errA buggala mIda - ఎర్రా బుగ్గల మీద
చిత్రం : గూఢచారి 116 (gUdhachAri 116)(1966)రచన : డా॥సి.నారాయణరెడ్డి(Dr.C.nArAyaNa Reddy)
సంగీతం : టి.చలపతిరావు(T.chalapatirAo)
గానం : ఘంటసాల, పి.సుశీల, బృందం(ghanTasAla,P.suSeela group)
22 February - నేడు టి.చలపతిరావు వర్ధంతి
పల్లవి : ఎర్రా బుగ్గల మీద మనసైతే
నువు ఏం చేస్తావోయ్ సోగ్గాడా ॥ఎర్రా ॥
ఎర్రా బుగ్గల మీద మనసుంది
కాని ఇందరిలో ఏం బాగుంటుంది ॥ఎర్రా ॥
చరణం : 1
మొక్కజొన్న తోటలోన కలుసుకుంటవా
మక్కువంత ఒక్కసారి తెలుసుకుంటవా
మొక్కజొన్న... తోటలోన... (2)॥ మొక్కజొన్న॥
మొక్కజొన్న తోటలోన
మక్కువంత తెలుసుకుంటే
నక్కి ఉన్న నక్కలన్నీ నవ్వుకుంటయే
॥ఎర్రా ॥ ॥ఎర్రా ॥
చరణం : 2
కాకినాడ రేవుకాడ కలుసుకుంటవా
నా కళ్లలోని బాసలన్నీ తెలపమంటవా
కాకినాడ... రేవు కాడ... (2)॥
కాకినాడ రేవు కాడ కళ్లు కళ్లు కలుపుకుంటే
ఓడలోని నీటుగాళ్లు ఊరకుంటరా
॥ఎర్రా ॥ ॥ఎర్రా ॥
చరణం : 3
గండిపేట చెరువుకాడ కలుసుకుంటవా
కలుసుకొని గుండె లోతు తెలుసుకుంటవా
గండిపేట... చెరువు కాడ... (2)
॥గండిపేట॥
గండిపేట చెరువు కాడ
గుండెలోతు తెలుసుకుంటే
గండు పులులు పొంచి పొంచి
గాండ్రుమంటయే ॥ గాండ్రుమంటయే॥
Special Note:
పూర్తిపేరు : తాతినేని చలపతిరావు
జననం : 22-12-1920
జన్మస్థలం : కృష్ణాజిల్లా,
ఉయ్యూరు దగ్గర నందమూరు
జన్మనిచ్చిన తల్లిదండ్రులు :
ద్రోణవల్లి మాణిక్యమ్మ, రత్తయ్య
దత్తత తీసుకున్న తల్లిదండ్రులు :
తాతినేని కోటమ్మ, కోటేశ్వరరావు
తోబుట్టువులు : నలుగురు అక్కచెల్లెళ్లు (1. మానికొండ బుల్లెమ్మ, 2. పాలడుగు సీతారావమ్మ,
3. చిగురుపాటి బాపమ్మ, 4. తులసీబాయి), ముగ్గురు అన్నదమ్ములు (1.సూర్యనారాయణ,
2. రాఘవయ్య, 3. నాగభూషణం)
విద్యార్హత : బి.ఇ. (ఎలక్ట్రికల్)
వివాహం - భార్యలు : 1. 1936-అన్నపూర్ణమ్మ (గృహిణి), 2. జమునా కుమారి (డాక్టర్)
సంతానం : ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి
(1. సతీష్ - సన్ టీవీ ఎడిటర్, 2. ప్రశాంత్ - దుబాయ్‌లో నెట్‌వర్కింగ్ ఇంజినీర్, 3. కవిత - వర్జీనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్)
తొలిచిత్రం : పుట్టిల్లు (1953) (మోహన్‌దాస్‌తో కలిసి)
సోలోగా తొలిచిత్రం : అమరదీపం (తమిళం)
ఆఖరిచిత్రం : జనం-మనం (1984)
సంగీతం అందించిన చిత్రాలు : సుమారు 125
నిర్మించిన సినిమాలు : మంచి మనిషి (1964), చల్లని నీడ (1968)
నటించిన సినిమాలు -పాత్రలు : గూఢచారి 116 (1967) చిత్రంలో ‘ఎర్రాబుగ్గల మీద మనసైతే...’ పాటలో ఆర్కెస్ట్రా కండక్టర్‌గా, మంచిమనిషి (1964)లో న్యాయమూర్తిగా కనిపిస్తారు.
ఇష్టమైన వాద్యం : హార్మోనియం
మరణం : 22-02-1994