Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

AkASam entuNTundO - ఆకాశం ఎంతుంటుందో

చిత్రం : ఏమాయ చేసావె(yE mAya chEsAve)(2010)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : నరేష్ అయ్యర్

23 November - నేడు నాగచైతన్య బర్త్‌డే (nAga chaitanya Birthday)

పల్లవి :
ఆకాశం ఎంతుంటుందో
నాలో ఉన్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దే లోకం అంటే జంకొద్దే
ప్రేమంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టం లేదే
ప్రేమించాక స్నేహం అంటే మనసుకి పడదే
ముందుకు వెళ్లే కాలం ఎపుడూ వెనకకు రాదే
హే... నేస్తమని హింసించకిలా
నీ ప్రేమనని ఊహించనేలా॥నేస్తమని॥॥
చరణం :
ప్రాణం చెప్పే మాటే వింటే
అన్నీ నీకే అర్థం కావా
ఇష్టం ఉన్నా కష్టం అంటూ
నిన్నే నువ్వు మోసం చేసుకుంటావా
ఎంతో మౌనంగా ఉన్న ముద్దిచ్చేవేళ
నుంచో దూరంగా అన్న ఆశని కాల్చేలా॥॥॥నేస్తమని॥

sAi aNtE talli - సాయి అంటే తల్లి

చిత్రం : శిరిడిసాయి(Shirdi Sai) (2012)
రచన : చంద్రబోస్,
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : బాలు, సునీత, బృందం


పల్లవి :
సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా తోడే లేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము
నువ్వొస్తావన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో
జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము
కోటి చుక్కలమయ్యాము
కన్నీటి చుక్కలమయ్యాము ॥తండ్రి॥
చరణం : 1
బోధలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు ॥
పాటలు పాడేదెవరు
మా పొరపాటులు దిద్దేదెవరు॥
తీయగ కసిరేదెవరూ... (2)
ఆపై ప్రేమను కొసరేదెవరు
సాయి... జీవం పోసే
నువ్వే నిర్జీవుడవైనావా
నువ్వు కన్నులు తెరిచేదాకా
మా కంటికి కునుకేరాదు॥తండ్రి॥
చరణం : 2
మాకిచ్చిన నీ విబూదినే
నీకూ కాస్త పూసేమయ్యా
లేవయ్యా సాయి లేవయ్యా
నీ చేతి చిన్నికర్రతో
నిన్నే తట్టి లేపేమయ్యా
లేవయ్యా బాబా లేవయ్యా
ఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షనిఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షని
ఇవ్వాళ మేమడిగేము నీ ప్రాణభిక్షని
ఇచ్చేవరకు ఆగలేము (2)
నువ్వొచ్చేవరకు ఊరుకోము (2)
పచ్చి మంచినీరైనా తాకబోము॥
ఓం సాయి శ్రీసాయి
జయ జయ సాయి॥సాయి॥

nEstamA nEstamA nuvvE - నేస్తమా నేస్తమా నువ్వే

చిత్రం : డమరుకం(Damarukam) (2012)
రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : శ్రీకృష్ణ, హరిణి

Nesthama nesthama Full Song With Lyrics - Damarukam Movie


పల్లవి :
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీ కోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీ కోసం
నేన నే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను
ఈ క్షణం ఎంతబాగుందో ప్రేమలాగా
ఓ... ప్రేమకే రూపమే ఇచ్చి దానికి ప్రాణమే పోస్తే
ఉండదా నిండుగా మనలాగా॥
చరణం : 1
నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం చూశావా ఈ చిత్రం
కనుపాపలోన నీదే కల
ఎద ఏటిలోన నువ్వే అల
క్షణకాలమైనా చాలే ఇలా... అది నాకు వెయ్యేళ్లే
ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలే॥
చరణం : 2
అలుపొస్తే తలనిమిరే చెలినవుతా నీ కోసం
నిదరొస్తే తలవాల్చే ఒడినవుతా నీ కోసం
పెదవంచుపైనా నువ్వే కదా
పైటంచుమీదా నువ్వే కదా
నడుం ఒంపులోనా నువ్వే కదా
ప్రతిచోటా నువ్వేలే
అరచేతిలో రేఖలా మారిపోయావే॥