Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

kAsIki pOyAnu rAmAhari - కాశీకి పోయాను రామా హరి

చిత్రం : అప్పుచేసి పప్పుకూడు(appuchEsi pappukUDu) (1959)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, స్వర్ణలత

27 November - నేడు రేలంగి వర్ధంతి

అతడు : కాశీకి పోయాను రామా హరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి
గంగ తీర్థాము తెచ్చాను రామా హరి
ఆమె : కాశీకి పోలేదు రామా హరి
ఊరి కాల్వలో నీళ్లండి రామా హరి
మురుగుకాల్వలో నీళ్లండి రామా హరి
అతడు : శ్రీశైలం వెళ్లాను రామా హరి
శివుని వీభూతి తెచ్చాను రామా హరి
శివుని వీభూతి తెచ్చాను రామా హరి
ఆమె : శ్రీైశె లం పోలేదు రామా హరి
శివుని వీభూతి తేలేదు రామా హరి
ఇది కాష్ఠంలో బూడిద రామా హరి
అతడు : అన్నమక్కరలేదు రామా హరి
నేను గాలి భోంచేస్తాను రామా హరి
ఉత్త గాలి భోంచేస్తాను రామా హరి
ఆమె : గాలితో పాటుగా రామా హరి
వీరు గారెలే తింటారు రామా హరి
నేతి గారెలే తింటారు రామా హరి
అతడు : కైలాసమెళ్లాను రామా హరి
శివుని కళ్లార చూశాను రామా హరి
రెండు కళ్లార చూశాను రామా హరి
ఆమె : కైలాసమెళితేను రామా హరి
నంది తన్ని పంపించాడు రామా హరి
బాగా తన్ని పంపించాడు రామా హరి
అతడు : ఆలుబిడ్డలు లేరు రామా హరి
నేను ఆత్మయోగీనండి రామా హరి
గొప్ప ఆత్మయోగీనండి రామా హరి
ఆమె : ఆ మాట నిజమండి రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి

Special Notes:
రేలంగి పూర్తి పేరు రేలంగి
వెంకట్రామయ్య. 1919 ఆగష్టు 9న రావులపాడులో జన్మించారు. 1935లో తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రంతో తెలుగు పరిశ్ర మకు పరిచయమయ్యారు. 1970లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ తో సత్కరించింది. ఈ పురస్కారం పొందిన తొలి హాస్యనటునిగా ఆయన చరిత్ర సృష్టించారు.

nI palukE tyAgarAya - నీ పలుకే త్యాగరాయ

చిత్రం : కళ్యాణి (kaLyANi)(1979), రచన : వేటూరి
సంగీతం : రమేష్‌నాయుడు, గానం : బాలు, పి.సుశీల


పల్లవి :
నీపమపా... నీపమపా గపాగరిసా నీరిసా
నీనిరిరి మారిసా పదనీరినీపనీప
మపగపా గరిసా నీరిసా
నీ పలుకే త్యాగరాయ కీర్తన
నీ నడకే క్షేత్రయ పదనర్తన ॥పలుకే॥
సరిమా రిమదా సరిమా రిమదా సానిదపమ
నీపమపా మమదా సనిగమరిసనీ
నీసరిమప మాపగాసరిసానిదప
మరిసా నిసరిమపదా
నీ పిలుపే... నీ పిలుపే జయదేవుని గీతిక
నీ వలపే కాళిదాస కవితా లహరికా
నీ పిలుపే... నీ పలుకే త్యాగరాయ కీర్తన
చరణం : 1
నీవు నన్ను కలుసుకున్న క్షణంలో
తుంగభద్ర కృష్ణతో కలిసింది ॥
నేను నీ కౌగిలిలో కరిగిన సుముహూర్తంలో
నేను నీ కౌగిలిలో కరిగిన సుముహూర్తంలో
ఆ కృష్ణవేణి సాగరాన వెలిసింది (2)
అలనాటి నీ ఒంపుసొంపులన్నీ
హంపిలో శిల్పాలై అజంతా చిత్రాలై
భారత భారతికే హారతి పడుతున్నవి
సుమహారతి పడుతున్నవి ॥
నీ పిలుపే... నీ పలుకే త్యాగరాయ కీర్తన
చరణం : 2
నీతో నేనడిచిన ఏడడుగులే
సంగీతంలో పలికే సప్తస్వరాలు
సరిగమపదని...
నీలో తొలికలయికలో
విరిసిన రసభావాలే (2)
సాహిత్యంలో సాటిలేని
కావ్యాలు (2)
ఈనాటి నీవన్నెచిన్నెలన్నీ
మరులలో మల్లియలై
మరునికే పల్లియలై
జీవన బృందావనిలో
ఆమనులవుతున్నవి సౌదామినులవుతున్నవి॥
నీ పిలుపే... నీ పలుకే త్యాగరాయ కీర్తన

te~nchukuNTE tegipOtundA - తెంచుకుంటె తెగిపోతుందా

చిత్రం : ప్రేయసి రావే(prEyasi rAvE) (1999)
రచన : డా॥వెనిగళ్ల రాంబాబు
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
గానం : ఎస్.పి.బాలు

25 November - నేడు వెనిగళ్ల రాంబాబు బర్త్‌డే(venigaLla rAmbAbu Birthday)
పల్లవి :
తెంచుకుంటె తెగిపోతుందా
దేవుడు వేసిన బంధం (2)
తెలుసుకో నీ జీవిత గమ్యం
పెంచుకోమ్మ అనుబంధం
ఏడు అడుగులు నడిచిన వాడే
ఏడు జన్మలు తోడుంటాడు
భర్తగా నిను భరించు వాడే
బ్రతుకు దీపం వెలిగిస్తాడు
అతని హృదయం నాతి చరామి!
అగ్ని హోత్రమె అందుకు హామి॥॥॥
చరణం : 1
శ్రీవారిని పూజించాలి
చిరునవ్వుల హారతితో
దాంపత్యం వికసించాలి
తరగని మురిపాలతో
దాసి నీవై ప్రేయసి నీవై
నీవే తన ప్రాణమై...
నిండు ప్రేమను తనకందించు
నూరేళ్లూ నడిపించు
పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై
ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి
ఎన్ని జన్మలైనా
మగని హృదయం మమతల
నిలయం మగువకే దేవాలయం॥॥
చరణం : 2
తెగువతో తన పతి ప్రాణాలే
తిరిగి తెచ్చును ఇల్లాలే
అడవిపాలై వెడలిన పతిని
అనుసరించును ఇల్లాలే
చెదిరిపోని నుదుటి రాతకు
శ్రీకారం దంపతులే
గాయం ఏ ఒక్కరిదైనా
కన్నీళ్లూ ఇద్దరివే
పగలు రేయిగా బ్రతుకే హాయిగా
కలకాలమూ నిలవాలి మీరు
పసుపు కుంకుమలుగా
ఆలుమగలే సృష్టికి మూలం
వారికే తల వంచును కాలం॥