Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

jIvamu nIvEkadA - జీవము నీవేకదా

చిత్రం : భక్తప్రహ్లాద(bhakta prahlAda) (1967)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల


పల్లవి :
జీవము నీవేకదా దేవా...
జీవము నీవేకదా
బ్రోచే భారము నీదేకదా...
నా భారము నీదేకదా
చరణం : 1
జనకుడు నీపై కినుక వహించీ
నను వధియింపా మదినెంచే (2)
చంపేదెవరూ సమసేదెవరూ (2)
సర్వము నీవేకదా స్వామీ... (2)
చరణం : 2
నిన్నేగానీ పరులనెరుంగా
రావే వరదా బ్రోవగ రావే
వరదా... వరదా...
అని మొరలిడగా కరివిభు గాచిన అని మొరలిడగా కరివిభు గాచిన
స్వామివి నీవుండ
భయమేలనయ్యా ॥
చరణం : 3
హే ప్రభో... హే ప్రభో...
లక్ష్మీవల్లభ దీనశరణ్యా (2)
కరుణా భరణా కమలలోచన (2)
కన్నులవిందువు చేయగరావే (2)
ఆశ్రీత భవ బంధ నిర్మూలనా (2)
లక్ష్మీవల్లభ... లక్ష్మీవల్లభ...
చరణం : 4
నన్నే నమ్మీ నీపద యుగళీ
సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా
పన్నగశయనా నారాయణా॥
చరణం : 5
మదిలో వెలిలో చీకటి మాపీ... (2)
పథము జూపే పతితపావనా (2)॥
చరణం : 6
భవజలధినిబడి తేలగలేని (2)
జీవులబ్రోచే పరమపురుషా
నను కాపాడీ నీ బిరుదమునూ
నను కాపాడీ నీ బిరుదమునూ
నిలుపుకొంటివా శ్రీతమందారా॥
చరణం : 7
విశ్వమునిండీ వెలిగే నీవే (2)
నాలో నుండీ నన్ను కావగా
విషమునుద్రావా వెరువగనేలా
విషమునుద్రావా వెరువగనేలా
విషధర శయనా విశ్వపాలనా...॥

chIkaTi velugula - చీకటి వెలుగుల

చిత్రం : విచిత్రబంధం(vichitra bandham) (1972)
రచన : ఆచార్య ఆత్రేయ(AchArya AtrEya)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : ఘంటసాల(ghanTasAla), పి.సుశీల(P.susIla)

13 November - నేడు పి.సుశీల బర్త్‌డే
(P.SuSIla Birth Day)
పల్లవి :
చీకటి వెలుగుల రంగేళీ
జీవితమే ఒక దీపావళి ॥
మన జీవితమే ఒక దీపావళి
అందాల ప్రమిదల
ఆనంద జ్యోతుల
ఆశల వెలిగించు దీపాల వెల్లి ॥
చరణం : 1
అక్కయ్య కన్నుల్లో మతాబులు
ఏ చక్కన్ని బావకో జవాబులు ॥
మాటల్లో వినిపించు చిటపటలు మాటల్లో వినిపించు చిటపటలు
ఏ మనసునో కవ్వించు
గుసగుసలు ॥
చరణం : 2
అల్లుళ్లు వస్తారు
అత్తవారిళ్ళకు
మరదళ్ళు చేస్తారు
మర్యాద వాళ్ళకు ॥
బావా బావా పన్నీరు బావను పట్టుక తన్నేరు
బావా బావా పన్నీరు బావను పట్టుక తన్నేరు
వీధి వీధి తిప్పేరు
వీసెడు గుద్దులు గుద్దేరు॥
చరణం : 3
అమ్మాయి పుట్టింది
అమాసనాడు
అసలైన గజదొంగ
అవుతుంది చూడ ॥
పుట్టినరోజున దొరికాడు తోడు
పుట్టినరోజున దొరికాడు తోడు
పున్నమి నాటికి అవుతాడు జోడు॥

nuvu evvari edalO - నువు ఎవ్వరి ఎదలో

చిత్రం : మల్లీశ్వరి(mallISwari) (2004)
రచన : సిరివెన్నెల(sirivellela)
సంగీతం : కోటి(kOTi)
గానం : ఎస్.పి.బాలు(S.P.bAlu)


పల్లవి :
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల
ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు
చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ తేలదే ఎన్నటికీ
అందుకే నీ కథకీ
అంతులేదెప్పటికీ
తీరాలు లేవే ప్రేమా నీ దారికి
చరణం : 1
కలతలే కోవెలై
కొలువయే విలయమా
వలపులో నరకమే
వరమనే విరహమా
తాపమే దీపమా వేదనే వేదమా
శాపమే దీవె నా నీకిదే న్యాయమా
కన్నీరు అభిషేకమా
నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే
యాగమా ప్రణయమా॥
చరణం : 2
రెప్పలే దాటదే ఎప్పుడూ ఏ కల
నింగినే తాకదే కడలిలో ఏ అల
నేలపై నిలవదే
మెరుపులో మిలమిల
కాంతిలా కనబడే
భ్రాంతి ఈ వెన్నెల
అరణ్యాల మార్గమా
అసత్యాల గమ్యమా
నీతో పయనమే
పాపమా ప్రణయమా॥