఛాం
చొరవే చేసై మరికొంచెం॥ఛమకు॥
చరణం : 1
నాగస్వరములా లాగిందయ్యా
తీగ సొగసు చూడయ్యా
తాచుపొగరుతో రేగిందయ్యా
కోడెపడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం ఇందు సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సూ బుస్సూ
ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్లే పంతంతో
అరె కైపే రేపే కాటే వే స్తా ఖరారుగా...
కథ ముదరగా...
ఝణక్ ఝణక్ ఝాం
పట్టుకో పట్టుకో ఝంపె దరువులే వెయ్యా॥ఛమకు॥
చరణం : 2
అగ్గిజల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా
ఈతముల్లులా ఎదలో దిగెరో
జాతి వన్నెది జాణ
అంతో ఇంతో సాయం
చెయ్యా చెయ్యందియ్యాలయ్యా
తీయని గాయం మాయం చేసే
మార్గం చూడాలమ్మా
రాజీకొస్తాలే కాగే కౌగిళ్లో
రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్లో
ఇక రేపో మాపో ఆపీ ఊపే హుషారుగా...
పదపదమని...॥ఛమకు॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |