pulaki~nchani madi - పులకించని మది
చిత్రం : పెళ్లికానుక(peLlikAnuka) (1960)రచన : ఆచార్య ఆత్రేయ(achArya AtrEya)
సంగీతం : ఎ.ఎం.రాజా(A.M.rAjA)
గానం : జిక్కి(jikki)
06 March - నేడు కృష్ణకుమారి పుట్టినరోజు
పల్లవి :
పులకించని మది పులకించు
వినిపించని కథ వినిపించు
కనిపించని ఆశలనించు
మనసునే మరపించు
గానం మనసునే మరపించు॥
చరణం : 1
రాగమందనురాగమొలికి
రక్తినొసగును గానం ॥
రేపురేపను తీపి కలలకు
రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను
చేర్చిగూర్చును గానం
జీవమొసగును గానం...
మది చింతబాపును గానం...॥
చరణం : 2
వాడిపోయిన పైరులైనా
నీరుగని నర్తించును॥
కూలిపోయిన తీగలైనా
కొమ్మనలమీ ప్రాకునూ
కన్నెమనసు ఎన్నుకొన్న
తోడు దొరికిన మురియు
దోరవలపే కురియు
మదిదోచుకొమ్మని పిలుచు॥
ప్రేమ మనసునే మరపించు
Special Note:
కృష్ణకుమారి 1933, మార్చి 6న పశ్చిమబెంగాల్‌లోని నైహతిలో జన్మించారు. ఈమె షావుకారు జానకి చెల్లెలు. ఇంటర్ వరకు చదివిన కృష్ణకుమారి 18 ఏళ్లకే ‘నవ్వితే నవరత్నాలు (1951)’ తో సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటి తెలుగు అగ్రహీరోలైన ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్., కాంతారావు, జగ్గయ్యలతో కలిసి ఎన్నో చిత్రాలలో మంచి మంచి పాత్రలను పోషించారు. ప్రస్తుతం బెంగళూర్‌లో నివాసముంటున్నారు.