Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

alelE alelE mA - అలెలే అలెలే మా

చిత్రం : మృగరాజు(mrugarAju)(2001)

రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : మణిశర్మ
గానం : ఉదిత్ నారాయణ్, శైలజ, బృందం



పల్లవి :
అతడు: అలెలే అలెలే మా అలెలే మామా
బృందం: అలెలే మామా... అలెలే మామా...॥

అ: అడవి మల్లంటి పడుచోయమ్మ
మరదలు కూన అది మరులకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు సానా
ఏ... కన్ను కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క
హే... జున్ను ముక్క జుర్రుకుపోనా
చక్కనిచుక్కా
ఆమె: అలెలే అలెలే
మా అలెలే మామా
మొగలిపూవంటి
మొగుడోయమ్మ

మరువపు తేమ తెగమరిగిన మామా
కొరకని జామ నీ చిలకది రామా
చుక్కలొచ్చేదాకా నిన్ను ఆపేదెట్టా
ఓహో దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా

చరణం : 1
అ: హే... జమాయించు
ఆ: ఓ... తమాయించు
అ: పువ్వుల బోనాలు చిరునవ్వుల దాణాలు
పుంజుకు పెట్టేస్తే లేత ముంజెల ముద్దిస్తా
ఆ: వెన్నెల బాణాలు నులివెచ్చని ప్రాణాలు
జివ్వున లాగేస్తే మావా జాతరకొచ్చేస్తా
అ: హే... ఒంపుసొంపు
వాగువంకై వచ్చేస్తావా
ఆ: యహ్... కట్టూ బొట్టూ
తేనెల పండూ గుచ్చేస్తావా॥

చరణం : 2
అ: హే... యమాగుంది...
ఆ: ఈ... జమాబందీ...
అ: చింతల తోపుల్లో నీ చింతలు దోచేస్తా
సంతల బేరాల్లో భామా సిగ్గులు తూచేస్తా
ఆ: చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
సందడి సందెల్లో మావా చాటుగ సందిస్తా
అ: హే... రేపోమాపో లగ్గాలెట్టి లంగర్లేస్తా
ఆ: అహ... ఆటూపోటూ
అడ్డేలేని ఒడ్డే చూస్తా॥

paDavA cachchindE pillA - పడవా వచ్చిందే పిల్లా

చిత్రం : సిపాయి చిన్నయ్య (sipAyi chinnayya) (1969)

రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గానం : ఘంటసాల, పి.సుశీల



పల్లవి :అతడు: పడవా వచ్చిందే పిల్లా పిల్లా హాయ్
పడవా వచ్చిందే పిల్లా పండుగ వచ్చిందే
ఆమె: పండుగ వచ్చిందోయ్ మావా
పండూ వెన్నెల వచ్చిందోయ్
ఇద్దరూ: పండూ వెన్నెల పడుచుదనంతో పందెం వేసిందీ
అ: పడవా వచ్చిందే పిల్లా...

చరణం : 1
ఆ: నీలి సంద్రం పొంగీ పొంగీ నింగిని రమ్మందీ హోయ్
అ: నీలాకాశం వంగీ వంగీ నీకో ముద్దంది
ఆ: నీలి సంద్రం పొంగీ పొంగీ నింగిని రమ్మందీ హోయ్
అ: నీలాకాశం వంగీ వంగీ నీకో ముద్దంది
ఆ: చిలిపి గాలి గోల చేసింది
అ: చిన్నదానికి సిగ్గూ కమ్మంది
బుగ్గా కందింది... బుగ్గా కందింది...
పడవా వచ్చిందే పిల్లా...

చరణం : 2
అ: చిన్నతనంలో కట్టామిక్కడ ఎన్నో పిచ్చుక గూళ్లూ (2)
పరువంలో అది ఫలించే పిల్లా వెచ్చని కౌగిళ్లూ
ఈ వెచ్చని కౌగిళ్లూ...
ఆ: అదృష్ట దేవత తెరిచెను కళ్లూ... అందరికిద్దాం భాగాలు (2)
ఈ కలిమినిచ్చినా దేవుని కాళ్లకు... రోజూ పెడదాం దండాలు
అహ... రోజూ పెడదాం దండాలు
ఇద్దరూ: పచ్చగ ఉందామూ ముద్దూ ముచ్చటగుందామా (2)
అ: పడవా వచ్చిందే పిల్లా...

SamkarAbharaNamthO - శంకరాభరణంతో

చిత్రం : ఇద్దరమ్మాయిలతో (IddarammAyilathO)(2013)

రచన, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : మనో, సుచిత్ సురేసన్, రనీన రెడ్డి

సాకీ : శ్రీశ్రీశ్రీ రంగ రంగ రంగాచార్యుల వారి
సింగిల్ నాద సంకీర్తన
ఆదితాళం పూర్ణకుంభరాగం
అనుపల్లవి : ఆ... శభాష్... ఆ...
సా నిసా నిసా నిసా నిసగరిసా నిసాసా
సా నిసా నిసా నిసా నిసగమపా ॥నిసా॥
పల్లవి : శంకరాభరణంతో స్నానం చేస్తా
నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా
రంజని రాగంతో రప్ఫాడేస్తా
నిన్ను భైరవి రాగంతో భయపెట్టేస్తా
హంసధ్వని రాగంతో హింసించేస్తా
నిన్ను హిందోళ రాగంతో హీటెక్కిస్తా
శంకరా... శంకరా... ॥
నిన్ను భైరవి రాగంతో భస్మం చేస్తా ॥నిసా॥

చరణం :1Hey do you want some music u uu
Do you want some music u uuuu o hei mee
పాస్‌వర్డో తేల్చేసుకుందాం తాడో పేడో
1 2 3 4 చూసేద్దామా...
హీరో హీరో నువ్వో నేనో ఎవరో
Do you want some music u uu (2)
ధిరన ధిరన తకిట తకిట జతులను పాడి
ఉరుము మెరుపు కలిపి వాన కురిపించేస్తా
ససస రిరిరి గగగ మమమ స్వరములతోటి
మధుర నిధుల గదుల తలుపు తెరిపించేస్తా
స్వరాల బ్రహ్మతోటి నీకేంటిరా పోటీ
నీ నరాలతో సితారు వాయిస్తా... ఆ...
॥॥నిసా॥

చరణం : 2
Hey H I P H O P hooo.....
హిప్‌హాప్‌తో ఊపేస్తా... నీ హిప్పును వంచేస్తా హో...
Do you want some music హా...
D I S C O... disco...
తికమక పెట్టేస్తా చూస్కో... దమ్ముంటే రారా కాస్కో
హే... స్టార్ట్ చేశానో రాక్ అండ్ రోల్
వదిలేస్తా నా సెల్ఫ్ కంట్రోల్
ఈ బాడీతో వాయిస్తా డోల్
Do you want some music u uu (2)
తకిట తకిట తక ధికిట ధికిట తక
తకిట తకిట తక ధింధింతా
మకిట మకిట నక రికిట రికిట తక
తకిట తకిట తన తోంతోంతా
ధగిణ ధగిణ ధగ ధికిణధికిణ ధిగ
తోం తతకిట ధీం తతకిట నంనం
ధీం తతకిట తోం తతకిట భంభం
తకిట తకిట తోం తోం... తకిట తకిట భూం భూం...
సానిససా నిససా నిససా నిసమా
సగగా సగగా సగగా సపమా
గమమా గపమా గమమా గమపా
మపపా మపపా మపపా మపనీ
పనినీ పనిసా నిససా నిసమా
సమా సమా మపా మదా మాపా