Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

kAjalu chellivA - కాజలు చెల్లివా

సాకీ :
హల్లో బాయ్స్ అండ్ గాళ్స్
This song is dedicated to
all the youth of A.P
అమ్మాయిల్ని చూసి
టెమ్టైపోయి మెల్టైపోయి
బాగా దెబ్బయ్‌పోయి...
లైఫ్‌లో హర్టైపోయి మట్టైపోయిన
కుర్రాళ్లందరికీ ఈ పాట అంకితం...
పల్లవి :
కాజలు చెల్లివా... కరీనాకి కజిన్‌వా
కత్తిరీనా కైపువా... కత్తిలాంటి ఫిగరివా॥
అయినా లవ్ చేస్తే పోజే కొడతవే
మనసే నీకిస్తే ఇజ్జద్దీస్తవే
ఎందుకే ఎదవజన్మ ఏటిలోన దూకవే
వినవే కన్యాకుమారి కేరేంగె సవారీ
రబనే బనాదీ జోడీ అమ్మడూ అమ్మాడీ॥
చరణం : 1
నా గుండెల్లోన కుక్కర్‌కేమో మంటెట్టింది నువ్వేగా
విజిలుకొట్టీ పిలుస్తుంటే
పిల్లా విసుక్కుంటావా
ఏయ్... సర్దాపుట్టీ చీమలపుట్ట
లాంటి వాణ్ణి కెలికితే
ఎట్టుంటాదో ఏమవుతాదో
నేడే చూపిస్తా
రాజమౌళి ఈగలాగ
నిన్ను వదిలి పెట్టనే॥
చరణం : 2
మీరు ప్రేమదోమ తొక్కతోలు ఎన్నో ఎన్నో అంటారే
నీళ్లల్లోకి రాళ్లే రువ్వి కల్లోలాన్నే తెస్తారే
మేం ఇన్నాళ్లుగా దాచుకున్న ఒకే ఒక మనసుతో
గూటీబిళ్ల గోళీకాయ ఆడేస్కుంటారే
ఇంత ఇంత హింసపెడితే ఉసురుతగిలిపోతరే॥


చిత్రం : బలుపు (Balupu) (2013)

రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : రవితేజ, ఎస్.ఎస్.థమన్

jAbilli enDallO - జాబిల్లి ఎండల్లో


చిత్రం : అగ్ని(Agni) (1989)

రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : హంసలేఖ, గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి


పల్లవి :
అతడు: జాబిల్లి ఎండల్లో సరసాలు
సరదాలు కసిగా కథలా మొదలాయే
ఆమె: ఈ పూలదండల్లో యమకాలు
చమకాలు తొలిగా చలిగా కథలాయే
అ: తనువుల కదలిక నడుముల
కలయిక ఏమి తాళమో
ఆ: అదిమెను అడగక బిగువును
వదలక ఎంత తాపమో ॥
చరణం : 1
అ: చిన్నప్పుడు ఈడున్నప్పుడు వేడున్నప్పుడు
రేగే చప్పుడు
ఎక్కడికక్కడ ఎక్కిడి తొక్కిడి సోకులు సిక్కడి ముద్దుల
ముట్టడి సాగినప్పుడు... తొందరే పుట్టినప్పుడు...
ఆ: ఈ కుప్పెడు నా గుట్టిప్పుడు విడగొట్టిప్పుడు
జతకట్టిప్పుడు
చక్కెర చెక్కిలి చెక్కిన ఎంగిలి అంటిన కౌగిలి
అక్కిటి లోగిలి చేరినప్పుడు... సిగ్గులు జారినప్పుడు...
అ: జాజుల మల్లెల మోజుల వెల్లువ
రోజొక వెన్నెల చిలికిన వలపుల
అలికిడికి తడిసిన తనువుల
సందెల చిందిన చందన కుంకుమ
వందనమన్నది ఇంధనమైనది
ఇద్దరి మోహ లాహిరిలో ॥
చరణం : 2
ఆ: మాటిచ్చుకో ఎదచోటిచ్చుకో
పొదమాటిచ్చుకో పెదవే పుచ్చుకో
అత్తరు మల్లెల మత్తులలోబడి
ఒత్తరి జీవుడు
హత్తుకుపోయిన రాసలీలలో... ఇప్పుడే బాసచేసుకో...
అ: పూవందుకో చిరునవ్వందుకో
జత నువ్వెందుకో నీకు లవ్వెందుకో
మెత్తని కాముడి జిత్తులలో పడి ఒత్తుకు పోయెడి
ఒంపులలో సుడి తాకి చూడనా
చూడని తళుకు చూడనా...
ఆ: చుక్కలకందక చిక్కని సందిట చెక్కిలి ఇచ్చట
తెలిసిన వయసుల
మదనముడి బిగిసిన మనసుల సందడి ఊహల
సందుల దూరిన పొందుల వేళకు
విందులు కోరిన తేనెల వానల తాకిడిలో॥
External Link:
| Download |

nE vinnadi nijamEnA - నే విన్నది నిజమేనా


చిత్రం : గ్రీకువీరుడు(Greeku VeeruDu) (2013)

రచన : బాలాజీ
సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : రంజిత్, రీటా


సాకీ :
అతడు:Oh baby am in Love
O girl am shining like a Star above
Right now am feeling like u making me
Crazy cause am faling in love
Baby u always mine
Forever together we will always shine
I love U more than you never know
I can never ever let you go
పల్లవి :
అ: నే విన్నది నిజమేనా నువ్వన్నది నేనేనా
నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా
ఆమె: నీ కన్నులు మూస్తున్నా నీ కలలే కంటున్నా
నీ ప్రేమకు నేనిక బానిసనవుతున్నా
అ: హే... నువు దొరికిన వరమని తెలిసే
నిను వదలక తిరిగెను మనసే
తడబడి ఎద పరుగులు తీసే
ప్రతి అడుగున నిన్నిక చూసే
ఆ: నిను నను మనమని ముడివేసే
చెరిసగమై పోయెను మనసే (2)॥Oh baby॥
అ: నే విన్నది నిజమేనా నువ్వన్నది నేనేనా
నా గుండెల చప్పుడు
ఇప్పుడు నీదేనా
చరణం :
అ: హే... అణువణువున హాయనిపించే
జ్ఞాపకమే నీదిగా
ఆ: నా నీడకు రూపం ఉంటే
అది నువ్వేగా
అ: హే... ప్రతిజన్మకు తోడుగా నేనై
పరిచ ర్యలు చేయనా
ఆ: ప్రతి క్షణమొక జన్మను చూస్తా నీ ఒడిలోన
నిన్నూ నన్నూ కలిపింది మధ్య దూరం
వేరే ఉన్నా మన ఇద్దరిదొక ప్రాణం
మన ఇద్దరిదొక ప్రాణం...॥Oh baby॥
అ: నే విన్నది నిజమేనా నువ్వన్నది నేనేనా
నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా