Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

ko~nchamu arthamainA - కొంచెము అర్థమైనా

పల్లవి :

కొంచెము అర్థమైనా
కొంచెము కొంచెము కాకపోయినా
కొంచెము బెట్టు చూపినా
కొంచె ము కొంచెము గుట్టువిప్పినా
కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా... ఓ...
నీ గుండెలోతున భూతద్దం వేయనా
ఏదో మూలనా నన్నే చూడనా
॥గుండెలోతున॥

చరణం : 1

కొంచెము చూడవచ్చుగా
కొంతైనా మాటాడవచ్చుగా
పోనీ అలగవచ్చుగా
పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్లమెల్లగా పిచ్చోడినౌతున్నా
జాలి పడవుగా... ఓ...
పిసినారి నారివే పిసరంత పలకవే
ఆ కంచె తెంచవే ఇవ్వాళైనా

నొ నొ నో వాట్ సో... (2)

చరణం : 2

కాకితో కబురు పంపినా
కాదనకుండా వచ్చి వాలనా
రెక్కలు లేకపోయినా
చుక్కలకే నిను తీసుకెళ్లనా
జన్మలు ఎన్ని మారినా
ప్రతిజన్మలో జంటగ నిన్ను చేరనా
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా...
వాట్ డిడ్ యూ సే?
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా
తలదాచుకుందని తెలియలేదా...

చిత్రం : ఈగ (2012)
రచన : అనంతశ్రీరామ్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : విజయ్ ప్రకాష్

evarikI talava~nchaku - ఎవరికీ తలవంచకు

చిత్రం : నిండు సంసారం(niNDu samsAram) (1968)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల
29 July - నేడు సి.నారాయణరెడ్డి బర్త్‌డే
(c. nArAyana reddy birth day)

పల్లవి :
ఎవరికీ తలవంచకు
ఎవరినీ యాచించకు
గుండెబలమే నీ ఆయుధం
నిండుమనసే నీ ధనం॥
చరణం : 1
కండలు పిండే కష్టజీవులకు
తిండికి కరువుంటుందా?॥
నిజాయితీకై నిలిచేవారికి
పరాజయం ఉంటుందా?
మంచితనమ్మును మించిన పెన్నిధి (2)
మనిషికి వేరే ఉందా? (2)॥
చరణం : 2
చాలీచాలని జీతంతో
మిడిమేలపు కొలువులు కొలవకు॥
ముడుచుకుపోయిన ఆశలతో... హోయ్
మిడిమిడి బ్రతుకును గడపకు॥
చీకటి రాజ్యం ఎంతోకాలం
చెలాయించదని మరవకు (2)॥
చరణం : 3
జీవితమే ఒక వైకుంఠపాళి
నిజం తెలుసుకో భాయీ
ఎగరేసే నిచ్చెనలే కాదు
పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పదవోయి (2)॥

External Link:
Evariki talavanchaku - audio

alanATi rAmachandruDi - అలనాటి రామచంద్రుడి

చిత్రం : మురారి (2001), రచన : సిరివెన్నెల
సంగీతం : మణిశర్మ, గానం : జిక్కి, సంధ్య, సునీత


పల్లవి :
ఆ... ఆ... ఆ... ఆ...
అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి॥
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ
ఆ... ఆ... ఆ... ఆ...
తెలుగింటి పాలసంద్రము కని పెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ॥
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ... ఆ... ఆ... ఆ...
చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి
నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని
వెలవెలబోవమ్మా
చరణం : 1
పుత్తడిబొమ్మకు పుస్తెలు కడుతూ
పురుషుడి మునివేళ్లు
పచ్చని మెడపై వెచ్చగా రాసెను
చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన
తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి
విందులు చేసే సమయాన
ఆ... ఆ... ఆ... ఆ...
అందాల జంట అందరి కంటికి
విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళ గల జంటని
పదిమందీ చూడండి
తళతళ మెరిసిన ఆనందపు
తడిచూపుల అక్షతలేయండి॥
చరణం : 2
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్లు
ఈ చల్లని సమయాన
దేవుళ్ల పెళ్లి వేడుక లైనా ఇంత ఘనంగా జరిగేనా
ఆ... ఆ... ఆ... ఆ...
దేవుళ్ల పెళ్లి వేడుక లైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి
జనమంతా రారండీ
తదుపరి కబురుల వివరములడగక
బంధవులంతా కదలండీ...॥