Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

evariki teliyadulE - ఎవరికి తెలియదులే

చిత్రం : దొరికితే దొంగలు(dorikitE dongalu) (1965)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల

పల్లవి :
ఎవరికి తెలియదులే
ఇంతుల సంగతి (2)
ఇంతుల సంగతి
పూబంతుల సంగతి॥
చరణం : 1
జడలో మల్లెపూల జాతర
చేస్తుంటారు (2)
బంగారు పెదవులపై
రంగులు పూస్తుంటారు (2)
ఈ సోకులన్నీ
ఇంకెవరికోసమంటారు (3)॥
చరణం : 2
ముసిముసి నగవులతో
మిసమిస చూపులతో (2)
దాచుకున్న తలపులతో
దోచుకున్న వలపులతో (2)
మొదట కసరికొడతారు
పిదప చల్లబడతారు (3)॥
చరణం : 3
పందిరి లేకుంటే
తీగ పైకి పోతుందా (2)
గోడలు లేకుంటే
గోపురమే ఉంటుందా
పురుషులు లేకుంటే
తరుణల పని గోవిందా (3)॥

dArlingE Osi - డార్లింగే ఓసి

చిత్రం : మిర్చి(mirchi) (2013)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : దేవిశ్రీ ప్రసాద్, గీతా మాధురి


పల్లవి :
నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు
మనసేమో గిల్లా గిల్లా కొట్టెస్కుంటాందే
డార్లింగే ఓసి నా డార్లింగే
డార్లింగే ఏంది ఈ ఫీలింగే
తొక్కమీద కాలేసి నీ ఒళ్లో పడ్డట్టు
మస్తు మస్తు సీనే రాతిరి కల్లోకొచ్చిందే
డార్లింగే ఓరి నా డార్లింగే
డార్లింగే ఏంది ఈ ఫీలింగే
సచ్చిను బ్యాటే తెచ్చి నన్ను సిక్సరు పీకేసినట్టు
బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే
రబ్బరు మూతే పెట్టి గాజుసీసాలో కుక్కేసినట్టు
ఉక్క పోసేస్తోంది రారో డార్లింగే
ఎహె చేసిన వెయిటింగ్ చాల్లే
ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగే
డార్లింగే ఓసి నా డార్లింగే
డార్లింగే బెగిరాయే డార్లింగే
డార్లింగే ఓరి నా డార్లింగే
డార్లింగే బెగిరారో డార్లింగే
చరణం : 1
నువ్వో చిచ్చుబుడ్డి నేనో అగ్గిపుల్లా
రాయే పిల్లా మోగించేద్దాం దీపావళి మోత
నువ్వో కత్తిపీట నేనేమో యాపిలంటా
నీ పర పరా చూపులకోత నాకూ ఇష్టమంటా
గల్ఫు సెంటు బుడ్డల్లే గుప్పు గుప్పుమన్నావే
ఒంటి నిండా చల్లేస్కుంటా రాయే డార్లింగే
గంప కింది కోడల్లే పూటకో ముద్దిచ్చి
ప్రేమగా పెంచుకుంటా రారో డార్లింగే॥
చరణం : 2
జెళ్లో తురుముకున్న మల్లెపూలదండే నలిగి
విలా విలా నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తాదబ్బి
పెద్దోళ్లిచ్చుకున్న పాత పందిరి మంచం విరిగి
గొల్లుమనే టైము తొందర్లోనే రానున్నాదే బేబీ
ఉట్టిమీది బొబ్బట్టు నోటిలోన పడ్డేట్టు
ఆవురావురంటూ ఏదో చేసెయ్ డార్లింగే
కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు
టేస్టు చూసేస్కుంటా వొచ్చెయ్ డార్లింగే॥

dorala neeku - దొరలనీకు కనులనీరు

చిత్రం: నాలుగు స్తంభాలాట(nAlugu stAmbhAlATa) (1982)
రచన: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : రాజన్-నాగేంద్ర, గానం: పి.సుశీల

పల్లవి :
దొరలనీకు కనులనీరు దొరలదీలోకం
మగదొరలదీలోకం...
కనులలోనే దాచుకోవే కడలిలా శోకం
కన్నెపడుచులా శోకం
చరణం : 1
నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగిపోయే జగతిలో
నాలుగు పాదాల ధర్మం నడువలేని ప్రగతిలో
నాలుగు స్తంభాలాట ఆడబ్రతుకు తెలుసుకో॥
చరణం : 2
వెన్నెలే కరువైననాడు నింగినిండా చుక్కలే (2)
కన్నెగానే త ల్లిైవైతే కంటినిండా చుక్కలే
నాల్గు మొగముల బ్రహ్మరాసిన
ఖర్మనీకిది తెలుసుకో॥
చరణం : 3
కలవని తీరాల నడుమ గంగలాగా కదిలిపో (2)
అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో
నాలుగు వేదాలసారం అనుభవంలో తెలుసుకో॥

External Link:
Download All mp3 Songs