Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

OhO bulli pAvuramA - ఓహో3బుల్లి పావురమా


చిత్రం : బృందావనం(brindAvanam( (1992)

రచన : వెన్నెలకంటి
సంగీతం : మాధవపెద్ది సురేష్
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి


పల్లవి :
అతడు: ఓహో ఓహో ఓహో
బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా... ఓ...
అలకలు వారి సొంతమా
ఆమె: ఓహో ఓహో ఓహో
బుల్లి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా... ఓ...
శ్రుతి ఇంక మించనీకుమా...
చరణం : 1
అ: మాటే వినకుంటే బైటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంటా
ఆ: అమ్మో మగవారు అన్నిటా తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
అ: కోపం తీరాలంట తాపం తగ్గాలంట
ఆ: తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
అ: మాటామంతీ మర్యాదే
అపచారమా!॥ఓహో॥
చరణం : 2
అ: నీయంతియ్యంగా
చెయ్యగ రమ్మంటా
వియ్యాల పందిట్లో కయ్యం తగదంట
ఆ: గిల్లికజ్జాలే చెల్లవు పొమ్మంటా
అల్లరి చాలిస్తే ఎంతో మేలంట
అ: వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట
ఆ: కొంటెకుర్రాళ్లకూ అదియే సరియంట
అ: తగనీ తెగనీ తగువంతా తన నైజమా॥ఓహో॥

eDArilO kOyila - ఎడారిలో కోయిల

చిత్రం : పంతులమ్మ(pantulamma) (1977)

రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : రాజన్-నాగేంద్ర,
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :
ఎడారిలో కోయిల తెల్లారని రేయిలా
పూదారులన్నీ గోదారి కాగా (2)
పాడింది కన్నీటిపాట ॥
చరణం : 1
ఎద వీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నా దేవత
కల అయితే శిల అయితే మిగిలింది
ఈ గుండె కోత
నా కోసమే విరబూసిన మనసున్న మనసైన మరుమల్లిక
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలు పూత
రగిలింది ఈ రాలు పూత విధిరాత చేత నా స్వర్ణ సీత॥
చరణం : 2
నా రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్లు నూరేళ్లుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాప
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిట
బ్రతుకంటే మృతి కంటే
చేదైన ఒక తీపి పాట.... (2)
చెలిలేని పాట... ఒక చేదు పాట॥
* * * * * * *

tEneTIga kuDutuNTE - తేనెటీగ కుడుతుంటే

చిత్రం : పంతులమ్మ(pantulamma) (1977)

రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : రాజన్-నాగేంద్ర,
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి :
ఆమె: తేనెటీగ కుడుతుంటే తీపిగుంటదా (2)
ఐనా నువ్వు కన్ను కొడుతుంటే
ఎన్నెలొస్తదీ ఎన్నో వన్నెలిస్తదీ
అతడు: పూలజల్లు పడుతుంటే.... హాహా అహాహా...
పూలజల్లు పడుతుంటే ఎల్లువొస్తదా
ఐనా నువ్వు పక్కకొస్తుంటే
పండగొస్తదీ వయసే పంటకొస్తదీ
చరణం : 1
అ: అయ్యారే
వయ్యారమూగింది ఉయ్యాల
ఇయ్యాల నా వలపే
నీ తలుపు తీయాలా
ఏసింది ఈడు ఈల చేసింది గోల
నీ జోడు కావాలా నా తోడు రావాలా
ఆ: సందేళ నీ సోకు జాబిల్లి కావాలా
చీకట్లో నీ నవ్వు పువ్వులెట్టుకోవాలా
నీ వేడి నాకు ఓడి చల్లారే ఈ వేళ
నీ వాడి చూపుల్లో తెల్లారిపోవాలా॥
చరణం : 2
అ: గోరింక తాకంగ నెలవంక నవ్వాలా
ఆ: గోరంత నీ ఎలుగు కొండంత కావాలా
అ: ఆ కంటికి కన్ను కాటుకై పోవాలా
ఆ: నీ చూపు నా చూపు చుట్టాలు కావాలా
అ: వానొచ్చి వరదల్లే నీ వయసు పొంగాలా
ఆ: నేనొచ్చి వలపల్లే వాటేసుకోవాలా
అ: నా ఎండకే నీబుగ్గ ఎన్నెల్లు కాయాలా
ఆ: కౌగిట్లో నా బ్రతుకు కడతేరిపోవాలా॥
External Link:
| Download Pantulamma (1977) All Songs |

hE endukE - హే ఎందుకే

పల్లవి :
హే... ఎందుకే ఎందుకే...
నువ్వు ఎందుకిలా చేశావే
ఎందుకే... ఓ ఎందుకే ఎందుకే
ఓ ఎందుకో నువ్వే నచ్చాశావే
నా ఎదలో ప్లేసే కొట్టేశావే...

తెలియని లోకం చూపించావే
నడిరోడ్డున నన్నే వదిలిశావే
ఊహించని ట్విస్టే ఇచ్చేశావే
నా డెస్టినీ మొత్తం మార్చేశావే
నా జిందగీ డేంజర్ జోన్‌కి తోశావెందుకే
ఎందుకే ఎందుకే...
ఓ ఓ ఓ... నువు ఎందుకిలా చేశావే
ఓ ఓ ఓ... నన్ను నిండా ముంచేశావే
ఓ ఓ ఓ... నువ్వు ఎందుకిలా చేశావే
చరణం : 1
కొలవాలంటే అబ్బాయిల ప్రేమ చైనా వాలే చాలదే
కూల్చాలంటే అమ్మాయిలు మీకే చిటికెలో పని కదే
ఓ లవ్‌స్టోరీ లక్కు హీరోలు దేవదా మజ్ను
మా ఫ్యామిలే కదే
సిన్సియర్ లవ్‌కి కేర్ ఆఫ్ అడ్రస్ నను మిస్సవ్వకే
నా ప్రేమ నైన్తు వండరే...
నాలాంటి లవ్వరు ఉండడే...
నీ సోలుమేటు నేనులే...
సోలోగా వదిలేయకే ఎళ్లకే ఎళ్లకే...
నన్ను వదిలేసి ఎళ్లిపోకే...
ఓ ఓ ఓ... మన రిష్తా తెంచేయమాకే
ఓ ఓ ఓ... నువ్వంటే ఇష్టం నాకే॥ఎందుకో॥
చరణం : 2
మీఠీ మీఠీ మాటల్తో నన్నే బోల్తా కొట్టించావులే
స్వీటీ క్యూటీ నవ్వుల్తో ఇంకా లూటీ చేయకే
ఓ... సున్నా నడుము బిగించి నన్నే శూన్యంలో తోశావులే
నా గుండెల్లో నొక్కేసి గొంతే నొక్కేసెయ్యకే
అడుగుదూరం ప్యార్‌ని అందకుండా చేయకే
పంచకుండా ప్రేమని ప్రాణాలు తోడెయ్యకే
ఎందుకే ఎందుకే నువు నా కంట పడ్డావే
ఓ ఓ ఓ... చుక్కల్లోకెగరేశావే
ఓ ఓ ఓ... రెక్కల్నే తెంచేశావే
ఓ ఓ ఓ... నువు ఎందుకిలా చేశావే

చిత్రం : అడ్డా (2013), రచన : శ్రీమణి
సంగీతం : అనూప్ రూబెన్స్, గానం : శ్రీరామచంద్ర