Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

vidhi ADina ATalalOna - విధి ఆడిన ఆటలలోన

పల్లవి :

విధి ఆడిన ఆటలలోన అలసినదా ఈ ప్రేమ
మది పాడిన పాటలలోన
ఎగసినదా ఈ ప్రేమ
హృదయాలను వీడనిది
ఉదయాలను చూపునది
గ్రహణాలను పిలిచినదా తలచే ప్రేమ
గమ్యాలను చూపునది గగనాలకు సాగినది
శూన్యాలను వెతికినదా వలచే ప్రేమ


చరణం : 1

ప్రేమా నీ విలువేదమ్మా
ప్రేమా నీ చలువేదమ్మా
నిలువెల్ల విషముగ మారి చూస్తూ ఉన్నావు
ప్రేమా నీ దయలేదమ్మా
ప్రేమా నీ ప్రేమేదమ్మా
తొలిప్రేమను బలిగా కోరి
ఆడుతున్నావు
తొలివేకువ తరుణాన
మలిసంధ్యగ మారావు
కోపమా... ద్వేషమా... శాపమా...
ఆశలవంతెన పరిచావు మృత్యువు
ముంగిట నిలిపావు... ఆ... ॥

చరణం : 2

ప్రేమా నువ్వు కరుణించావా
ప్రేమా నువ్వు కనిపించావా
కలలన్నీ నిజములు చేసి గుండె నింపావు
ప్రేమా నువ్వు బ్రతికించావా
ప్రేమా నువ్వు వినిపించావా
కథలన్నీ రుజువులు చేసి ప్రేమ పంచావు
చలివెన్నెల సమయాన
చెలి చెక్కిలి తడిమావా
హాయిగా... జాలిగా... చేరగా...
జన్మకు అర్థం తెలిపావు
తీర ని ఋణమై నిలిచావు... ఆ...
విధి ఆడిన ఆటలలోన
గెలిచినదా ఈ ప్రేమ
మది పాడిన పాటలలోన
మురిసినదా ఈ ప్రేమ
హృదయాలను వీడనిది
ఉదయాలను చూపినది
గ్రహణాలను చెరిపినదా తలచే ప్రేమ
గమ్యాలను చూపినది గగనాలకు సాగినది
చైత్రాలను పిలిచినదా వలచే ప్రేమ

చిత్రం : గుడ్‌మార్నింగ్ (2012)
రచన : మౌనశ్రీమల్లిక్
సంగీతం : రవి కళ్యాణ్, గానం : దిన్‌కర్

enta madhuraseema - ఎంత మధురసీమ


చిత్రం : దేవాంతకుడు(dEvAntakuDu) (1960)

రచన : ఆరుద్ర, సంగీతం : అశ్వత్థామ
గానం : పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి

పల్లవి :
ఎంత మధురసీమ ప్రియతమా
సంతతము మనమిచటే...
సంతతము మనమిచటే సంచరించుదామా
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 1
వినువీధుల తారకలే
విరజాజుల మాలికలై (2)
కనులముందు నిలువగా...
కనులముందు నిలువగా
నీ కురులలోన ముడిచెదనే
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 2
గగన గంగ అలలలోన
కదలియాడు తామరలే (2)
కరములందు వచ్చి చేర...
కరములందు వచ్చి చేర
నీ చరణ పూజచేయుదునా
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 3
ఎటుచూచిన అందమే
చిందును మకరందమే (2)
ఈ వన్నెల వెన్నెలలో...
ఈ వన్నెల వెన్నెలలో ఓలలాడి సోలుదుమా
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 4
కమ్మని ఈ వనమందున
కలసిమెలసి పాడుదమా (2)
కల్పవృక్ష ఛాయలోన...
కల్పవృక్ష ఛాయలోన కాపురమే చేయుదమా
ఎంత మధురసీమ ప్రియతమా
Download Song:
Enta madhuraseema

chiTTigumma padavE - చిట్టిగుమ్మ పదవే

చిత్రం : తొలిముద్దు(tolimuddu) (1993)


రచన : భువనచంద్ర, సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

పల్లవి :
చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం
వెండిమబ్బు ఒడిలో
ముద్దు ముచ్చటలాడుకుందాం
చిరుగాలై కొండా కోనల్లోనా తేలి
చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి॥॥
చరణం : 1
కడలీ అంచుల్లో జలకాలాడీ
అలలా అంతూ పొంతూ చూసొద్దామా
యమహో ముందో ముద్దు లాగిద్దామా
తొణికే వెన్నెల్లో సరసాలాడీ
వయసూ హద్దూ పొద్దూ తేలుద్దామా
త్వరగా అస్సూ బుస్సూ కానిద్దామా
తరగని మోహాలే వేశాయి వలలో
తడితడి ఒంపుల్లో పిల్లోడా
అరగని అందాలే పొంగాయి సడిలో
పెదవుల తాంబూలం అందీవే
తనువిచ్చెయ్‌మంటోంది మనసొద్దొద్దంటోంది
ఇక సిగ్గేమంటూ కొమ్మా రెమ్మా ఊగాడింది॥
చరణం : 2
చలిలో చిన్నారీ వయ్యారాలే
కసిగా గుచ్చీగుచ్చీ ఊరిస్తుంటే
ఉసిగా తట్టితట్టి ఊగిస్తుంటే
వలపుల కౌగిళ్ల నజరానాలే
రతిలా మళ్లీమళ్లీ అందిస్తుంటే
మరుడే ఒళ్లోకొచ్చి కవ్విస్తుంటే
తెలియని ఆవేశం రేగిందే మదిలో
తలుపులు తీవేమే బుల్లెమ్మా
పరువపు ఆరాటం తీరాలి జడిలో
తకథిమి సాగించెయ్ బుల్లోడా
ఇహ అడ్డేముందమ్మో మలి ముద్దిచ్చైవమ్మో
మెరుపల్లే బాణం సంధించైరా వీరా ధీరా॥