చిత్రం : అక్బర్ సలీం అనార్కలి(akbar saleem anArkali) (1978)
రచన : డా॥సి.నారాయణరెడ్డి(Dr C.NarayanaReddy)
సంగీతం : సి.రామచంద్ర(C.Ramachandra)
గానం : మహ్మద్ రఫీ(Md.raffi), పి.సుశీల(P.SusIla)
24 December - నేడు మహమ్మద్ రఫీ జయంతి
పల్లవి :సిపాయి... సిపాయి
సిపాయి... సిపాయి
నీకై ఎంత ఎంత
వేచి వేచి ఉన్నానో
ఈ వాలు
కనులనడుగు
అడుగు చెబుతాయి
సిపాయి ఓ... సిపాయి
హసీనా... హసీనా
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు
అడుగు ఇకనైనా
హసీనా ఓ... హసీనా
చరణం : 1
జడలోని మల్లెలు జారితే
నీ ఒడిలో ఉన్నాననుకున్నా
చిరుగాలిలో కురులూగితే (2)
నీ చేయి సోకెనని అనుకున్నా
ఆ... మల్లెలలో కదలాడినవి
నా కలవరింపులే
ఆ గాలిలో చెలరేగినవి... (2)
నా నిట్టూరుపులే...
హసీనా ఓ... హసీనా
॥ఎంత॥
చరణం : 2
తడి ఇసుకను
గీసిన గీతలు అల
తాకితే మాసిపోతాయి
ఎదలోన వ్రాసిన లేఖలు ఎదలోన వ్రాసిన లేఖలు
బ్రతుకంతా
ఉండిపోతాయి
ఆ... లేఖలలో
ఉదయించినవి
నా భాగ్యరేఖలే
మన ఊపిరిలో పులకించినవి (2)
వలపు బాటలే...
సిపాయి ఓ... సిపాయి
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు
అడుగు ఇకనైనా
హసీనా ఓ... హసీనా
సిపాయి ఓ... సిపాయి
హసీనా ఓ... హసీనా
