Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

kAnarAra kailasa - కానరార కైలాస

చిత్రం : సీతారామకళ్యాణం(sItArAma kalyANam) (1961)

మహాశివరాత్రి స్పెషల్(mahASivarAtri Special)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : గాలి పెంచల నర్సింహారావు
గానం : ఘంటసాల

పల్లవి :
కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరాహర॥
చరణం : 1
భక్తజాల పరిపాల దయాళ (2)
హిమశైలసుతా ప్రేమలోలా॥
చరణం : 2
నిన్నుజూడ మది కోరితిరా... ఆ... (2)
నీ సన్నిధానమున చేరితిరా ॥
కన్నడ సేయక కన్నులు చల్లగ
మన్నన సేయరా గిరిజా రమణా॥
చరణం : 3
సర్ప భూషితాంగ కందర్పదర్పభంగా (2)
భవపాశనాశ పార్వతీ మనోహర
హే మహేశ వ్యోమకేశ త్రిపురహర॥

ASA EkASA - ఆశా ఏకాశా

చిత్రం : జగదేకవీరుని కథ(jagadEkaveeruni katha) (1961)
రచన : పింగళి నాగేంద్రరావు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, స్వర్ణలత

10 March - నేడు స్వర్ణలత జయంతి

పల్లవి :
ఆశా ఏకాశా
నీ నీడను మేడలు కట్టేశా (2)
చింతలో రెండు చింతలో
నా చెంత కాదు నీ తంతులూ
ఓయ్... చింతలో
రెండు చింతలో
నా చెంత కాదు నీ తంతులూ
చరణం : 1
ఓ... వద్దంటె కాదె ముద్దుల
బాలా ప్రేమ పరగణా రాసేశా॥
నిన్ను రాణిగా...
నిన్ను రాణిగా చేసేశా
చేతులు జోడించి మ్రొక్కేశా||ఆశా... ॥
చరణం : 2
ఓ... కోశావులేవోయి కోతలు
చాల చూశానులే నీ చేతలూ॥కోశావులేవోయి॥
రాజు ఉన్నాడూ...
రాజు ఉన్నాడూ
మంత్రి ఉన్నాడూ
సాగవు సాగవు నీ గంతులు
చింతలో... ఆ... రాజా...
మంత్రా... ఎవరూ... ఎక్కడా
రాజుగారి బూజు దులిపేస్తా
మంత్రిగారి చర్మం ఒలిచేస్తా॥
కోటలో పాగా...
కోటలో పాగా వేసేస్తా గట్టి నీ చెయ్యి పట్టేస్తా...॥॥
Special Note:
ఆమె అసలు పేరు మహాలక్ష్మి. కర్నూలు జిల్లాలోని చాలగమర్రి గ్రామంలో మార్చి 10న, 1928లో జన్మించారు. మొదటగా హెచ్.ఎమ్.వి. కంపెనీలో పాడారు. ఆలిండియా రేడియోలో ఎన్నో లలిత గీతాలు పాడారు. మాయారంభ (1950)లో ‘రాత్రనక పగలనక’ పాటతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు స్వర్ణలత. గాయకులైన మాధవపెద్ది సత్యం, పిఠాపురంతో కలిసి చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారు. ఎన్నో పురస్కారాలతో పాటు, తమిళనాడు ప్రభుత్వం 1974 లో ‘దళపతి’ బిరుదుతో సత్కరించింది. ఆరుభాషలలో దాదాపు వేలకు పైగా పాటలు ఆలపించారు. హాస్యగీతాల స్పెషలిస్టుగా స్వర్ణలత సంగీతాభిమానుల గుండెల్లో చిరస్మరణీయం. ఆమె కుమారుడైన అనిల్‌రాజ్ ఈ మధ్యనే ‘ఆడ నేను... ఈడ నీవు’ అనే 50 పాటల సంకలనం గల సీడీని విడుదల చేశారు. అలాగే ఆమె నిజ జీవితానికి సంబంధించి ‘జీవితచరిత్ర-సినీప్రస్థానం’ అని ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. ఆమె పేరు మీద రెండు అనాథాశ్రమాలు కూడా నడుస్తున్నాయి.

rAmanavami - రామనవమి


చిత్రం : శిరిడిసాయి(shirdi sai) (2012)

రచన : వేదవ్యాస
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : హరిహరన్, మాళవిక, బృందం

సాకీ :
శ్రీ రామా జయ రామా...
రమణీయ నామ రఘురామా...॥రామా॥
పల్లవి :
రామనవమి చెప్పింది
రామకథా సారం (2)
శ్రీరామనవమి చెప్పింది
రామకథా సారం (2)
ఊరూ వాడా సంబరం (2)
చిందేసింది అంబరం
రామనవమి జయ రామనవమి
శ్రీరామనవమి చెప్పింది
రామకథా సారం
చరణం : 1
దశరథుని ఇంట రామరూపమున
కౌసల్య కడుపు పండెను
విశ్వామిత్రుని వెంట దాశరథి
విశ్వశాంతి విలసిల్లెను
పాదధూళితో రాయిని రమణిగా
మార్చెను మంగళధాముడు (2)
శివ ధనువు విరిచి నవ వధువును
సీతను చేరెను రాముడు
సాయి... ఆ రాముడు కొలిచిన పరమ
శివుడవు పరమేశ్వరుడవు నీవే సాయి
పరమేశ్వరుడవు నీవే సాయి...
రామ సాయి రామ సాయి
రామ సాయిరాం (4)
రామ రామ రామ రామ (2)॥
చరణం : 2
తండ్రి మాటకే విలువ తెలిపింది
దండకారణ్య పయనము
మాయలేడితో మలుపు తిరిగింది
మాధవదేవుని ప్రయాణము
వానరసేనలు వారధి కట్టగా
వారిధి దాటెను నరవరుడు (2)
రణ శిరమున రావణు కూర్చి
పట్టాభిరాముడాయె రఘురాముడు
సాయి... ఆ రామసాయి శ్రీకృష్ణ సాయి
శ్రీరంగ సాయివి నీవే సాయి
సకల దేవత సన్నిధి నీవే
సమర్థ సద్గురు షిరిడిసాయి॥సాయి॥॥