Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

dEvuDanEvADunnADA - దేవుడనేవాడున్నాడా


చిత్రం : దాగుడుమూతలు(dAguDu mUtalu) (1964)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల

13 September - నేడు ఆచార్య ఆత్రేయ వర్ధంతి
(AchArya AtrEya)


పల్లవి :
దేవుడనేవాడున్నాడా అని మనిషికి
కలిగెను సందేహం (2)
మనుషులనే వారున్నారా అని
దేవునికొచ్చెను అనుమానం (2)॥
చరణం : 1
మనసులేని ఈ మనిషిని చూచి
దేవుడు రాయైపోయాడు
ఆ... దేవుడు కనపడలేదని
మనిషి నాస్తికుడైనాడు (2)॥
చరణం : 2
పశువులకన్నా పక్షులకన్నా మనిషిని
మిన్నగ చేశాడు (2)
బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి
భూమే నీదని పంపాడు (2)
బుద్ధికి హృదయం లేక
హృదయానికి బుద్ధేరాక (2)
నరుడే ఈ నరలోకం నరకం చేశాడు॥
చరణం : 3
తాము నవ్వుతూ
నవ్విస్తారు కొందరు అందరినీ (2)
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో
కొందరినీ (2)
నేను నవ్వితే ఈ లోకం
చూడలేక ఏడ్చింది
నేనేడిస్తే ఈ లోకం
చూసి చూసి నవ్వింది॥

hello gurU prEmakOsamE - హలో గురూ ప్రేమకోసమే


చిత్రం : నిర్ణయం(nirNyam) (1991), రచన : గణేష్ పాత్రో
సంగీతం : ఇళయరాజా, గానం : ఎస్.పి.బాలు
12 September - నేడు అమల బర్త్‌డే / Amala Birthday



పల్లవి :
హలో గురూ ప్రేమకోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే
పొందలేనివాణ్ణి ఆర్నీ //హలో గురూ//
చరణం : 1
ఉంగరాల జుట్టు వాణ్ణి
ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి
చదువు సంధ్య కల్గినోణ్ణి చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నా కన్నా నీకున్న తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే...
వై నాట్ //హలో గురూ//
చరణం : 2
కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లెతీగలా
నీ చేతే పాడిస్తా లవ్ సాంగు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లు
ఆహా నా పెళ్లంట ఓహో నా పెళ్లంట
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట
అచ్ఛా మైనే ప్యార్ కియా
లుచ్ఛా కామ్ నహీ కియా
అమీతుమీ తేలకుంటే నిను లేవదిస్కుపోతా... ఆర్ యు రెడీ
//హలో గురూ//

aMdAlu chindu sImalO - అందాలు చిందు సీమలో

చిత్రం : రాజనందిని(rAjanandini) (1958)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి(mallAdi rAmakrishnaSAstri)
సంగీతం : టి.వి.రాజు
గానం : ఎ.ఎం.రాజా, జిక్కి

12 September - మల్లాది రామకృష్ణశాస్త్రి వర్ధంతి



పల్లవి :
అందాలు చిందు సీమలో
ఉందాములే హాయిగా॥
అందాలు చిందు సీమలో... ఆ...
చరణం : 1
చూసిన చూపు నీకోసమే
నన్నేలు రాజు నీవే నీవే॥
చిన్నారి బాలుడా... ఆ...॥
అందాలు చిందు సీమలో... ఆ...
చరణం : 2
ఆనంద సీమ ఈ లోకము
ఈ తీరుగానే నీవు నేను॥
ఏలేము హాయిగా... ఆ...॥
అందాలు చిందు సీమలో... ఆ...
చరణం : 3
నిలువెల్ల నిండె ఆనందము
నీ మోము గోము నాదే నాదే॥
ఔనోయి బాలుడా... ఆ...॥
అందాలు చిందు సీమలో...



External Link:
aMdAlu chindu seemalO | Player | souce page |