Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

kattilANTi pilla - క త్తిలాంటి పిల్ల

చిత్రం : నాయక్ (nAyak) (2013)
రచన : చంద్రబోస్, సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : థమన్, పెషాల్ అల్వారిస్

పల్లవి :
Oh my god
feel the way i am feeling
bloom me up all your love... yaahh...
ohh ooo... hey... to the beach
that's right...
క త్తిలాంటి పిల్ల కస్సు మెరుపులా
మెరవకే అలా కంగారే కలిగించేలా
హెయ్ క త్తిలాంటి పిల్ల క కన్నె విడుగులా
నడవకే అలా కోరిందిచ్చై ఇవ్వాళ
ఓ మత్తెక్కిస్తోందిరా పిచ్చెక్కిస్తోందిరా
నీలోని తొందర
కావాలని ఉందిరా ఇవ్వాలని ఉందిరా
కాసేపు ఆగరా
madam madam madam
just be my be my madam
i love u love u madam
నా ప్రేమే నిజం పెదవందించే బంగారం
క త్తిలాంటి పిల్ల హే కస్సు మెరుపులా
హెయ్ నడవకే అలా కోరిందిచ్చై ఇవ్వాళ
చరణం :
కొంటె కోరికలు చూశా కొండంత ప్రేమ చూశా
చూడలేక జాలేసి సిగ్గుల్లో తలుపే తీశా
గుండె పైన పరుపేశా చిరునవ్వు పూలు పరిచా
ఆజా అందాల నాయకా...
ఆజా నా అంగరక్షకా...
ఆజా ఆజా ఆలస్యం చేయక ఆజా రాజా
ఆ మాటే హాయిరా
అడిగింది కాదురా... అడగందివ్వాలిరా
॥Oh my god॥॥త్తిలాంటి॥
ఆజా జగదేక ప్రేమికా...
ఆజా జతలోన శ్రామికా...
ఆజా ఆజా అవకాశం వదలక ఆజా రాజా
॥Oh my god॥

nElanaDigA - నేలనడిగా

చిత్రం : ప్రియమైన నీకు(Priyamaina nIku) (2001), రచన : సిరివెన్నెల
సంగీతం : శివశంకర్, గానం : ఎస్.పి.బాలు

08 January - నేడు తరుణ్ బర్త్‌డే (Tarun Birthday)
పల్లవి :
నేలనడిగా పువ్వులనడిగా
నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి ఏదనీ
గాలినడిగా మబ్బులనడిగా
రామచిలక రెక్కలనడిగా క్షే మంగా ఉందా అని
ఐనా ఇంతవరకు ఆచూకి లేక
తెగిన గాలిపటమై తిరిగా ఎటో దారితోచక ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమా
ఏనాటికి చూపునో చిరునామా ॥
చరణం : 1
ఇపుడే ఇటు వెళ్లిందంటూ చిరుగాలి చెప్పింది
నిజమే ఇంకా గాలుందో చెలి పరిమళం ఉంది
ఇందాక చూశానంటూ సిరిమల్లె చెప్పింది
ఇదిగో అంటూ తనలో చెలి చిరునవ్వే చూపింది
ఈ గుడిగంటల్లో తన గాజుల సడి వింటుంటే
తను ఈ కోవెల్లో ఇప్పటివరకు ఉన్నట్టే
ఎటుచూసినా తన జాడలే ఎటువెళ్లిందో ఈ లోపునే॥
చరణం : 2
నడయాడే దీపంలాంటి ఆ రూపం చూస్తుంటే
కనుపాపల్లో కలకాలం కొలువుండిపోతుంది
నడకైన నాట్యంలాగే అనిపించే తన వెంటే
దివిలో ఉండే మెరుపే దిగి వచ్చిందనిపిస్తుంది
ఎందరో చూశారో కలగన్నామనుకున్నారో
అందుకనే ఏమో తను నిజం కాదనుకున్నారో
బతిమాలినా బదులివ్వదే
తను ఉందంటూ నను నమ్మరే ॥

dheem tanak dheem - ధీం తనక్ ధీం

చిత్రం : వారసుడు(vArasuDu) (1993)
రచన : వెన్నెలకంటి
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

పల్లవి :
ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...
ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలేసి కలేసి నిలేసి మనసున॥తనక్ ధీం॥
చరణం : 1
చలో మేరీ స్వీటీ బుల్ బుల్ బ్యూటీ
భలేగుంది భేటీనీతోటి
నిదానించు నాటీ ఏమా ధాటి
మజా కాదు పోటీ మనతోటి
సిగ్గు లూటీ చేసెయ్యి కళ్లతోటి
ఇచ్చేయి ముద్దు చీటీకౌగిళ్లు దాటి
ఒకటే సరదా వయసే వరద
కలలే కనక కథలే వినక మర్యాద
చురుక్కు చలెక్కి అడక్క అడిగిన॥తనక్ ధీం॥
చరణం : 2
ఇదేం ప్రేమ బాబూ ఇలా చంపుతుంది
అదే ధ్యాస నాలో మొదలైంది
పదారేళ్ల ప్రేమ కథంతేను లేమ్మా
అదో కొత్త క్రేజీ హంగామా
పొద్దుపోదు ముద్దైనా ముట్టనీదు
నిద్రైనా పట్టనీదు నా వల్ల కాదు
ఒకటే గొడవ ఒడిలో పడవా
నిన్న మొన్న లేనే లేదు ఈ చొరవ
ఇవాళ ఇలాగ దొరక్క దొరికిన॥తనక్ ధీం॥