చిత్రం : అంతస్తులు (1965), రచన : కొసరాజు
సంగీతం : కె.వి.మహదేవన్, గానం : భానుమతి
పల్లవి :
దులపర బుల్లోడో హోయ్ హోయ్...
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
పిలిపి కళ్లతో షికార్లు కొట్టే
మలపు రాములను పిలక బట్టుకొని
వన్ టూ త్రీ చెప్పి...॥
చరణం : 1
సిరిగల చుక్కల చీర కట్టుకొని
జవాది కలిపిన బొట్టు పెట్టుకొని ॥
వరాల బొమ్మ ముద్దులగుమ్మ
కాలే జీకి కదిలిందంటే వెకిలివెకిలిగా
వెర్రివెర్రిగా వెంటపడే
రౌడీల పట్టుకొని... పట్టుకొని
తళాంగు త థిగిణ తక తోం తోం అని (2)
॥
చరణం : 2
సాంప్రదాయమగు చక్కని పిల్ల
సాయంకాలం సినిమాకొస్తే... వస్తే...
॥
ఇదే సమయమని ఇంతే చాలునని
పక్క సీటులో బైఠాయించుకొని ఎట్టా
చీకటి మరుగున చేతులు వేసే
శిఖండిగాళ్లను ఒడిసి పట్టుకొని
చింతబరికెను చేత పట్టుకొని (2)॥
చరణం : 3
రోడ్డు పట్టని కారులున్నవని
మూడంతస్తుల మేడలున్నవని (2)
డబ్బు చూచి ఎటువంటి ఆడది
తప్పకుండా తమ వల్లో పడునని
ఈలలు వేసి సైగలు చేసే
గోల చేయు సోగ్గాలను బట్టి... పట్టి
వీపుకు బాగా సున్నం పెట్టి (2)॥
చరణం : 4
మాయమర్మం తెలియని చిన్నది
మంగళగిరి తిరనాళ్లకు పోతే... పోతే
॥
జనం ఒత్తిడికి సతమతమౌతూ
దిక్కుతోచక తికమక పడితే అయ్యయ్యో
సందు చూసుకొని సరసాలకు దిగు
గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమా రమణ గోవిందా... (2)॥
07 September - నేడు భానుమతి జయంతి