Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

madi vuyyAlalUgE - మది ఉయ్యాలలూగే

చిత్రం : భలే అమ్మాయిలు - bhalE ammAyilu(1957)

 రచన : సదాశివబ్రహ్మం
 సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గీత స్మరణం
07 December : నేడు సావిత్రి జయంతి - Today SAvitri Birthday

 పల్లవి :
 ఆమె: మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే
 మాసనమానందమాయెనహో... ॥
 అతడు: ప్రేమతో గగన వీధులలో
   హాయిగా ఎగిరిపోవుదమా         (2) ॥

 చరణం : 1

 ఆ: తీయని కోరికలూరెను నాలో
 తెలియదు కారణమేమో ॥
 ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా... ప్రణయమిదేనా    (2)
 నూతన యవ్వన సమయమున ॥

 చరణం : 2

 అ: చిన్నతనమేలా సిగ్గు పడనేలా
 మన్ననలెందుకు మనలోనా ॥
 ఆ: ప్రేమలో కరగిపోవుదమా
 భేదమే మరచిపోవుదమా    ॥

 చరణం : 3

 అ: ఓ చెలియా మన జీవితమంతా
 పున్నమ వెన్నెల కాదా
 ఆ: రేయి పవలు నే నిను మురిపించి... నిను వలపించి
 ప్రేమ జగానికి కొనిపోనా ॥
 గానం : ఘంటసాల, పి.లీల

O O O ohO bangaru chilaka - ఓ ఓ ఓ... ఒహో బంగరు చిలక

 పల్లవి :

 ఓ ఓ ఓ... ఒహో బంగరు చిలక
 అహా ఎందుకె అలుక
 ఇలా చూడవు మాటాడవు మోమాటమా ॥

 చరణం : 1

 చెరువు మీద అలకైతే చెడేదెవ్వరో
 ఫలహారం మాని బాధపడేదెవ్వరో ॥
 చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా     (2)
 ఒక మాటకు వరహాలు ఒలికిపోవునా
 వరాలొలికి పోవునా... ॥

 చరణం : 2

 ఓ ఓ ఓ ఓ...
 కనికారం లేదా కన్నెదుట నిలచినా
 అనురాగం రాదా నోరూర పిలచినా ॥
 చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా     (2)
 ఒక మాటకు వరహాలు ఒలికిపోవునా
 వరాలొలికి పోవునా... ॥
 గానం : జిక్కి

O dharmadAtA - ఓ ధర్మదాతా

చిత్రం : ధర్మదాత - dharmadhAta (1970)

రచన : డా॥సి.నారాయణరెడ్డి
 సంగీతం : టి.చలపతిరావు
గానం :ఘంటసాల
గీత స్మరణం

 సాకీ :
 ఓ ధర్మదాతా... ఓ ధర్మదాతా!
 పల్లవి :
 ఎవరూ నీవారు కారు
 ఎవరూ నీతోడు రారు
 అడిగిన వారికి లేదనక     (2)
 అర్పించిన ఓ ధర్మదాతా॥
 చరణం : 1
 సగము దేహమై నిలిచిన నీ దేవి
 రగిలే చితిలో రాలింది
 పుట్టెడు మమతలు పండించు ఇల్లాలు
 పిడికెడు బూడిదగా మారింది
 ముత్తైవుగా ముగిసిన సతి మేను   (2)
 కృష్ణవేణిగా మిగిలింది (2) ॥
 చరణం : 2
 కల్పతరువుగా వెలసిన భవనం
 కడకు మోడుగా మారేనా
 కోటి దివ్వెలను నిలిపిన నీకే
 నిలువ నీడయే కరువాయెనా
 పూవులమ్ముకొని బ్రతికే చోట   (2)
 కట్టెలమ్ముకొను గతి పట్టెనా
 ఓ ధర్మదాతా... ఓ ధర్మదాతా!

OhO OhO pAvuramA - ఓహో ఓహో పావురమా

చిత్రం: మంచిమనసులు - manchi manasulu (1962)

 రచన: ఆచార్య ఆత్రేయ
 సంగీతం: కె.వి.మహదేవన్
గానం: ఎస్.జానకి

గీత స్మరణం
పల్లవి :
 ఓహో ఓహో...
 ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా    (2)
 మావారి అందాలు నీవైన తెలుపుమా    (2) ॥ఓహో॥
 చరణం : 1
  మనసు మధురమైనది మమతలు నిండినది
 సొగసు నేనెరుగనిది చూడాలని ఉన్నది    ॥
 అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా?    (2)
 కరవుతీర ఒక్కసారి కాంతునమ్మ వారినీ    ॥ఓహో॥
 చరణం : 2
 వలపుకన్న తీయని పలుకులు వారివి
 తలచుకున్న చాలును పులకరించు నా మేను ॥
 మగసిరి దొరయని మరునికి సరియని     (2)
 అందరు అందురే అంత అందమైనవారా
 ఓహో ఓహో॥
 చరణం: 3
 అందరి కన్నులు అయ్యగారి మీదనే
 దిష్టి తగలగలదనీ తెలిపిరమ్మ కొందరు॥
 అన్నది నిజమేనా అల్లిన కథలేనా     (2)
 కన్నులున్న నీవైనా ఉన్నమాట చెప్పుమా    ఓహో ఓహో॥