Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

intEnayA telusukOvayA - ఇంతేనయా తెలుసుకోవయా

చిత్రం : కథానాయకుడు(KathAnAyakuDu) (1969)
రచన : దాశరథి
సంగీతం : టి.వి.రాజు
గానం : ఘంటసాల, బృందం

05 November - నేడు దాశరథి వర్ధంతి
పల్లవి :
ఇంతేనయా తెలుసుకోవయా...
ఈ లోకం ఇంతేనయా॥
నీతీ లేదు నిజాయితీ లేదు
ధనమే జగమయ్యా
చరణం : 1
డాబులుకొట్టి మోసం చేసి
జేబులు నింపేరు (2)
పాపం పుణ్యం పరమార్థాలు
పంచకు రానీరు
ఎవరికివారే యమునాతీరే
ఇదే ప్రపంచమయా॥
చరణం : 2 
పైసాతోటి సీసా చేరి
జల్సా చేసింది (2)
మనసే లేని సొగసేవుండి
మైమరపించింది
పైన పటారం లోన లొటారం
ఇదే ప్రపంచమయా॥
చరణం : 3
మంచిని చేసే మనిషిని నేడు
వంచన చేసేరు (2)
గొంతులు కోసేవాడికి
నేడు గొడుగులు పట్టేరు
దొంగలు దొరలై ఊళ్లే దోచిరి
ఇదే ప్రపంచమయా॥

nAdiridInA nAdiridInA - నాదిరిదీనా నాదిరిదీనా

చిత్రం : ఒకరికి ఒకరు(Okariki Okaru) (2003)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కార్తీక్, గంగ


పల్లవి : నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా...
నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదీనా నాదిరిదీనా
నాదిరిదీనా...
విచ్చిన పూల సందేశం విననా॥
సీతాకోకచిలుక రెక్కల్లోన ఒలికే
వర్ణాలన్ని చిలికి హోలీ ఆడనా॥
చరణం : 1
చిగురే పెదవై చినుకే మధువై
ప్రతిలతలో ప్రతిబింబించే
నదులే నడకై అలలే పలుకై
ప్రతిదిశలో ప్రతిధ్వనియించే
ఎవరి కలో ఈ లలన
ఏ కవిదో ఈ రచన॥
చరణం : 2
కురిసే జడిలో ముసిరే చలిలో
ప్రతి అణువు కవితలు పాడే
కలిసే శ్రుతిలో నిలిచే స్మృతిలో
ప్రతిక్షణము శాశ్వతమాయే
ఈ వెలుగే నీ వలన
నీ చెలిమే నిజమననా...॥

edO edO undi - ఏదో ఏదో ఉంది

చిత్రం : ఇష్క్(IshQ) (2012)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : అరవింద్-శంకర్
గానం : ప్రదీప్ విజయ్,
కళ్యాణి నాయర్




పల్లవి :
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగి ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్ చేతుల్లో॥ఏదో॥
నిన్నకీ నేటికీ ఎంతగా మారెనూ
నిన్నలో ఊహలే ఆశలై చేరెనూ॥ఏదో॥
చరణం : 1
అడుగడుగునా నిన్ను కంటున్నా
అణువణువున నిన్ను వింటున్నా
క్షణమునకొక జన్మ చూస్తున్నా
చివరికి నేనే నువ్వు అవుతున్నా

ఎందుకో ఈ తీరుగా మారటం
ఏమిటో అన్నింటికీ కారణం
బదులు తెలిసుండీ
ప్రశ్న అడిగేందుకే॥ఏదో॥
చరణం : 2
లోలో ఉన్నా ఊసు గుండెపెకైళ్లి
గుండెల్లోన ఊహ కళ్లపై తేలి
కళ్లల్లోన ఆశ నవ్వుపై వాలి
నవ్వులోన తల దాచుకుంటుంది
అక్కడే ఆగింది ఆ భావన
దాటితే ఏమౌనో ఏమో అనా?
ఎందుకాలస్యం ఒక్కమాటే కదా॥ఏదో॥