చిత్రం : తోబుట్టువులు(tObuTTuvulu) (1963)
రచన : అనిసెట్టి(aniseTTi)
సంగీతం : సి.మోహన్‌దాస్(C.mOhandAs)
గానం : ఘంటసాల, పి.సుశీల(ghanTasAla,P.susIla)
05 March - జగ్గయ్య వర్ధంతి
పల్లవి :
మధురమైన రేయిలో
మరపురాని హాయిలో
పండు వెన్నెలే నేడు పాడెనేలనో॥
చరణం : 1
తళుకు తళుకు తారలే
అద్దాల నీట ఊగెలే (2)
కలల రాణి జాబిలి
నా కన్నులందు దాగెలే
పండు వెన్నెలే నేడు పాడెనేలనో॥
చరణం : 2
చిలిపి చిలిపి నవ్వులే
చిందించెనేల పువ్వులే (2)
ఆశమీర హృదయమే
ఆనంద నాట్యమాడెలే
పండు వెన్నెలే నేడు పాడెనేలనో॥
Special Note:
కొంగరు జగ్గయ్య గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో డిసెంబర్ 31, 1928లో జన్మించారు. త్రిపురనేని గోపిచంద్ తీసిన ‘ప్రియురాలు (1952)’ సినిమాతో జగ్గయ్య సినీరంగ ప్రవేశం చేశారు. నటడుగానే కాక రచయిత, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తలు చదివేవారిగా మనందరికి సుపరిచితులు.
Other Links:
madhuramaina rEyilO
madhuramaina rEyilO