Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

te~nchukuNTE tegipOtundA - తెంచుకుంటె తెగిపోతుందా

చిత్రం : ప్రేయసి రావే(prEyasi rAvE) (1999)
రచన : డా॥వెనిగళ్ల రాంబాబు
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
గానం : ఎస్.పి.బాలు

25 November - నేడు వెనిగళ్ల రాంబాబు బర్త్‌డే(venigaLla rAmbAbu Birthday)
పల్లవి :
తెంచుకుంటె తెగిపోతుందా
దేవుడు వేసిన బంధం (2)
తెలుసుకో నీ జీవిత గమ్యం
పెంచుకోమ్మ అనుబంధం
ఏడు అడుగులు నడిచిన వాడే
ఏడు జన్మలు తోడుంటాడు
భర్తగా నిను భరించు వాడే
బ్రతుకు దీపం వెలిగిస్తాడు
అతని హృదయం నాతి చరామి!
అగ్ని హోత్రమె అందుకు హామి॥॥॥
చరణం : 1
శ్రీవారిని పూజించాలి
చిరునవ్వుల హారతితో
దాంపత్యం వికసించాలి
తరగని మురిపాలతో
దాసి నీవై ప్రేయసి నీవై
నీవే తన ప్రాణమై...
నిండు ప్రేమను తనకందించు
నూరేళ్లూ నడిపించు
పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై
ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి
ఎన్ని జన్మలైనా
మగని హృదయం మమతల
నిలయం మగువకే దేవాలయం॥॥
చరణం : 2
తెగువతో తన పతి ప్రాణాలే
తిరిగి తెచ్చును ఇల్లాలే
అడవిపాలై వెడలిన పతిని
అనుసరించును ఇల్లాలే
చెదిరిపోని నుదుటి రాతకు
శ్రీకారం దంపతులే
గాయం ఏ ఒక్కరిదైనా
కన్నీళ్లూ ఇద్దరివే
పగలు రేయిగా బ్రతుకే హాయిగా
కలకాలమూ నిలవాలి మీరు
పసుపు కుంకుమలుగా
ఆలుమగలే సృష్టికి మూలం
వారికే తల వంచును కాలం॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |