Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

nachchAvE naizAm pOrI - నచ్చావే నైజాం పోరీ

చిత్రం : వర్షం(varsham) (2004)
రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : అద్నాన్ సమి, సునీతారావ్

23 October - నేడు ప్రభాస్ బర్త్‌డే(PrAbhAs Birth Day)


పల్లవి :
నచ్చావే నైజాం పోరీ నువ్వే నా రాజకుమారి
హే... ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ॥
అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి
శాసిస్తే చాలు ఓసారి సిద్ధంగా ఉంది సింగారి
అయ్యారే సయ్యంటుందే తయ్యారై వయ్యారి॥
చరణం : 1
హే... సరదాగా సరసకు చేరి
సాగిస్తా సొగసుల చోరీ
చాల్లెద్దూ మాట కచేరీ దోచేద్దూ తళుకు తిజోరీ
ముదిరావే మాయలమారి
మురిపిస్తే ఎలా మురారి
పరిచానే మల్లెపూదారి
పరిగెత్తుకు రావే పొన్నారి
పిలిచాడే ప్రేమ పూజారి
వెళ్లిపోదా మనసే చేజారి
గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి॥
చరణం : 2
హే... వరదల్లే హద్దులు మీరి
వచ్చావా తమ దయ కోరి
హే... సుడిగాలే నిలువున నిమిరి
ఎగరేసుకుపోతా నారి
దాటొస్తా సిగ్గుల ప్రహరీ
హే... చేరుస్తా చుక్కల నగరి
ముద్దుల్లో ముంచి ఓసారి
మబ్బుల్లో తే ల్చి ఓసారి
మైకంలో తూలి ఓసారి కౌగిళ్లో వాలి ఓ సారీ
వహ్వారే అనిపించాలి వాటేసే ప్రతిసారీ॥

taladinchuku - తలదించుకు

చిత్రం : కెమెరామెన్ గంగతో రాంబాబు(Cameraman Ganga toO rAmbAbu) (2012)
రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : మణిశర్మ
గానం : హేమచంద్ర, కారుణ్య, శ్రీకృష్ణ, నరేంద్ర


పల్లవి :
తలదించుకు బతుకుతావా
తల ఎత్తుకు తిరగలేవా
తలరాతను మార్చుకోవా సిగ్గనేది లేదా
ఒకడిగ నువు పుట్టలేదా
ఒకడిగ నువు చచ్చిపోవా
ఒకడిగ పోరాడలేవా నిద్రలేచి రారా
నీ ఓటుని నీ వేటుకె వాడుతుంటే వింతగా
జుట్టుపట్టి రచ్చకీడ్చి నీలదీయవనేరుగా
ఉడుకెత్తిన నెత్తురె ఒక నిప్పుటేరులాగ
కదలిరా... కదలిరా... కదలిరా...
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది... రారా
చరణం : 1
నీ ఇంటి చూరువిరిగి మీదపడక ముందే
నీ గుండెలచప్పుడు నిను ఛీ కొట్టకముందే
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్...
దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా
దేశానికి జబ్బుచేస్తే నీళ్లునములుతావా
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్...
చరణం : 2
తొలి మనిషెపుడొక్కడేగ
తొలి అడుగెపుడొంటరేగ
తుదిపోరుకు సిద్ధమైన తొలివాడిగ రారా
బిగబట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి
నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా
పోరాడని ప్రాణముంటే అది ప్రాణమే కాద టా
ఊపిరినే ఒలకబోసి ఎగరెయ్యర బావుటా
కణకణకణ ప్రతికణమున
జనగణమన గీతమయ్యి రా...
కదలిరా... కదలిరా... కదలిరా...
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది... రారా

jallE kurisI - జల్లే కురిసీ

చిత్రం : వైశాలి(vaisAli) (2011)
రచన : కృష్ణచైతన్య
సంగీతం : ఎస్.థమన్
గానం : రంజిత్


జల్లే కురిసీ ఎదనే విరిచేసిందే
జల్లే కురిసీ ఎదనే విరిచేసిందే
కనులే తడిసీ కలనే చెరిపేసిందే
నా ముందే నా ముందే ఉన్నా...
లేనట్టే లేనట్టే ఉందే...
॥నా ముందే॥

కురిసే వాన
ఓ వరద హోరుతోనే
ప్రాణాలు తీసుకెళ్లేనే మరీ...
కనులే కనులే ఏదో తెలిపే
ఇది ఏమనుకోను
తడిసే తడిసే మనసే తడిసే
రగిలే రగిలే మనసే రగిలే
జ్వరమే తగ్గదులే
ఇకపై ఇకపై నువ్వే లేవే...