Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

alalE pomgenu - అలలే పొంగేను


చిత్రం : సంభవామి యుగేయుగే (sambhavAmi yugEyugE)(2005)

రచన : కృష్ణచైతన్య
సంగీతం : అనిల్. ఆర్
గానం : రాంకీ

పల్లవి :
అలలే పొంగేను వేగంగా
అలుపే రాదంది ఈ గంగ
స్నేహం స్వరంలా నాతో వరంలా
కథకాని తీపి కలలా...
అలలే పొంగేను వేగంగా
అలుపే రాదంది ఈ గంగ
మొదలంటూ లేదు... తుదికంటూ రాదు
మిగిలుంది పోనివ్వు అలా
చరణం : 1
ఏనాటి బంధం మదిలో ఆనందం
నుదిటిరాత అనుకో...
మీ వెంటే నేను సరి నా వెంటే మీరు
విడని తోడు అనుకో...
పసి మనసులన్నీ ఈ వేళ
ఒకటైనదేమో అది నీ లీల...
చరణం : 2
చీకటి పోని... వెలుగంతా రాని మన ని ఒక్కటననీ...
ఓ... ఆడిందే ఆట మేం పాడిందే పాట
ఒట్టేసి అన్నమాట...
సెలయేటి పైన చిన్ని వాన
విడలేము నిన్ను ఓ క్షణమైనా
కలిసే ఉంటాము... కలలే కంటాము
కనులన్నీ కలల అలలే
అలలే పొంగేను వేగంగా
అలుపే రాదంది ఈ గంగా
దేహం నాదంటూ... ప్రాణం నీదంటూ
జననం నీతోనే... మరణం నీతోనే...

Special Note:
అనిల్ పూర్తిపేరు తుమ్మా అనిల్‌రెడ్డి. మే 25, 1974లో గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో పుట్టారు. సంగీత దర్శకుడిగా ‘సంభవామి యుగేయుగే’ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నిన్న నేడు రేపు, గ మ్యం, కళవర్ కింగ్, ఔఆగి వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఏప్రిల్ 22, 2011లో మరణించారు.

ammAy manasulO - అమ్మాయ్ మనసులో

చిత్రం : ఇద్దరమ్మాయిలతో(iddarammAyilathO) (2013)

రచన : భాస్కరభట్ల
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సాగర్, గీతామాధురి

సాకీ :
ఆమె: అమ్మాయ్ మనసులో
అబ్బాయ్ దూరేసి
కితకితలే పెట్టేస్తే ఏమౌతాది..?
అతడు: మంచి బీటొస్తాది
పిచ్చ పాటొస్తాది
ఆ: అబ్బాయ్ మనసునే
అమ్మాయ్ లాగేసి
తలగడలా నొక్కేస్తే ఏమైతాది..?
అ: మస్త్ మాసొస్తాది బెస్ట్ ఊపొస్తాది...
పల్లవి :
అ: రాయే రాయే నా రాకాసీ...
నువ్వే పైటేసీ అట్టా దోపేస్తే
టాపు లేసిపోద్ది... పోద్ది... పో... పో... (2)
ఆ: రారో రారో నా శివకాశి...
అగ్గిరాజేసీ... సిగ్గుపేల్చేస్తే...
టాపు లేసిపోద్ది... పోద్ది... పో... పో... (2)
చెటు ్టమీద మ్యాంగోలా... నువ్వెంత సక్కగున్నావే
చాకులాంటి పిల్లాడే... ఎంతషార్ప్‌గున్నాడే
చాకొచ్చీ మ్యాంగో కోస్తే...
టాపు లేసిపోద్ది... కన్నే కొట్టావంటే
టాపు లేసిపోద్ది... ముద్దే పెట్టావంటే
ఆ: టాపు లేసిపోద్ది... చెయ్యే పట్టావంటే
టాపు టాపు టాపు లేసిపోద్దిరో... ॥
చరణం : 1
అ: ఏయ్... సమ్మర్లోనా లస్సీలా వింటర్లోనా కాఫీలా
ఊరిస్తున్నావే పట్టి లాగేస్తున్నావే
పిల్లా పొంగేపొంగే పూరీలా
ఆ: రాంబోకేమో తమ్ముళ్లా... జాకీచాన్ అల్లుళ్లా
ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే
అబ్బో బ్రేకుల్లేని లారీలా
అ: రాయే రాయే నా రాకాసీ...
అట్టా న వ్వేసీ గుండె తవ్వేస్తే
ఆ: రారో రారో నువ్ చిటికేసి
షర్టు మడతేసీ కాలరెగరేస్తే
అ: టాపు లేసిపోద్ది... ఓణీ కట్టావంటే
టాపు లేసిపోద్ది... పూలే పెట్టావంటే
ఆ: టాపు లేసిపోద్ది... ఈలే కొట్టావంటే
టాపు టాపు టాపు లేసిపోద్దిరో...
చరణం : 2
అ: ఏయ్... కోతికేమో కొబ్బర్లా... పిల్లాడికి బర్గర్లా...
నచ్చేస్తున్నావే.. కల్లోకొచ్చేస్తున్నావే...
అరె కొత్త ఫిలిమ్ ట్రైలర్లా
ఆ: పోలీసుకీ రౌడీలా... ఆడోళ్లకీ చాడీలా
బుక్కైపోయావే నాకు సెట్టైపోయావే
సోడాబుడ్డిలోని గోళీలా
అ: రాయే రాయే నా రాకాసి...
గోళ్లుకొరికేసీ ఒళ్లు విరిచేస్తే
ఆ: రారో రారో నువ్ ఇటుకేసి
ప్యాంటు మార్చేసి లుంగీ కట్టేస్తే
అ: టాపు లేసిపోద్ది... కాటుకెట్టావంటే
టాపు లేసిపోద్ది... గాజులేశావంటే
ఆ: టాపు లేసిపోద్ది... గోడే దూకావంటే
టాపు లేసిపోద్ది... డోరే కొట్టావంటే
టాపు లేసిపోద్ది... టాపు లేసిపోద్ది...
టాపు టాపు టాపు... టాపు లేసిపోద్ది...

jeevana vAhini - జీవనవాహిని

చిత్రం : గంగోత్రి(gangotri) (2003)

రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కీరవాణి, గంగ, కల్పన, శ్రీవర్ధిని

పల్లవి : అతడు: ఓం... ఆమె: ఓం... అ: జీవనవాహిని... పావని...
కలియుగమున కల్పతరువు
నీడ నీవని
కనులు తుడుచు
కామధేను తోడు నీవని
ఆ: వరములిచ్చి భయము తీర్చి
శుభముగూర్చు గంగాదేవి
అ: నిను కొలిచిన చాలునమ్మా సకలలోక పావని
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు
శుభగాత్రి గంగోత్రి
ఆ: గంగోత్రి... అ: గంగోత్రి... ఆ: గంగోత్రి...
ఆ: గల గల గల గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి (2)
అ: జీవనవాహిని... పావని...

చరణం : 1
అ: ఆ... మంచుకొండలో ఒక కొండవాగులా
ఇల జననమొందిన విరజావాహినీ
ఆ: సస సరి సరి గరి గప దప దప దప గరి సరి
సరి సరి
అ: విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా
శివగిరికి చేరిన సురగంగ నీవనీ
అ: సనిద గరిస నిదప మగరి సరి సరి గప గప గరిస
అ: అత్తింటికి సిరులనొసగు అలకనందవై
సగరకులము కాపాడిన భాగీరథివై
బదరీవన హృషికేశ హరిద్వార ప్రయాగముల
మణికర్ణిక తనలోపల వెలసిన
శ్రీవారణాసి... ॥

చరణం : 2
అ: పసుపు కుంకుమతో పాలు పన్నీటితో
శ్రీగంధపుధారతో పంచామృతాలతో
ఆ: అంగాంగం తడుపుతూ
దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం
అ: అమ్మా గంగమ్మా
కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని
యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడొద్దని
గోదారికి... కావేరికి... ఏటికి... సెలయేటికి...
కురిసేటి జడివానకి దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికీ
చెప్పమ్మా... మా గంగమ్మా...
జీవనదివిగా ఒక మోక్షనిధివిగా
పండ్లు పూలు పసుపులా పారాణి రాణిగా
ఆ: శివుని జటలనే తన నాట్యజతులుగా
జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా
అ: గండాలను పాపాలను కడిగివేయగా
ముక్తినదిని మూడు మునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననియె గంగాభవాని
ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ॥
అ: జీవన వాహిని... పావని...