Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

mirchi mirchi - మిర్చి మిర్చి

చిత్రం : మిర్చి(mirchi) (2013), రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : చిన్న పొణ్ణు

మిర్చి మిర్చి మిర్చి మిర్చి
మిర్చీ లాంటి కుర్రాడే
మిర్చి మిర్చి మిర్చి మిర్చి...
మిర్రా మిర్రా మీసం తిప్పి మిస్సైలల్లే దూకాడే
మిర్చి మిర్చి మిర్చి మిర్చి...
॥మిర్చి॥

ఆ నిప్పుకుమల్లే నిఖార్సైన ఆకారం
అడుగెట్టిన చోట అద్దిరిపోద్ది గుడారం
అబ్బా ఇప్పుడుగందా
మొదలౌతాది యవ్వారం
వీడి చప్పుడు చాలు
దుమ్మో దుమ్మో దుమ్మారం
॥మిర్చి॥

ఎక్కడికిట్టా బెలైల్లాడో బంగారం
ఏ గుండెలు తట్టి మోగిస్తాడో అల్లారం
ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలం
ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలం

kArunna mainaru - కారున్న మైనరు

చిత్రం : మైనరుబాబు(mainaru bAbu) (1973)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : టి.చలపతిరావు
గానం : పి.సుశీల

22 February - నేడు టి.చలపతిరావు వర్ధంతి

పల్లవి :
కారున్న మైనరు
కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరు
మా చేతికి వచ్చాయి తాళాలు
మా చేతికి వచ్చాయి తాళాలు... హత్తెరి...॥
చరణం : 1
రోడ్డెంత బాగుంటే మీకంత హుషారు
దాన్నేసినోళ్ల మీదనే ఎక్కించి పోతారు॥
మేమెక్కి కూచుంటే మీరేమైపోతారు మేమెక్కి కూచుంటే మీరేమైపోతారు
మా పక్కనింత చోటిస్తే
చాలంటారు... హత్తెరి॥
చరణం : 2
పదునైన కన్నెపిల్ల ఎదురైతే
పళ్లికిలించి ప్రేమపాఠాలెన్నో
చెబుతారు॥
పెళ్లాడమంటేనే గొప్పోళ్లమంటారు
మా ప్రేమ ముందు
బీదోళ్లు మీరేనంటాను॥
చరణం : 3
నీ వెంట నేనొస్తే నీ డబ్బు చూస్తాను
నా వెంట నువ్వు వచ్చావా
లోకాన్నే చూస్తావు
లోకాన్ని చూడందే
నువ్వు మనిషివి కాలేవు (2)
మావాడివైతే కలకాలం
బతికుంటావు... హత్తెరి ॥

maradalu pillA - మరదలుపిల్లా

చిత్రం : గండికోటరహస్యం(ganDikOTa rahasyam) (1969)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు

పల్లవి : మరదలుపిల్లా ఎగిరిపడకు
గడసరిపిల్లా ఉలికిపడకు
నా గెలుపే నీ గెలుపు కాదా (2)॥
చరణం : 1
మొగిలిపువ్వులా సొగసుంది
ముట్టుకుంటే గుబులౌతుంది (2)
కోడెతాచులా వయసుంది
అది కోరుకుంటే దిగులౌతుంది (2)
ఆ కోపంలో భలే అందముంది (2)॥
చరణం : 2
కసురుకుంటే కవ్విస్తాను
విసురుకుంటే ఉడికిస్తాను (2)
ముక్కుతాడు తగిలిస్తాను
ఆ మూడుముళ్లు వేసేస్తాను (2)
ఏనాడైనా నీవాడనేను (2)॥
గానం : ఘంటసాల

navvenu nAlO - నవ్వెను నాలో

సాకీ :
అనురాగ గగనాలలోన ఆగింది కన్నీటి వాన
మెరిసింది ఒక ఇంద్రధనువు
విరిసింది నాలోని అణువణువు
పల్లవి :
నవ్వెను నాలో జాజిమల్లి
పొంగెను నాలో పాలవెల్లి
తళతళలాడెను నా ముంగిట
ముత్యాల రంగవల్లి ॥

చరణం : 1
నా ఆశలు పులకించెనా
నా పూజలు ఫలియించెనా॥ఆశలు॥
ఆ పరమేశ్వరి చూపులు నాపై
అమృతధారలై కురిసెనా
అమృతధారలై కురిసెనా...
చరణం : 2
ఈ చీకటి విడిపోవునా
ఎలవెన్నెల విరబూయునా
చీకటి॥
నవజీవన బృందావనిలోన
నా స్వామి నను చేరునా
నా స్వామి నను చేరునా... ॥
గానం : పి.సుశీల