Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

O vENugAnammu - ఓ వేణుగానమ్ము

చిత్రం : సిరిసంపదలు (siri sampadalu) (1962)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : మాస్టర్ వేణు
గానం : సుశీల, జానకి, జిక్కి


పల్లవి : ఓ... ఓ... ఓ... ఓ...
వేణుగానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణయ్య కనిపించడే

' వేణుగానమ్ము'
చరణం : 1
దోరవయసున్న కన్నియల
హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
'దోరవయసున్న'
అంత మొనగాడటే... ఒట్టి కథలేనటే...
ఏడి కనబడితే నిలవేసి అడగాలి వానినే
' వేణుగానమ్ము'
చరణం : 2
మన్ను తిన్నావని యశోదమ్మ
అడిగిందట లేదు
లేదనుచు లోకాలు చూపాడట
'మన్ను'
అంత మొనగాడటే...
వింత కథలేనటే...
ఏడి కనబడితే కనులారా
చూడాలి వానినే
'వేణుగానమ్ము'
చరణం : 3
దుడుకు కృష్ణయ్య
మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
'దుడుకు'
ఘల్లు ఘల్ ఘల్లన...
ఒళ్లు ఝల్ ఝల్లన ...
తాను ఫణిరాజు పడగపై
తారంగమాడేనట
'వేణుగానమ్ము'
Listen Audio song:

O vENugAnammu - ఓ వేణుగానమ్ము

E SwAsalO chEritE - ఏ శ్వాసలో చేరితే

చిత్రం : నేనున్నాను (nEnunnAnu) (2004), రచన : సిరివెన్నెల
సంగీతం : ఎం.ఎం.కీరవాణి, గానం : కె.ఎస్.చిత్


పల్లవి :
వేణుమాధవా... ఆ... (2)
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమేమంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై
నిను చేరనీ మాధవా... ఆ...॥శ్వాసలో॥
చరణం : 1
మునులకు తెలియని జపములు జరిపినదా...
మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన గాయమునే
తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధి...॥శ్వాసలో॥
చరణం : 2
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలువైపుల నడిరాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగుల సడి వినబడక
హృదయానికి అలజడితో అణువణువు
తడబడదా... ఆ... ఆ...
నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధి
గాగ రిగరి సరి గాగ
రీరి సరి
గపద సాస దప గరి సరీ
గగ దపదా గప దసదా
ద ప గ రి గ
దపద సాస దపద సాస
దపద రీరి దపద రీరి
దస రిగరి సరీ
గరిసరీ ద రి గారి సరిగా రిస దప
గగగ పాప గగగ దాద గగగ సాస
దప గప గస రిసరిసరి గరిస దసరీ గదప సగరీ
పగ పదసరీ సరి గపగరీ
సద పద పస దస పద పస దస
పదప రిసరి పదప రిసరి
పద సరి గరి సద
పదస గదస రిగస
సరిగప దసరిగా
ఆ... రాధికా హృదయ రాగాంజలి...
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి... ఈ గీతాంజలి...

ayyayyO chEtilO - అయ్యయ్యో చేతిలో

చిత్రం : పిల్ల జమీందార్(pilla zamIndAr) (2011), రచన : శ్రీమణి
సంగీతం : సెల్వ గణేష్, గానం : సోలార్ సాయి


అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే
ఉన్నది కాస్తా ఊడింది
సర్వమంగళం పాడింది
మేటర్ క్వార్టరుకొచ్చింది
పరువును వీధికి తెచ్చింది
పిజ్జా బర్గర్ తినే జీవికి
పచ్చడి టచ్చింగ్ ఇచ్చింది
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే

ఆ జమీందారుకే ఏలినాటి
శని షరతులు పెట్టిందే
విధి వీణ్ణి ఉతికారేసిందే
చేతికి చీపురు ఇచ్చిందే
పోజుకు బూజే దులిపిందే
ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని
బస్టాండ్‌గా మార్చే
గాడిద చాకిరి చేయించే
అయ్యయ్యో రాజభోగం పోయెనే
అయ్యయ్యో రాజన్న
జ్వరమే వచ్చెనే

షవరు బాతులు స్విమ్మింగ్‌పూల్
ఎండమావులాయే
అయ్యని ఎండకట్టినాయే
గోవిందా... గోవిందా...
ప్యాలెస్ నుండి పాయిఖానాకు బాబే దిగివచ్చే
దెబ్బకు దేవుడు కనిపించే
అబ్బాయిని అబ్బా అనిపించే
ఏసి బారులో ఓసీ లైఫుకి షేకే వచ్చింది
షేఖ్‌కి షాకే ఇచ్చింది
అయ్యయ్యో డాబుసరి సిరి దూరమే
అయ్యయ్యో బాబు పని ఇక ఘోరమే

జల్సా లైఫులు సల్సా డాన్సులు
స్వాహా అయ్యాయి
కష్టాల్ కవాతు చేశాయి
గర్వపు కీళ్లే విరిచాయి
కాళ్లకు పుండ్లే అయ్యాయి
నిష్ట దరిద్రపు లాటరీ వీణ్ణి లాగి కొట్టింది
కొడితే...
చిప్ప చేతికొచ్చే కూటికి తిప్పలెన్నో తెచ్చే
అయ్యయ్యో మేళ్లు మిద్దెలు మాయమే
అయ్యయ్యో పేళ్లో బతుకైపాయెనే