Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

oka manasutO - ఒక మనసుతో

చిత్రం : ఈ అబ్బాయి చాలా మంచోడు (Ee Abbai ChAla ManchODu) (2003)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎం.ఎం.కీరవాణి, గంగ


పల్లవి :
ఒక మనసుతో ఒక మనసుకి
ముడి ఎట్టావేస్తావూ
ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా
ఊరుకోవూ ప్రేమా... ఆ...॥మనసుతో॥
చరణం : 1
పసిపాపలో ముసినవ్వులా
కపటాలు లేని ప్రేమా
మునిమాపులో మరుమల్లెలా
మలినాలు లేని ప్రేమా
అరచేతిలో నెలవంకలా
తెరచాలుటోని ప్రేమా
నదిగొంతులో అలపాటలా
తడబాటులేని ప్రేమా
మనసుల కలివిడి ఫలితం ప్రేమ...
తనువుల తాకిడి కాదు సుమా
అనంత జీవయాత్రలోను
తోడు ప్రేమా...
ప్రేమా... ఆ... ॥మనసుతో॥
చరణం : 2
అధరాలలో తడి మెరుపులా
మెరిసేది కాదు ప్రేమా
హృదయాలలో ధృవతారలా
అలరారుతుంది ప్రేమా
పరువాలతో కరచాలనం
చేసేది కాదు ప్రేమా
ప్రాణాలలో స్థిరబంధనం
నెలకొల్పుతుంది ప్రేమా
మమతల అమృతవర్షిణి ప్రేమ
కోర్కెల అలజడి కాదు సుమా
నిశీధిలోనూ వీడిపోని నీడ ప్రేమా
ప్రేమా... ఆ ఆ ఆ ఆ ఆ...॥మనసుతో॥

E Abbayi Chala Manchodu - Oka Manasutho - Love Song




Listen Audio Songs:
Ee Abbai ChAla ManchODu | 1 |

sa~mkurAtri kODi - సంకురాత్రి కోడి

చిత్రం : యువ(Yuva) (2004)
రచన : వేటూరి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : మధుశ్రీ, ఎ.ఆర్.రెహమాన్


పల్లవి :
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా॥
చేయి వేస్తే చెంగు జారే కుయ్యో మొర్రో
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా
జగడం వచ్చినా తాకవద్దయా॥
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా... కొంచెం కొంచెం
కొరుక్కు తినవయ్యా
అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా
చరణం : 1
ఆకు వక్క వేసినా నోరు పండదేమి
ఒక్క పంటి కాటుకే ఎర్రనౌను సామీ
స్వర్గం సుఖం పొందేటి దారి చూపవేమి
ఆ... వీధి అరుగు మీదే దోచుకున్న వలపు
వడ్డీలాగ పెరిగే నెలలు నిండనివ్వు
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా॥
చరణం : 2
మేడ మిద్దెలేలా చెట్టు నీడ మేలు
మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు
ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు
ఆ... చప్ప ముద్దు పెడితే ఒళ్లు మండిపోదా
సాహసాలు చే స్తే చ ల్లబడిపోనా
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా॥

kaLakaLalu kilakilalu - కళకళలు కిలకిలలు

చిత్రం : తమ్ముడు(tammuDu) (1999)
రచన : చంద్రబోస్
సంగీతం : రమణగోగుల
గానం : ఎస్.పి.బాలు, బృందం


పల్లవి :
కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి
ఇల్లు మురిసినది
గల గల కళకళలు కిలకిలలు॥
చరణం : 1
నమ్మలేని లోకం నుంచి
మహాలక్ష్మిలాగా
అమ్మలేని మా ఇంట్లోకి
వదినమ్మ రాకా
ఎన్నడైన తన వెనకాలే
ఉంటాను కనకా
అన్నగారు తననేమన్నా
ఊరుకోను ఇంకా
నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి
అంతా ఓర్పుగా
చరణం : 2
మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్లీ
కూతురంటి రూపం నీదే నా చిట్టితల్లి
ఆశలన్నీ అక్షింతలుగా జరగాలి పెళ్లి
అందమైన జంటను చూసి
మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ
తపించాలి నింగిన జాబిలి॥

Thammudu Song With Lyrics - Kalakalalu (Aditya Music)



Watch remaining Songs With Lyrics:

"Made in Andhra student " (Lyrics: Chandra Bose; Singer: Ramana Gogula)
"Vayyari Bhama" (Lyrics: Sirivennela Sitaramasastri; Singer: Ramana Gogula)
"Edola vundi" (Lyrics: Surendra Krishna; Singer: Ramana Gogula)
"Pedavi datani matokati undi " (Lyrics: Sirivennela Sitaramasastri; Singers: Ramana Gogula, Sunitha)
"Travelling soldier" (Lyrics: Ramana Gogula; Singer:Ramana Gogula)
"College blues" (Lyrics: Ramana Gogula; Singer: Ramana Gogula)
"Kala kala ku Kila kila lu" (Lyrics: Chandra Bose; Singer: S.P. Balu)